Rail Accident: గోండాలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బోల్తాపడ్డ బోగీలు.. పలువురు మృతి
చండీగఢ్ నుంచి అసోం లోని డిబ్రూగఢ్‌కు రైలు వెళ్తుండగా పట్టాలు తప్పింది. సంఘటనా స్థలానికి 15 అంబులెన్స్‌లు చేరుకున్నాయి. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 13 రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని గోండా దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్-డిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 12 బోగీలు బోల్తా పడ్డాయి. 4 ఏసీ కోచ్‌లు కూడా బోల్తా పడ్డాయి . ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. సంఘటనా స్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రైల్వే శాఖ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని యూపీ సీఎం యోగి రైల్వే అధికారులను ఆదేశించారు. చండీగఢ్ నుంచి అసోం లోని డిబ్రూగఢ్‌కు రైలు వెళ్తుండగా పట్టాలు తప్పింది. సంఘటనా స్థలానికి 15 అంబులెన్స్‌లు చేరుకున్నాయి. గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. 13 రైళ్లను దారి మళ్లించారు అధికారులు. ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..