పాల మీగడతో మిల మిల మెరిసే చర్మం మీసొంతం..! వయసుతో పనేలేదు..
శీతాకాలంలో మీ చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా మార్చగల ఇంటి నివారణ మీ వంటగదిలోనే ఉందని మీకు తెలుసా? అవును, మన లభించే మిల్క్ క్రీమ్ గురించి తెలుసుకుంటే.. ఇందులో కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇది చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది. అనేక చర్మ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది. మరిన్ని డిటెల్స్ ఇక్కడ చూద్దాం..
Updated on: Sep 20, 2025 | 12:52 PM

మిల్క్ క్రీమ్‌లోని లాక్టిక్ యాసిడ్ ఒక సహజమైన ఎక్స్‌ఫోలియంట్. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. మృత చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా ఉంచుతుంది. పాల మీగడ చర్మాన్ని తేమగా ఉంచి, ఎండిపోకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ముడతలు పడకుండా సహాయపడుతుంది.

క్రీమ్‌లోని యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని సూర్యుని హానికరమైన ప్రభావాల నుండి రక్షిస్తాయి. టానింగ్‌ను తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఉపయోగించడంతో టానింగ్ క్రమంగా మసకబారుతుంది. చర్మపు రంగు సమానంగా మారుతుంది.

మిల్క్ క్రీమ్‌లోని కొవ్వు ఆమ్లాలు చర్మం కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడతాయి. ఇది చర్మాన్ని బిగుతుగా చేసి ముడతలను తగ్గిస్తుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది.

మీగడతో ముఖానికి మసాజ్ చేసుకుంటే రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో చర్మం మరింత అందంగా, యవ్వనంగా మారుతుంది. ఇందుకోసం మీగడలో కొంచెం ఓట్స్ పొడి కలిపి చిక్కటి మిశ్రమం తయారు చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. ముడతలు తగ్గుతాయి. చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

ఈ క్రీమ్ చర్మాన్ని లోతుగా తేమగా ఉండేలా చూస్తుంది. చర్మం పొడిబారకుండా నిరోధిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, తాజాగా ఉంచుతుంది. ఈ క్రీమ్‌లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలు, మచ్చలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది చర్మానికి ఏకరీతి మెరుపును ఇస్తుంది.




