AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరణం పలకరించడమంటే ఇదేనేమో.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం..!

అమెరికాలోని నెబ్రాస్కాలో శుక్రవారం (సెప్టెంబర్ 19) రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి పెట్రోల్ పంప్ వద్ద తన కారు విండ్ షీల్డ్ శుభ్రం చేస్తుండగా ఈ భయంకర ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఈ ప్రమాదం జరిగిన తీరు ఒళ్లు గగుర్పాటుకు గురి చేస్తున్నాయి. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరణం పలకరించడమంటే ఇదేనేమో.. రెప్పపాటులో తప్పిన ప్రమాదం..!
Man Narrowly Escape
Balaraju Goud
|

Updated on: Sep 20, 2025 | 11:55 AM

Share

రెప్పపాటులో ప్రమాదం జరిగిందనే వార్తలను వింటుంటాం. భూమ్మీద నూకలు ఉంటే ఎలాంటి ప్రమాదం జరిగినా.. రెప్పపాటులో బతికి బట్ట కట్టవచ్చు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డు పక్కన నిల్చుని ఉన్న వ్యక్తిపైకి ఓ కారు వేగంగా దూసుకువచ్చింది. క్షణాల్లో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనను చూసినవారు రహదారి భద్రతపై.. మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

పెట్రోల్ పంపులో జరిగిన ఒక భయంకరమైన ప్రమాదం CCTVలో రికార్డైంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. వైరల్ అయిన ఈ దృశ్యం నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తృటిలో మరణం నుండి తప్పించుకున్నాడు. ఈ దృశ్యం హాలీవుడ్ చిత్రం “ఫైనల్ డెస్టినేషన్” నుండి వచ్చిన భయంకరమైన ప్రమాద దృశ్యం కంటే తక్కువ కాదు..!

అమెరికాలోని నెబ్రాస్కాలో శుక్రవారం (సెప్టెంబర్ 19) రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి పెట్రోల్ బంక్‌లో తన కారు విండ్‌షీల్డ్‌ను శుభ్రం చేస్తుండగా ఈ భయానక సంఘటన జరిగింది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యం ఒళ్లు గగుర్పాటుకు గురి చేసింది.

వైరల్ అవుతున్న సీసీటీవీ ఫుటేజ్‌లో, ఒక వ్యక్తి పెట్రోల్ బంక్ వద్ద తన కారును శుభ్రం చేస్తున్నాడు. అకస్మాత్తుగా వేగంగా మరో కారు.. అతని వైపుకు వచ్చి, గాల్లోకి దూసుకెళ్లి, పల్టీలు కొట్టింది. కారు దగ్గరకు వచ్చేసరికి ఆ వ్యక్తి మెరుపు వేగంతో తప్పించుకుని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇదంతా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

నెబ్రాస్కాలోని బ్రాడీలో జరిగిన ఈ సంఘటన అద్భుతం తప్ప మరేమీ కాదు. అమెరికన్ జర్నలిస్ట్ జాన్-కార్లోస్ ఎస్ట్రాడా తన ఫేస్‌బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. సోషల్ మీడియాలో ప్రజలు ఆ వ్యక్తి బతికి బయటపడటం పట్ల తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది నెటిజన్లు దీనిని “అద్భుతం” అని, మరికొందరు దీనిని “నమ్మశక్యం కానిది” అని పేర్కొన్నారు. “ఇది నాకు ఫైనల్ డెస్టినేషన్ సినిమాను గుర్తు చేస్తుందని మరొకరు అన్నారు.” మరొక యూజర్.. “ఆ వ్యక్తి అదృష్టవంతుడు, అతనికి ఏమీ జరగలేదు.” మరొక యూజర్ “నిజంగా భయంకరమైన దృశ్యం” అని రాశాడు.

వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..