Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌తో ప్రయోజనాలెన్నో..! అవేంటో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..

పిల్లల నుంచి పెద్దల వరకు చాక్లెట్స్‌ అంటే ఇష్టపడతారు. అయితే, డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ చాక్లెట్లను తింటే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గించుకోవచ్చునని పోషకాహర నిపుణులు చెబుతున్నారు. 

Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్‌తో ప్రయోజనాలెన్నో..! అవేంటో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..
Dark Chocolate
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 18, 2024 | 8:21 PM

డార్క్ చాక్లెట్.. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. ఆరోగ్యంతో పాటు అందానికి కూడా డార్క్‌ చాక్లెట్‌ మేలు చేస్తుంది. డార్క్ చాక్లెట్ లో ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మెదడు పనితీరును, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. డార్క్ చాక్లెట్లను తింటే మనకు ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

డార్క్ చాక్లెట్ మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మీ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ లెవల్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్‌లో ఉండే అధిక మొత్తంలో మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ ను క్రమం తప్పకుండా మోతాదులో తినడం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ఇది మన మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డార్క్ చాక్లెట్ కూడా శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డార్క్ చాక్లెట్ కేలరీలతో నిండి ఉన్నప్పటికీ ఇది బరువు తగ్గడానికి అనుకూలంగా ఉంటుంది.

డయాబెటీస్ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడతాయి. డార్క్ చాక్లెట్ ను తింటే ఆకలి కంట్రోల్ అవుతుంది. అలాగే ఈ చాక్లెట్ గట్ లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే థియో‎బ్రోమిన్ శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఎన్-ఎసిల్ ఇథనోలమైన్స్ ఫెనిలేథైలమైన్ ఇవన్నీ కూడా డిప్రెషన్ నుంచి ఉపశమనం కలిగిస్తాయి. డార్క్ చాక్లెట్‎లో ఉండే మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు శరీర నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి

పిల్లల నుంచి పెద్దల వరకు చాక్లెట్స్‌ అంటే ఇష్టపడతారు. అయితే, డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ చాక్లెట్లను తింటే మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గించుకోవచ్చునని పోషకాహర నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..