Adulteration: బాబోయ్‌.. ఇదేం మాయా బజార్‌రా సామీ..! ఉప్పు కల్తీతో జనం చిత్తవుతున్నారు..

మనం తినే ఆహారం కల్తీ రహితమా అన్నది పెద్ద ప్రశ్నగా మారిన తరుణంలో.. ధర ఎక్కువైనా మనం కొనుగోలు చేసే వస్తువులు మన ఆరోగ్యానికి శత్రువుగా మారతాయని ఎవరూ ఊహించలేదు. రోజంతా మనం తీసుకునే ఆహారంలో అతి చౌకైన ఉప్పు కూడా కల్తీకి అతీతం కాదని మీకు తెలుసా ? ఉప్పులో కల్తీని తేలికగా గుర్తించలేకపోవడం వల్ల ప్రజలకు తెలియకుండానే కల్తీ ఉప్పును వాడుతూ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.

Adulteration: బాబోయ్‌.. ఇదేం మాయా బజార్‌రా సామీ..! ఉప్పు కల్తీతో జనం చిత్తవుతున్నారు..
Salt
Follow us
Jyothi Gadda

|

Updated on: Mar 23, 2024 | 3:09 PM

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్టుగా మార్కెట్‌లో లభించే చాలా ఉత్పత్తులు కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు కొందరు కంత్రీగాళ్లు. కల్తీ ఉత్పత్తులు, ఆహారాలతో ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లుతోంది. మసాలా దినుసుల నుంచి టీ, మైదా, బిస్కెట్లు, నూనె, పప్పులు, నెయ్యి ఇలా అన్నింటిలోనూ కల్తీ జరుగుతోంది. కందిపప్పులో కేసరి పప్పు, పాలు చిక్కగా కన్పించడం కోసం బియ్యం పిండి, మైదా వంటివి కలుపుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా నేడు మనిషి తీసుకునే ప్రతి ఆహార పదార్థంలోనూ కల్తీ రాజ్యమేలుతోంది. ఇప్పుడు మరోషాకింగ్‌ విషయం ఏంటంటే.. ప్రతి నిత్యం అందరూ తప్పక వాడే ఉప్పు కూడా కల్తీ అవుతుండటం. ఉప్పు కల్తీ అనే విషయం ప్రజల్లో మరింత ఆందోళన కలిగిస్తుంది.

మన ఆహారంలో ఉప్పు ఒక ప్రాథమిక అంశం. ఉప్పు సహజంగా సముద్రపు నీటి నుండి తయారు చేస్తారు. దానిలోని అనేక ఔషధ గుణాల కారణంగా ఇది అనివార్యమైంది. అయితే ఉప్పు కల్తీ విస్తృతంగా మారింది. ప్రాసెస్ చేసిన ఉప్పు తినడం వల్ల శరీరానికి సాధారణంగా ఉండాల్సిన ఔషధ గుణాలు లభించవు. అదనంగా, మిశ్రమ ఉప్పు శరీరంలో అనేక రుగ్మతలను కలిగిస్తుంది. అయోడిన్ డెఫిషియెన్సీ డిజార్డర్ (IDD) వంటి అనేక సమస్యలు కూడా వస్తాయి. ప్రాసెస్ చేసిన ఉప్పు తినడం మెదడు పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది. అయితే, ఇలాంటి కల్తీ ఉప్పును ఎలా గుర్తించాలనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. కానీ, ఉప్పులో కల్తీ అనేది సాధారణంగా అంత తేలికగా గుర్తించలేం. మనకు తెలియకుండానే రిఫైన్డ్ సాల్ట్ తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాం.

అయోడైజ్డ్ ఉప్పు.. పూర్తిగా శుద్ధి చేసిన అనంతరం మనం సాధారణంగా వంటలో ఉపయోగిస్తాము. శుద్ధి చేసిన ఉప్పు తెలుపు రంగులో ఉంటుంది. టేబుల్ సాల్ట్ సహజంగా ఏదైనా ఆహారంతో మిళితం అవుతుంది. టేబుల్ ఉప్పు స్వచ్ఛతను సులభంగా గుర్తించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అవి తేలికైనవి. మనం తినే ఉప్పు స్వచ్ఛతను చెక్‌ చేయడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి ఇక్కడ కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

నీటి పరీక్ష..

సాధారణంగా తెలుపు రంగు ఉప్పును అదే రంగు సున్నంతో కలుపుతారు. ఈ కల్తీని గుర్తించడానికి ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా ఉప్పు తీసుకుని బాగా కలపాలి. ఉప్పులో సున్నం కలిపితే నీరు తెల్లగా మారుతుంది. కరగని మలినాలు దిగువన స్థిరపడతాయి.

బంగాళాదుంప ప్రయోగం..

ఒక బంగాళాదుంపను సగానికి కట్ చేసుకోండి. బంగాళాదుంప కట్ చేసిన భాగంలో ఉప్పు పొడిని చల్లి ఒక నిమిషం పాటు అలాగే ఉంచాలి. తరువాత, బంగాళదుంపలకు రెండు చుక్కల నిమ్మరసం జోడించండి. ఉప్పు కల్తీ అయితే, బంగాళాదుంప ఉపరితలం నీలం రంగులోకి మారుతుంది.

మీ ఇంట్లో ఉప్పు కల్తీ అయితే, మీరు దానిని వాడితే మీ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుందో తెలుసా?

– కల్తీ ఉప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

– కల్తీ ఉప్పు తీసుకోవడం వల్ల కలిగే తీవ్రమైన కాలేయ వ్యాధులు

– జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కడుపులో బర్నింగ్ సెన్సేషన్, నొప్పి పెరుగుతుంది. కడుపులో గ్యాస్ ఏర్పడటంతో బాధపడేవారు కల్తీ ఉప్పుతో మరిన్ని సమస్యలను ఎదుర్కొంటారు

-ఇలాంటి కల్తీ ఉప్పును నిరంతరం తీసుకోవడం వల్ల మెదడు, మూత్రపిండాలకు హాని కలిగిస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవచ్చు.

– ఉప్పులో కల్తీ ఉంటే శరీరంలో యూరియా స్థాయి పెరిగి గౌట్ సమస్య పెరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..