AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నమ్మరు గానీ నల్ల శనగలను ఇలా తింటే లెక్కలెనన్నీ లాభాలు తెలుసా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

నల్ల శనగలు తినడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి మీరందరూ బహుశా విని ఉంటారు లేదా చదివి ఉంటారు. నల్ల శనగలు ఇనుము, ఇతర పోషకాలకు సాటిలేని మూలం. ఇవి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. నల్ల శనగలను తరచుగా కూరగా లేదా ఉడకబెట్టి తింటారు. నానబెట్టిన శనగలు తీసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని మీకు తెలుసా..? ఉదయం పూట నానబెట్టిన శనగలు తినడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయని అనేక పరిశోధనలు చెబుతున్నాయి.

Jyothi Gadda
|

Updated on: Sep 20, 2025 | 1:08 PM

Share
నానబెట్టిన శనగలు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులకు గొప్ప మూలం. నానబెట్టిన నల్లశనగలు ఒక వంద గ్రాములు తింటే శక్తి పెరిగి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. కండరాలు బలంగా మారుతాయి. ఆ రోజంతా మంచి ఎనర్జీతో ఉత్సాహంగా ఉంటారు.

1 / 5
నానబెట్టిన శనగలు ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులకు అత్యంత గొప్ప మూలం. అలాంటి నల్ల శనగలను నానబెట్టడం వల్ల అందులోని ప్రోటీన్లు, విటమిన్లు, ఇతర పోషకాల నాణ్యత మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పైగా అవి సులభంగా జీర్ణమవుతాయి. ప్రతిరోజూ ఒక గుప్పెడు నానబెట్టిన నల్ల శనగలు తినడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయి.

2 / 5
అధిక బరువు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్న వారికి నల్ల శనగలు చాలా మంచిది. త్వరగా సన్న బడటానికి, అధిక బరువుతో పాటు కొలెస్ట్రాల్ తగ్గడానికి నానబెట్టిన నల్ల శనగలు ఎంతగానో దోహదపడతాయి. శనగలు కాల్షియం, ఫాస్ఫరస్ వంటి మంచి పోషకాలతో నిండి ఉంటాయి. ఇవన్నీ ఎముకలకు బలాన్నిస్తాయి.

3 / 5
నల్ల శనగలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మిటమిన్ బీ 6, మెగ్నీషియం, పొటాషియం అధికంగా ఉండి మెదడు, గుండె ఆరోగ్యాన్ని మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర అధికంగా ఉన్నవారికి  షుగర్‌ నియంత్రణకు నల్ల శనగలు అద్భుతంగా పనిచేసే మంచి ఆహారం. కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఉన్నవారికి నల్ల శనగలు తినటం వల్ల ఉపశమనం కలుగుతుంది.

4 / 5
నల్ల శనగలతో గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. నరాల బలహీనత ఉన్న వారికి నల్ల శనగలు దివ్య ఔషధంగా చెబుతున్నారు నల్ల శనగలలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. రోజు ఒక అరకప్పు నానబెట్టిన నల్ల శనగలు ఒక వారం రోజుల పాటు క్రమం తప్పకుండా తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శనగలు చర్మ ఆరోగ్యానికే కాదు, జుట్టు ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది.

5 / 5