AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ్యూజియంలో దొంగలుపడ్డారు.. 3 వేల ఏళ్లనాటి బంగారు బ్రాస్లెట్‌ చోరీ.. దాని విలువ తెలిస్తే..

3000 సంవత్సరాల పురాతన నిధి అకస్మాత్తుగా మ్యూజియం నుండి అదృశ్యమైందంటే నమ్ముతారా..? అవును, ఈజిప్టులోని కైరోలో ఇదే జరిగింది. తహ్రీర్ స్క్వేర్‌లోని ఈజిప్షియన్ మ్యూజియం నుండి అరుదైన బంగారు బ్రాస్లెట్ అదృశ్యమైంది. ఇది సాధారణ బ్రాస్లెట్ కాదు, 21వ రాజవంశానికి చెందిన రాజు ఫారో అమెన్మోప్ పాలనకు చెందినది. బ్రాస్లెట్ విలువైన లాపిస్ లాజులి రాయితో పొదిగినది. ఇప్పుడు ఈ విషయం ఈజిప్టు ప్రభుత్వానికి, భద్రతా సంస్థలకు తీవ్రమైన తలనొప్పిగా మారింది.

మ్యూజియంలో దొంగలుపడ్డారు.. 3 వేల ఏళ్లనాటి బంగారు బ్రాస్లెట్‌ చోరీ.. దాని విలువ తెలిస్తే..
Gold Bracelet
Jyothi Gadda
|

Updated on: Sep 20, 2025 | 11:29 AM

Share

ఈజిప్టు పర్యాటక, పురాతన వస్తువుల మంత్రిత్వ శాఖ ఆ బ్రాస్‌లెట్‌ను మ్యూజియంలోని పునరుద్ధరణ ప్రయోగశాలలో ఉంచినట్లు పేర్కొంది. ఇక్కడ పురాతన వస్తువులను మరమ్మతులు చేసి భద్రపరుస్తారు. అయితే, ఈ సమయంలోనే అరుదైన బ్రాస్‌లెట్ అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. ఈ విషయం ఇప్పుడు నేరుగా చట్ట అమలు సంస్థలు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేతుల్లో ఉంది. బ్రాస్లెట్ మిస్సైందనే వార్త తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి, బ్రాస్లెట్ ఫోటోలను విమానాశ్రయాలు, ఓడరేవులు, సరిహద్దు చెక్‌పోస్టులకు పంపింది. ఎవరైనా ఈ బ్రాస్లెట్‌ని దేశం దాటించే ప్రయత్నం చేస్తే తప్పక పట్టుబడతారని నమ్ముతున్నారు. అయితే, ఇక్కడే గందరగోళం ఏర్పడింది. కొన్ని సోషల్ మీడియా వెబ్‌సైట్లలో షేర్ చేయబడిన ఫోటోలు అసలు బ్రాస్లెట్ కాదు, కానీ వేరే బ్రాస్లెట్ ఇది ఇప్పటికీ మ్యూజియం గ్యాలరీలో భద్రపరచబడిందని చెబుతున్నారు. ఈ మేరకు మ్యూజియం డైరెక్టర్ జనరల్ వివరణ ఇవ్వవలసి వచ్చింది.

ఈజిప్ట్ 21వ రాజవంశానికి చెందిన రాజు ఫారో అమెన్మోప్.. చరిత్రకారులు అతన్ని అంతగా తెలియని కానీ ఆసక్తికరమైన పాలకుడు”గా అభివర్ణించారు. అతని అసలు సమాధి NRT IV, ఇది టానిస్ (తూర్పు నైలు డెల్టా) వద్ద ఉన్న రాజ స్మశానవాటికలో ఉంది. సమాధి చాలా సరళంగా ఉంటుంది. కేవలం ఒక గది మాత్రమే ఉంది. అమెన్మోపి మృతదేహాన్ని తరువాత సుసెన్నెస్ I (ఆ యుగంలోని శక్తివంతమైన రాజు) పక్కన తిరిగి ఖననం చేశారు. ఈ సమాధిని 1940లో తిరిగి కనుగొనబడింది.

పునరుద్ధరణ ప్రయోగశాలలో మిగిలిన అన్ని వస్తువుల పూర్తి జాబితా, సమీక్షను ఇప్పుడు నిర్వహిస్తామని ఈజిప్టు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని కోసం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అంటే మిగిలిన వస్తువులను లెక్కించి, అవి సురక్షితంగా ఉన్నాయో లేదో నిర్ధారించడానికి మూల్యాంకనం చేస్తారు.

ఇవి కూడా చదవండి

కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఫోరెన్సిక్ పురావస్తు శాస్త్రవేత్త క్రిస్టోస్ సిరోగినిస్ ఈ దొంగతనం చూసి ఆశ్చర్యపోలేదు. పురాతన ఈజిప్షియన్ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ చాలా ఎక్కువగా ఉందని ఆయన చెప్పారు. అతని ప్రకారం, ఈ బ్రాస్లెట్ కనిపించడానికి రెండు మార్గాలు ఉన్నాయి: అది చివరికి వేలం గృహంలో, డీలర్ గ్యాలరీలో లేదా ఆన్‌లైన్ మార్కెట్‌లో కనిపిస్తుంది. లేదంటే అది ఇప్పటికే కరిగించి బంగారంగా అమ్ముడై ఉండవచ్చు అంటున్నారు.

నిజం చెప్పాలంటే ఈజిప్ట్ చాలా కాలంగా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది. దాని చారిత్రక సంపద దొంగతనం, అక్రమ రవాణా యద్ధేచ్చగా సాగుతోంది. అది ఫారోనిక్ కాలం నాటి మమ్మీలు అయినా, ఆలయ అవశేషాలు అయినా లేదా ఇలాంటి బంగారు కంకణాలు అయినా, వాటికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ ఇప్పటికీ తగ్గలేదు. ప్రభుత్వం వాటి రక్షణ, అక్రమ రవాణాను అరికట్టడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తుంది. కానీ దొంగలు, మాఫియాలు ఏదో ఒక కొత్త మార్గాన్ని వెత్తుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు సందేహం ఏమిటంటే..ఈజిప్టు భద్రతా సంస్థలు ఈ 3,000 సంవత్సరాల పురాతన బ్రాస్లెట్‌ను కనిపెడతారా..? లేదంటే అది కూడా గతంలో ఆ కోల్పోయిన నిధుల జాబితాలో చేరుతుందా..? అన్నది వేచి చూడాలి అంటున్నారు పలువురు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..