AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Migraine Home Remedy: మైగ్రేన్ కు శాశ్వత పరిష్కారం! ఇలా చేస్తే మళ్లీ తలనొప్పి మీ జోలికి రాదట..?

ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం వల్ల మైగ్రేన్ ఎటాక్‌ రాకుండా చూసుకోవచ్చు. మైగ్రేన్‌లకు మందులపై మాత్రమే ఆధారపడలేము. మందులు 50శాతం ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు. మిగిలిన 50శాతం మీ చేతుల్లో ఉంది. కొన్ని జీవనశైలి మార్పులు మైగ్రేన్‌లను తగ్గించగలవు. మైగ్రేన్‌లను తగ్గించగల, శాశ్వతంగా నివారించగల కొన్ని చిట్కాలను డాక్టర్ తర వీడియోలో వివరించారు.

Migraine Home Remedy: మైగ్రేన్ కు శాశ్వత పరిష్కారం! ఇలా చేస్తే మళ్లీ తలనొప్పి మీ జోలికి రాదట..?
Migraine Home Remedy
Jyothi Gadda
|

Updated on: Sep 22, 2025 | 3:17 PM

Share

మైగ్రేన్..ప్రస్తుత రోజుల్లో చాలా మంది మైగ్రేన్‌తో బాధపడుతున్నారు. ఈ నొప్పి సాధారణ తలనొప్పికి చాలా భిన్నంగా ఉంటుంది. మైగ్రేన్ తలనొప్పి తలలోని ఒక భాగంలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఎవరో నిరంతరం దానిని కొడుతున్నట్లుగా అవస్థపెడుతుంది. కొందరిలో ఈ నొప్పి రోజుల పాటు ఉంటుంది. దీంతో బాధితులల్లో కూర్చోవడం, హాయిగా నిలబడటం కష్టమవుతుంది. స్వల్ప కాంతి లేదా శబ్దం కూడా నొప్పిని పదే పదే ప్రేరేపిస్తుంది. మీరు మైగ్రేన్‌తో బాధపడుతున్నారా..? శాశ్వత నివారణ కోసం చూస్తున్నట్లయితే.. ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక సెహ్రావత్ కొన్ని సూచనలు చేశారు. మైగ్రేన్‌ను ఎలా వదిలించుకోవాలో డాక్టర్ వివరిస్తూ తన ఇన్‌స్టాలో వీడియోని షేర్‌ చేశారు. డాక్టర్‌ సూచన మేరకు మైగ్రేన్ హోమ్ రెమెడీ ఎలా ఉందంటే…

మైగ్రేన్ ను శాశ్వతంగా నయం చేసుకోవడం ఎలా..?

ఇవి కూడా చదవండి

ఆరోగ్యకరమైన జీవనశైలిని నిర్వహించడం వల్ల మైగ్రేన్ ఎటాక్‌ రాకుండా చూసుకోవచ్చు. మైగ్రేన్‌లకు మందులపై మాత్రమే ఆధారపడలేము. మందులు 50శాతం ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలవు. మిగిలిన 50శాతం మీ చేతుల్లో ఉంది. కొన్ని జీవనశైలి మార్పులు మైగ్రేన్‌లను తగ్గించగలవు. మైగ్రేన్‌లను తగ్గించగల, శాశ్వతంగా నివారించగల కొన్ని చిట్కాలను డాక్టర్ తర వీడియోలో వివరించారు.

వీడియో ఇక్కడ చూడండి..

* ఉదయం 9 గంటలకు బ్రేక్‌ఫాస్ట్‌ పూర్తి చేసేయాలి. మధ్యాహ్నం 2 గంటలకు భోజనం, రాత్రి 9 గంటలకు రాత్రి భోజనం చేయండి. మీ భోజన సమయాలను స్థిరంగా ఉంచుకోండి. ఎక్కువసేపు ఆకలితో ఉండకుండా ఉండటానికి ప్రయత్నించండి. బ్రేక్‌ఫాస్ట్‌ ఎప్పుడూ స్కిప్‌ చేయరాదు.

* రాత్రిపూట వీలైనంత వరకు ఫోన్‌ను ఉపయోగించకుండా ఉండండి. ముఖ్యంగా పడుకునే రెండు గంటల ముందు మీ మొబైల్ ఫోన్, ఇతర డిజిటల్ పరికరాలను ఆఫ్ చేయండి.

* ఖాళీ కడుపుతో టీ తాగడం మానుకోండి. ఎందుకంటే ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

* ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఒత్తిడి నిర్వహణపై దృష్టి పెట్టండి. అలాగే, అతిగా ఆలోచించడం మానుకోండి.

* ప్రతిరోజూ 30 నిమిషాల వాకింగ్‌ అలవాటు చేసుకోండి.. ఎండలో బయటకు వెళ్తుంటే షేడ్స్ ధరించడం లేదా గొడుగు తీసుకెళ్లడం తప్పనిసరిగా అలవాటు చేసుకోండి.

ఈ విధంగా చిన్న చిన్న మార్పులు ఆహార నియమాలను అనుసరిస్తూ ఉంటే మైగ్రేన్ నొప్పి నుండి శాశ్వత ఉపశమనాన్ని అందిస్తాయి.

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..