AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes: మధుమేహానికి మంచి మెడిసిన్..! ఖాళీ కడుపుతో ఈ ఆకులు నాలుగు తింటే చాలు..

ప్రపంచ వ్యాప్తంగా షుగర్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. నేటిఉరుకుల పరుగుల జీవితం కారణంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికీ మధుమేహం అంటుతోంది. అయితే, షుగర్​ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతుంటే ఆ సమస్య ఎదురుకాకుండా కొన్ని చిట్కాలు పాటించాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు. అలాంటి చిట్కాల్లో కరివేపాకు ఒకటి.. మధుమేహేలు ఉదయాన్నే ఖాళీ కడుపుతో నాలుగు కరివేపాకు ఆకుల్ని నమిలితే ఎన్ని లాభాలో ఇక్కడ చూద్దాం..

Diabetes: మధుమేహానికి మంచి మెడిసిన్..! ఖాళీ కడుపుతో ఈ ఆకులు నాలుగు తింటే చాలు..
Curry Leaves
Jyothi Gadda
|

Updated on: Sep 20, 2025 | 2:08 PM

Share

షుగర్ ని కంట్రోల్ చేయడానికి సహాయపడే ఆహారాల్లో కరివేపాకు ఒకటి. కరివేపాకులో ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ వంటి సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. ఈ సమ్మేళనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడానికి, చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి. కరివేపాకు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆరోగ్యకరమైన లిపిడ్ ప్రొఫైల్‌ను నిర్వహించడానికి, గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి కరివేపాకు సహాయపడుతుంది. షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు నమలడం వల్ల బరువు తగ్గవచ్చు.

కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల కరివేపాకు ఆకులు నమిలి తినడం వల్ల బాడీ డీటాక్సీ ఫై అవుతుంది. ఇది మొత్తం శరీరానికి చాలా మంచిది. మనం తినే జంక్ ఫుడ్, అన్‌హెల్దీ లైఫ్‌స్టైల్ కారణంగా బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతాయి. కరివేపాకు తినడం వల్ల ఆ టాక్సిన్స్‌ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. కరివేపాకులో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడే యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ పొట్టను శుభ్రంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. అజీర్ణం, గ్యాస్, పొట్ట సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పొట్ట ఆరోగ్యంగా ఉంటుంది.

కరివేపాకును ఖాళీ కడుపుతో తింటే చెడు కొలెస్ట్రాల్‌ కంట్రోల్లో ఉంటుంది. దీంతో గుండె సంబంధిత వ్యాధులను తగ్గించుకోవచ్చు. అంతేకాదు.. కరివేపాకులో విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని బీటా కెరోటిన్ క్యాటరాక్ట్, ఇతర కంటి సమస్యలను నివారిస్తుంది. అంతేకాదు..కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. ఇది వృద్ధాప్యాన్ని నివారించడంతోపాటు.. ముడతలు, ఇతర చర్మ సమస్యలను నయం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

( NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
25 కేజీల బియ్యం బస్తాలు మాయమవుతున్నాయా?
25 కేజీల బియ్యం బస్తాలు మాయమవుతున్నాయా?
స్కూల్‌ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు షాక్‌.. రక్తపు మడుగులో తల్లి!
స్కూల్‌ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు షాక్‌.. రక్తపు మడుగులో తల్లి!
పుష్ప సినిమాను మరిపించేలా గుడుంబా దందా.! వాగు నీళ్లలోపల గుడుంబా డ
పుష్ప సినిమాను మరిపించేలా గుడుంబా దందా.! వాగు నీళ్లలోపల గుడుంబా డ
టాస్ ఓడిన భారత్.. అందరి చూపు సెంచరీ వీరుడిపైనే..!
టాస్ ఓడిన భారత్.. అందరి చూపు సెంచరీ వీరుడిపైనే..!
పాలు కొనలేకపోతున్నారా? పాలు తాగకుండానే కాల్షియం పొందాలంటే..
పాలు కొనలేకపోతున్నారా? పాలు తాగకుండానే కాల్షియం పొందాలంటే..
టీమిండియాకు నో రెస్ట్.. వరుసగా 4 సిరీస్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?
టీమిండియాకు నో రెస్ట్.. వరుసగా 4 సిరీస్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?
విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్స్ చేస్తే ఇక అంతే..
విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్స్ చేస్తే ఇక అంతే..
క్రెడిట్ కార్డు అప్పులు, EMIలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?
క్రెడిట్ కార్డు అప్పులు, EMIలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?
తుపాను దెబ్బకు కాలువల్లో చేపల సందడి.. ఏకంగా 23 కేజీల చేప పట్టిన డ
తుపాను దెబ్బకు కాలువల్లో చేపల సందడి.. ఏకంగా 23 కేజీల చేప పట్టిన డ
40 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. చిరంజీవికి భార్యగా, చెల్లిగా..
40 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. చిరంజీవికి భార్యగా, చెల్లిగా..