AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు.. సీక్రెట్ టిప్స్ ఇవే..

వంటగదిలో అత్యంత ఎక్కువగా వాడే వస్తువుల్లో గ్యాస్ లైటర్ ఒకటి. అయితే వేపుళ్లు, తాలింపుల నూనె తుంపర్లు, మసాలాలు అంటిన చేతుల వల్ల ఇది త్వరగానే మొండి జిడ్డు పొరలతో నిండిపోతుంది. దీన్ని నీటిలో ముంచితే శాశ్వతంగా పాడైపోతుంది కాబట్టి ఎలా శుభ్రం చేయాలో చాలామందికి తెలియదు. ఇంట్లోనే ఉండే రెండు సాధారణ వస్తువులతో జిడ్డు పట్టిన లైటర్‌ను కేవలం 2 నిమిషాల్లో ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు.. సీక్రెట్ టిప్స్ ఇవే..
How To Clean Gas Lighter Without Water
Krishna S
|

Updated on: Oct 03, 2026 | 9:38 PM

Share

వంటగదిలో గ్యాస్ వెలిగించడానికి ప్రతి ఇంట్లోనూ ఉపయోగించే అతి ముఖ్యమైన పరికరం గ్యాస్ లైటర్. అయితే వంట హడావుడిలో నూనె, నెయ్యి లేదా పసుపు, మసాలాలు అంటిన చేతులతోనే దాన్ని పట్టుకుంటుంటాం. దీంతో కొద్దిరోజులకే కొత్త లైటర్ కూడా నల్లటి మొండి జిడ్డు పేరుకుపోయి, చూడటానికే వికారంగా మారుతుంది. పోనీ నీళ్లతో శుభ్రం చేద్దామా అంటే.. లోపలికి తేమ చేరితే స్పార్క్ రాక లైటర్ పూర్తిగా పనికిరాకుండా పోతుంది. దీంతో చాలామంది విసుగొచ్చి కొత్తది కొనేస్తుంటారు. కానీ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా చుక్క నీటిని కూడా ముట్టకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే పాత లైటర్‌ను సరికొత్తగా మెరిపించే సింపుల్ హ్యాక్స్ తెలుసుకోవడం ముఖ్యం.

ట్రిక్ 1: టూత్‌పేస్ట్ మ్యాజిక్

  • రోజూ వాడే తెల్లటి టూత్‌పేస్ట్‌తో మొండి జిడ్డును చిటికెలో వదిలించవచ్చు.
  • లైటర్ ఉపరితలంపై కొద్దిగా తెల్ల టూత్‌పేస్ట్‌ను పూయండి.
  • ఇంట్లో వాడని పాత టూత్‌బ్రష్ లేదా చేతి వేలితో జిడ్డు పట్టిన అన్ని భాగాలకు సమానంగా రుద్దండి.
  • కేవలం ఒక్క నిమిషం పాటు అలాగే వదిలేసి, ఆ తర్వాత నీళ్లు కారకుండా గట్టిగా పిండిన తేలికపాటి తడి గుడ్డతో క్లీన్‌‌గా తుడిచేయండి.
  • ఈ పద్ధతి వల్ల లైటర్‌పై ఉన్న పాత నల్లటి కార్బన్, ఆయిలీ మరకలు పూర్తిగా పోయి కొత్తదానిలా మెరుస్తుంది.

ట్రిక్ 2: బేకింగ్ సోడా – వెనిగర్

లైటర్‌పై జిడ్డుతో పాటు తుప్పు, నల్లటి గట్టి పొరలు ఏర్పడితే ఈ పద్ధతి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఒక చిన్న గిన్నెలో చెంచా బేకింగ్ సోడా తీసుకుని, అందులో కొన్ని చుక్కల వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయండి. పాత బ్రష్ సాయంతో ఆ పేస్ట్‌ను లైటర్ బయటి భాగానికి పట్టించి కాస్త రుద్దండి. కాసేపటి తర్వాత పొడి కాటన్ క్లాత్‌తో గట్టిగా తుడిచేస్తే తుప్పు, మొండి నల్లటి మరకలు క్షణాల్లో మాయమైపోతాయి.

లైటర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి:

నీటితో కడగొద్దు: లైటర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి కుళాయి కింద పెట్టడం గానీ, గిన్నెలతో పాటు నీళ్లలో ముంచడం గానీ చేయకూడదు. లోపలి స్ప్రింగ్, పీజో ఎలక్ట్రిక్ ఎలిమెంట్‌లోకి నీరు చేరితే స్పార్క్ రావడం ఆగిపోతుంది.

స్టవ్ పక్కనే పెట్టకండి: చాలామంది లైటర్‌ను గ్యాస్ స్టవ్ ప్లాట్‌ఫామ్‌పైనే పక్కన పడేస్తుంటారు. దీనివల్ల వంటల నుంచి ఎగిరిపడే నూనె తుంపర్లు, స్టవ్ మంటల వేడి నేరుగా లైటర్‌పై పడి త్వరగా పాడవుతుంది.

హోల్డర్ వాడండి: స్టవ్‌కు కాస్త దూరంగా గోడకు తగిలించే లైటర్ స్టాండ్ లేదా హోల్డర్‌లో ఉంచితే ఎక్కువ కాలం ఎలాంటి జిడ్డు లేకుండా పరిశుభ్రంగా ఉంటుంది.

Follow Us
గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు..
గ్యాస్ లైటర్ మెరిసిపోతుంది.. సింపుల్‌గా ఇలా క్లీన్ చేస్తే చాలు..
అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో..
అరెరె ఇంత ఈజీనా.. గుడ్డు మంచిదా.. కుళ్లిపోయిదా.. సెకన్లలో..
జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.
జామ్ అయిన కుక్కర్ విజిల్‌ను ఇలా సింపుల్‌గా క్లీన్ చేయండి.
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..
మరీ ఎక్కువ అందంగా ఉందని సినిమాల్లో నుంచి తీసేశారు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
45 పైసలతో రూ.10 లక్షలు మీ అకౌంట్లోకి.. చేరడం మర్చిపొవద్దు..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఇక మోసపోరు.. ఫ్రెష్ మటన్‌ను చిటికెలో ఇలా కనిపెట్టండి..
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ఫ్రిజ్‌లో పెట్టినా బెండకాయలు నల్లగా మారుతున్నాయా? ఈ తప్పు చేయకండి
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
ముఖానికి నెయ్యి రాస్తే మొటిమలు వస్తాయా? డాక్టర్ల సలహా ఇదే!
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
విద్య, వైద్యంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?
పళ్లు తోముకున్నా నాలుకను శుభ్రం చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?