AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: పార్టీ మారిన వ్యక్తిని.. కాంపౌండ్ బయటకు ఎత్తుకెళ్లి.. ఏం చేశారంటే..

ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసీపీలోకి జాయిన్ అయ్యారు. అంతటితో ఆగలేదు ఆ నేతను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. కట్ చేస్తే అదే నేత ముందు చేతులు కట్టుకొని నిలబడి క్షమాపణ కోరాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అడ్వకేట్ శ్రీనివాసులు ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసీపీలో జాయిన్ అయ్యారు. గత 30 ఏళ్లుగా టిడిపిలో ఉంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి న్యాయవాదిగా కొనసాగారు.

Watch Video: పార్టీ మారిన వ్యక్తిని.. కాంపౌండ్ బయటకు ఎత్తుకెళ్లి.. ఏం చేశారంటే..
Anantapuram
Nalluri Naresh
| Edited By: Srikar T|

Updated on: Jul 18, 2024 | 8:14 PM

Share

ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసీపీలోకి జాయిన్ అయ్యారు. అంతటితో ఆగలేదు ఆ నేతను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. కట్ చేస్తే అదే నేత ముందు చేతులు కట్టుకొని నిలబడి క్షమాపణ కోరాడు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో అడ్వకేట్ శ్రీనివాసులు ఎన్నికలకు ముందు టిడిపి నుంచి వైసీపీలో జాయిన్ అయ్యారు. గత 30 ఏళ్లుగా టిడిపిలో ఉంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి న్యాయవాదిగా కొనసాగారు. ఎన్నికలకు ముందు జెసి ప్రభాకర్ రెడ్డిని విభేదించి వైసీపీలో జాయిన్ అయ్యారు శ్రీనివాసులు. టిడిపిని వీడే సందర్భంలో జెసి ప్రభాకర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో అడ్వకేట్ శ్రీనివాసులు విమర్శలు చేశారు. సీను కట్ చేస్తే ఎన్నికల ఫలితాలు వచ్చాయి. టిడిపి అధికారంలోకి వచ్చింది.

జెసి ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏం జరిగిందో ఏమో తెలియదు.. రెండు చేతులు కట్టుకొని జేసీ ప్రభాకర్ రెడ్డి ముందు నిలబడి క్షమించండి మహాప్రభో అని న్యాయవాది శ్రీనివాసులు వేడుకున్నాడు. తప్పైందని జెసి ప్రభాకర్ రెడ్డిని వేడుకున్నాడు. పార్టీ మారిన నీలాంటి వారిని క్షమించేది లేదు.. తిరిగి పార్టీలోకి చేర్చుకునేది లేదన్నారు జేసీ. నా దగ్గరకు రావద్దని అడ్వకేట్ శ్రీనివాసులును తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి ఇంట్లోంచి బయటికి వెళ్ళమన్నాడు. ఎంత చెప్పినా కదలకపోవడంతో.. అడ్వకేట్ శ్రీనివాసులను అమాంతం ఎత్తుకొని ఇంటి బయటపడేశారు జేసి ప్రభాకర్ రెడ్డి అనుచరులు. ఇంట్లో నుంచి ఎత్తి బయటపడేసినప్పటికీ శ్రీనివాస్ తిరిగి జెసి ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వెళ్లాలని ప్రయత్నించారు. ఆయన అనుచరులు శ్రీనివాసులును ఇంటిబయటే అడ్డుకొని గేటు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..