Tomato Rate: సామాన్యులకు షాక్..మళ్లీ పెరిగిన టమోటా ధర.. కిలో ఎంతంటే..!
రైతు బజార్లలో 70 నుంచి ఎనభై రూపాయలకు రైతులు విక్రయిస్తున్నారు. పంట సెప్టెంబరు నాటికి కాని చేతికి రాదని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు పంట పెద్దగా లేకపోవడంతో ధరలు ఇప్పట్లో దిగి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. వర్షాల ప్రభావంతో టమోటా పంటలు దెబ్బతినడంతో మళ్ళీ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. మరికొద్దిరోజుల పాటు టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
టమాటా ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. ధరలు మళ్లీ పెరిగాయి. నిన్నటి వరకూ అరవై నుంచి ఎనభై రూపాయలు పలికిన టమాటా ధర మళ్లీ వందరూపాయలకు చేరుకుంది. బహిరంగ మార్కెట్ లో టమాటా ధర సెంచరీ దాటడంతో వినియోగదారులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. స్థానిక మార్కెట్‌లలో నిల్వలు లేకపోవడంతో కర్నూలు జిల్లాలోని యెమ్మిగనూరు, ఆదోని, కర్నూలు నగరంలోని వివిధ బహిరంగ రిటైల్ మార్కెట్‌లలో టమోటా ధరలు అమాంతంగా పెరిగిపోతున్నాయి. టమాటా ధరలు గత నెల రోజుల నుంచి దిగి రావడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ టమాటా దిగుమతులు లేకపోవడంతో ధరలు దిగి రావడం లేదు. రైతు బజార్లలో 70 నుంచి ఎనభై రూపాయలకు రైతులు విక్రయిస్తున్నారు. పంట సెప్టెంబరు నాటికి కాని చేతికి రాదని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు పంట పెద్దగా లేకపోవడంతో ధరలు ఇప్పట్లో దిగి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. వర్షాల ప్రభావంతో టమోటా పంటలు దెబ్బతినడంతో మళ్ళీ ధరలు పెరుగుతున్నాయని అన్నారు. మరికొద్దిరోజుల పాటు టమాటా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..