AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలి..? అన్నం వండేముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..

బియ్యాన్ని ఎన్నిసార్లు కడిగితే మంచిది? రెండు సార్లు చాలా లేక నీళ్లు పూర్తిగా స్వచ్ఛంగా వచ్చేవరకు కడగాలా? మన ఇళ్లలో తరతరాలుగా వస్తున్న ఈ పద్ధతిపై ఇప్పుడు సరికొత్త చర్చ నడుస్తుంది. పదేపదే కడగడం వల్ల బియ్యంలోని పోషకాలకు జరిగే నష్టమేంటి? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలి..? అన్నం వండేముందు ఈ విషయాలు పక్కా తెలుసుకోండి..
How Many Times Should You Wash Rice
Krishna S
|

Updated on: Aug 26, 2026 | 10:12 AM

Share

భారతీయుల ప్రధాన ఆహారం అన్నం. పలావ్, బిర్యానీ, జీరా రైస్, లెమన్ రైస్, పులిహోర నుంచి నిత్యం తినే సాదా అన్నం, పెరుగు అన్నం వరకు బియ్యంతో రకరకాల వంటకాలు సిద్ధంగా ఉంటాయి. అయితే వండే ముందు బియ్యాన్ని ఎన్నిసార్లు కడగాలనే విషయంలో చాలామందిలో ఎన్నో డౌట్లు ఉంటాయి. చాలామంది నీళ్లు పూర్తిగా స్వచ్ఛంగా, పారదర్శకంగా మారే వరకు 5 నుంచి 7 సార్లు బియ్యాన్ని పిసికి పిసికి కడుగుతుంటారు. అసలు బియ్యాన్ని ఎన్నిసార్లు కడగడం సరైన పద్ధతి? పదేపదే కడగడం వల్ల నిజంగానే ప్రయోజనం ఉంటుందా? అనేది తెలుసుకోవడం ముఖ్యం. ఇటీవల బ్రిటన్‌లో నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఒక ప్రత్యేక ప్రచారం ఈ అంశాన్ని తెరపైకి తెచ్చింది. వాటర్ సర్వీసెస్ రెగ్యులేషన్ అథారిటీ ఇన్నోవేషన్ ఫండ్ సహకారంతో సౌత్ స్టాఫోర్డ్‌షైర్ వాటర్, కేంబ్రిడ్జ్ వాటర్ సంస్థలు సుమారు 2లక్షల 70వేల పౌండ్లతో ఈ ప్రచారాన్ని ప్రారంభించాయి. దక్షిణాసియా కుటుంబాల్లో వంటకు ముందు బియ్యాన్ని 5 నుంచి 7 సార్లు కడిగే అలవాటు ఉందని, నీటిని ఆదా చేసేందుకు బియ్యాన్ని కేవలం 2 సార్లు మాత్రమే కడగాలని సూచించారు. ఈ సిఫార్సుతో బియ్యాన్ని తక్కువసార్లు కడిగితే పరిశుభ్రత, పోషకాలపై ప్రభావం పడుతుందా అనే చర్చ మొదలైంది.

నిపుణులు ఏమంటున్నారు?

ఈ విషయంపై PSRI హాస్పిటల్‌లోని డైటెటిక్స్ విభాగాధిపతి షాలినీ బ్లిస్ స్పందిస్తూ.. సాధారణంగా ప్యాక్ చేసిన బియ్యాన్ని శుభ్రమైన నీటితో 2 లేదా 3 సార్లు కడిగితే సరిపోతుందని స్పష్టం చేశారు. దీనివల్ల బియ్యంపై ఉండే దుమ్ము, మలినాలు, అధికంగా ఉండే పిండిపదార్థం తొలగిపోతాయి. అంతకుమించి పదేపదే ఐదు నుంచి ఏడు సార్లు కడగడం వల్ల అదనంగా ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలగవని ఆమె తెలిపారు.

పదేపదే కడిగితే ఆర్సెనిక్ పోతుందా?

బియ్యంలో సహజంగా ఉండే ఆర్సెనిక్ వంటి హానికర మూలకాలు పదేపదే కడగడం వల్ల తొలగిపోతాయని చాలామంది భావిస్తుంటారు. కానీ యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ పరిశోధనల ప్రకారం.. బియ్యాన్ని ఎన్నిసార్లు కడిగినా ఆర్సెనిక్ స్థాయిల్లో పెద్దగా మార్పు ఉండదు. బియ్యం పండే నేల స్వభావం, ప్రాంతం, బియ్యం రకం ఆధారంగా ఆర్సెనిక్ ఉంటుంది తప్ప, కేవలం కడగడం ద్వారా దాన్ని తొలగించలేమని స్పష్టమైంది. ఒకవేళ ఆర్సెనిక్ ప్రభావాన్ని తగ్గించాలనుకుంటే ఎక్కువ నీటిని ఉపయోగించి అన్నం వండి, గంజి వార్చడం వంటి సాంప్రదాయ పద్ధతులు కొంతవరకు మేలు చేస్తాయి. ఇది ఆర్సెనిక్ స్థాయిలను తగ్గించడంతో పాటు పోషకాలను నిలుపుకోవడానికి కూడా సహాయపడుతుంది.

అతిగా కడిగితే పోషకాలకు నష్టం

బియ్యాన్ని అతిగా కడగడం వల్ల ఆర్సెనిక్ తగ్గకపోగా, శరీరానికి అవసరమైన కీలక పోషకాలు వృథాగా పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బియ్యంలో ఉండే నీటిలో కరిగే విటమిన్లు, పోషకాలైన ఐరన్, ఫోలేట్, థయామిన్, నియాసిన్ వంటివి అధికంగా కడగడం వల్ల నీటితో పాటు కొట్టుకుపోతాయి. ముఖ్యంగా పాలిష్ చేసిన బియ్యం, ఉప్పుడు బియ్యంలో ఈ నష్టం మరింత ఎక్కువగా ఉంటుంది.

Follow Us