AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పులసకు ఫుల్లు డిమాండ్.. ఈ ఒక్క చేప ధర తెలిస్తే నోరెళ్లబెడతారు.. రుచి తెలిస్తే కొనకుండా ఉండలేరు..!

వలలో చిక్కిన వెంటనే ఈ పులస చేప చనిపోతుంది. కానీ చేపల పులుసు మాత్రం రెండు రోజులైనా ఎంతో రుచిగా ఉంటుంది. సముద్రంలో ఉన్నప్పుడు ఉప్పునీటి కారణంగా ఉన్న పులస చేపలు గోదావరి తీపి నీరు తగలగానే వాటి రంగు రుచిని మార్చుకోవటం కారణంగానే అంత రుచిగా ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం జూలై మాసం జరుగుతుంది.. అంతేకాక ఎగువన కురుస్తున్న వర్షాల దాటికి గోదావరికి వరద ఉధృతి కూడా పెరిగింది.

Jyothi Gadda
|

Updated on: Jul 18, 2024 | 7:13 PM

Share

‘పుస్తెలమ్మైనా పులస తినాలి’ అనే మాట మీరు వినే ఉంటారు… ఇప్పుడ ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల గోదావరి తీర ప్రాంతలో ఈ మాట నిజమే అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఈ ప్రాంతంలో పులస చేపకు ఎంతో డిమాండ్ ఉంది. వేల రూపాయలు ఖర్చు పెట్టు మరి పులస చేపను కొని పులుసు వండించుకుని ఎంతో ఇష్టంగా తింటారు పులస ప్రియులు. ఇప్పుడు వారికి ఓ వార్త పండుగలా మారింది. ఇటీవల తరచుగా గోదావరిలో పులసలు దొరకడంతో వాటిని దక్కించుకునేందుకు పోటీలు పడుతున్నారు పులస ప్రియులు. పులస చేపలు వలలకు చిక్కకుండానే ముందుగానే మత్స్యకారులకు అడ్వాన్సులు ఇచ్చేస్తున్నారట… రేట్ ఎంతైనా పర్లేదు పులస పడితే తమకే కావాలంటూ మత్స్యకారుల వద్దకు క్యూ కడుతున్నారట.

గోదావరి నదిలో దొరికే అరుదైన అతి ఖరీదైన చేప పులస… ఇది సముద్ర చేపే అయినా గోదావరి నది ప్రవాహానికి ఎదురిదుతూ దాని రంగు రుచిని మార్చుకొనడంతో ఈ చేపకు ఇక్కడ విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. సహజంగా గోదావరి నదికి జూన్, జూలై, ఆగస్టు నెలలో ఎగువన కురిసిన వర్షాల కారణంగా వరదలు వస్తాయి. గోదావరి వరద నీరు అంతర్వేది వద్ద సముద్రంలో కలుస్తుంది. అయితే సముద్రంలో ఉండే ఈ పులస చేపలు గుడ్లు పెట్టి తమ సంతానోత్పత్తిని పెంపొందించుకునేందుకు గోదావరి నది ప్రవాహానికి ఎదురీదుతూ ధవలేశ్వరం బ్యారేజ్ వరకు గోదావరి నీటిలో ఈదుతూ వస్తాయి. అలా వచ్చిన పులస చేపలు మత్స్యకారుల వలకుచిక్కి మార్కెట్ లోకి విక్రయించేందుకు వెళతాయి.

ఈ పులస చేపలు అతివేగంగా ఈదుతాయి. గోదావరి నదిలో వేగంగా ఈదుతూ జూన్ జూలై ఆగస్టు నెలలో గుడ్లు పెట్టిన తరువాత మళ్లీ అక్టోబరు నాటికి సముద్రంలోకి తిరిగి వెళ్ళిపోతారు.. ఇవి గోదావరి వరదనీటిలో సంతానోత్పత్తికి గుడ్లు పొదగడానికి వచ్చిన సమయంలోనే మత్స్యకారుల వలకు చిక్కుతాయి. అయితే వలలో చిక్కిన వెంటనే ఈ పులస చేప చనిపోతుంది. కానీ చేపల పులుసు మాత్రం రెండు రోజులైనా ఎంతో రుచిగా ఉంటుంది. సముద్రంలో ఉన్నప్పుడు ఉప్పునీటి కారణంగా ఉన్న పులస చేపలు గోదావరి తీపి నీరు తగలగానే వాటి రంగు రుచిని మార్చుకోవటం కారణంగానే అంత రుచిగా ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. ప్రస్తుతం జూలై మాసం జరుగుతుంది.. అంతేకాక ఎగువన కురుస్తున్న వర్షాల దాటికి గోదావరికి వరద ఉధృతి కూడా పెరిగింది. దాంతో పులస చేపలు సముద్రం నుంచి గోదావరి నదిలోకి ఎదురీదుతూ వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..