పైసా ఖర్చు లేకుండా బంగారాన్ని ఇలా క్లీన్ చేయండి.. తళతళా మెరిసిపోతాయి..!
బంగారు ఆభరణాలు మెరిసేలా ఉండాలంటే వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం. ఖరీదైన క్లీనింగ్ అవసరం లేకుండా.. ఇంట్లో నే సులభంగా రెండు వస్తువులతో బంగారు నగలను మెరిసేలా చేయొచ్చు. ఈ పద్ధతులు నగల అందాన్ని కాపాడుతాయి.. మన్నికను పెంచుతాయి.

బంగారు ఆభరణాలు అందరికీ చాలా ఇష్టం. అయితే అవి ఎప్పుడూ కొత్తలా మెరిసిపోవాలంటే వాటిని సరిగ్గా శుభ్రం చేయడం ముఖ్యం. మనం రోజు వాడే బంగారు నగలు దుమ్ము, మురికి పట్టి కళ తప్పుతాయి. వాటిని ఇంట్లోనే సులభంగా ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుంటే అవి ఎప్పుడూ మెరిసిపోతూ ఉంటాయి.
చాలా మంది బంగారు నగలు కొని ధరిస్తారు. కానీ వాటిని శుభ్రంగా ఉంచడం గురించి పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఆభరణాలు మెరిసేలా ఉండాలంటే వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. దీని వల్ల నగల మన్నిక కూడా పెరుగుతుంది.
రెండు సులభమైన వస్తువులతో శుభ్రం చేయడం.. ఇంట్లో ఉండే మామూలు వస్తువులతోనే మీ బంగారు ఆభరణాలను కొత్తలా మెరిపించవచ్చు. దీనికి కేవలం రెండు ప్రధాన వస్తువులు చాలు.
టూత్ పేస్ట్.. మీరు పళ్లకు వాడే సాధారణ టూత్ పేస్ట్ కొద్దిగా తీసుకోండి. డిష్ వాషింగ్ లిక్విడ్.. వంట పాత్రలు కడిగే లిక్విడ్ కొద్దిగా కలపండి. ఈ మిశ్రమాన్ని బంగారు నగలపై వేసి మృదువైన బ్రష్ తో లేదా పాత మెత్తటి బెట్టతో నెమ్మదిగా తుడవాలి. తుడిచేటప్పుడు ఎక్కువ ఒత్తిడి పెట్టకూడదు. తర్వాత మంచి నీటితో కడిగి మళ్లీ మెత్తటి పొడి బట్టతో తుడిచి ఆరబెట్టాలి.
ఈ పద్ధతితో మీ బంగారు ఆభరణాలు మళ్లీ కొత్తలా మెరిసిపోతాయి. వాటిపై పట్టిన దుమ్ము, మురికి పోయి, వాటి అసలు అందం బయటపడుతుంది. ముఖ్యంగా ఏదైనా వేడుకల సమయంలో వాటిని ధరిస్తే ఆభరణాల ఆకర్షణ మరింత పెరుగుతుంది.
ఈ విధానం చాలా సురక్షితమైనది. ఖరీదైన క్లీనింగ్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే కొద్దిసేపు కేటాయించడం ద్వారా మీరు మీ నగలను మెరిసేలా చేసుకోవచ్చు.
బంగారు ఆభరణాలను ఇష్టపడే ప్రతి ఒక్కరూ వాటిని శుభ్రంగా ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవాలి. పైన చెప్పిన పద్ధతిని పాటించడం ద్వారా మీరు డబ్బు ఖర్చు లేకుండా.. శ్రమ లేకుండా మీ నగల అందాన్ని కాపాడుకోవచ్చు.