AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ పండు విత్తనాలు మీరూ విసిరేస్తున్నారా? కాస్త చూస్కోండి మరీ..

బొప్పాయి ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే చాలా మంది బొప్పాయి తిన్న తర్వాత దాని విత్తనాలను పారవేస్తుంటారు. ఈ అలవాటు మీకూ ఉంటే వెంటనే మానుకోవడం మంచిది. ఎందుకంటే దీని విత్తనాలలో అద్భుతమైన పోషకాలు ఉంటాయట. బొప్పాయి గింజల ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలిస్తే..

ఈ పండు విత్తనాలు మీరూ విసిరేస్తున్నారా? కాస్త చూస్కోండి మరీ..
Papaya Seeds
Srilakshmi C
|

Updated on: Aug 08, 2025 | 10:25 PM

Share

బొప్పాయి పండు ఆరోగ్యానికి మంచిదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది . అయితే చాలా మంది బొప్పాయి తిన్న తర్వాత దాని విత్తనాలను పారవేస్తుంటారు. ఈ అలవాటు మీకూ ఉంటే వెంటనే మానుకోవడం మంచిది. ఎందుకంటే దీని విత్తనాలలో అద్భుతమైన పోషకాలు ఉంటాయట. బొప్పాయి గింజల ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలిస్తే, జీవితంలో వాటిని మీరు వ్యర్థంగా పారవేయరు. ఈ విత్తనాలలో అపారమైన ఔషధ గుణాలు దండిగా ఉన్నాయి. కాబట్టి దీని ప్రయోజనాలు ఏమిటో? ఇది ఎవరికి మంచిదో ఇక్కడ తెలుసుకుందాం..

బొప్పాయి విత్తనాల ప్రయోజనాలు ఇవే..

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది

బొప్పాయి గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగు ఆరోగ్యానికి మంచిది. అంతే కాదు ఇది మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో కూడా సహాయపడుతుంది. ఈ విత్తనాలలోని ‘కార్పైన్’ అనే పదార్థం పేగులలోని బ్యాక్టీరియా, పరాన్నజీవులను చంపుతుంది. జీర్ణవ్యవస్థను శుభ్రంగా ఉంచుతుంది.

బరువు, కొలెస్ట్రాల్ నియంత్రణ

బొప్పాయి గింజల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరం నుంచి విషాన్ని బయటకు పంపుతుంది. అవి శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నిరోధిస్తాయి. బరువు తగ్గడానికి సహాయపడతాయి. వాటిలో ఉండే ఒలీక్ ఆమ్లం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ నిరోధక లక్షణాలు

బొప్పాయి గింజల్లో పాలీఫెనాల్స్ వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవి శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తాయి. ముఖ్యంగా ‘ఐసోథియోసైనేట్’ అనే సమ్మేళనం క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధిస్తుంది.

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది

కొన్ని అధ్యయనాల ప్రకారం.. బొప్పాయి గింజలు మూత్రపిండాలలో వాపు, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వాటి పనితీరును మెరుగుపరుస్తాయి. వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మూత్రపిండాల కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి.

డెంగ్యూ నివారణలో సహాయం

డెంగ్యూ జ్వరంలో ప్లేట్‌లెట్ కౌంట్‌ను పెంచడంలో బొప్పాయి గింజలు సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ విత్తనాలను పొడి రూపంలో తీసుకోవడం వల్ల డెంగ్యూ నుంచి వేగంగా కోలుకోవచ్చు. అంతేకాదు బొప్పాయి గింజలను పీరియడ్స్‌ సమస్యలను తగ్గించడానికి, కాలేయ సమస్యలను నివారించడానికి ఉపయోగించవచ్చు. ఈ పొడిని సలాడ్‌లు, జ్యూస్‌లలో కలిపి కూడా తీసుకోవచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..