AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ ముగ్గురికి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే అర్హత లేదు.. గంభీర్ అండతో స్వ్కాడ్‌లోకి ఎంట్రీ..!

IND vs NZ: న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టును ఎంపిక చేసిన నేపథ్యంలో కొందరు ఆటగాళ్ల ఎంపికపై చర్చ మొదలైంది. ముఖ్యంగా గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీ, యశ్ ఠాకూర్‌లకు వన్డే జట్టులో చోటు దక్కడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవలి ప్రదర్శన, వన్డే అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటే వీరి ఎంపికపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే తుది నిర్ణయం సెలక్టర్లదే.

ఈ ముగ్గురికి న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే అర్హత లేదు.. గంభీర్ అండతో స్వ్కాడ్‌లోకి ఎంట్రీ..!
Ind Vs Nz Tour
Venkata Chari
|

Updated on: Oct 18, 2026 | 10:03 PM

Share

Team India New Zealand Tour: న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు ఐదు టీ20లు, ఐదు వన్డేలతో పాటు రెండు టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా అక్టోబర్ 22 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 4 నుంచి వన్డే సిరీస్, నవంబర్ 19 నుంచి టెస్టు సిరీస్ మొదలవుతాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC)లో భాగంగా జరగనున్న టెస్టు మ్యాచ్‌లను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ (BCCI) వన్డే సిరీస్ కోసం రెండు వేర్వేరు జట్లను ఎంపిక చేసింది.

చివరి రెండు వన్డేలకు టెస్టు జట్టులోని కొందరు కీలక ఆటగాళ్లకు చోటు కల్పించలేదు. వీరు న్యూజిలాండ్ ఏ జట్టుతో జరగనున్న మూడో అనధికారిక టెస్టులో ఆడే అవకాశం ఉంది. దీంతో వన్డే జట్టులో మరికొందరు ఆటగాళ్లకు అవకాశం దక్కింది. అయితే, రెండు జట్లను కలిపి పరిశీలిస్తే ముగ్గురు ఆటగాళ్ల ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మద్దతుతోనే వారు జట్టులో చోటు దక్కించుకున్నారనే చర్చ జరుగుతోంది.

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక కావాల్సిన అర్హత లేని ముగ్గురు భారత ఆటగాళ్లు వీరే!

1. గుర్నూర్ బ్రార్..

ఎత్తైన శరీరాకృతితో ఆకట్టుకునే ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌ను న్యూజిలాండ్‌తో జరిగే ఐదు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేశారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో అరంగేట్రం చేసిన గుర్నూర్ తన ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో గుర్నూర్ కేవలం మూడు వికెట్లు మాత్రమే తీశారు. అంతేకాకుండా, బౌలింగ్‌లో ఎక్కువ పరుగులు సమర్పించుకున్నారు. ఈ ప్రదర్శన నేపథ్యంలో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేసిన భారత వన్డే జట్టులో ఆయనకు చోటు దక్కడం ఆశ్చర్యకరంగా మారింది. ఇటీవలి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే, ఆయన ఎంపికపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

2. ఆకిబ్ నబీ..

జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీని వెస్టిండీస్ సిరీస్ తర్వాత న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా కొనసాగించారు. చివరి రెండు వన్డేల కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఆయనకు చోటు కల్పించారు. అయితే, ఆకిబ్ నబీ వన్డేల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే నిరాశపరిచారు. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగులు సమర్పించుకున్నప్పటికీ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో ఆయనను మరోసారి వన్డే జట్టులో కొనసాగించడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రదర్శన తర్వాత కూడా న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపిక కావడం చర్చనీయాంశంగా మారింది.

3. యశ్ ఠాకూర్..

ఫాస్ట్ బౌలర్ యశ్ ఠాకూర్ ఎంపిక కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆకిబ్ నబీ తరహాలోనే ఆయనను చివరి రెండు వన్డేల కోసం భారత జట్టులోకి తీసుకున్నారు. అయితే, ఇప్పటివరకు యశ్ ఠాకూర్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో మాత్రమే టీమిండియాకు ప్రాతినిధ్యం వహించారు. వన్డే అంతర్జాతీయ క్రికెట్‌లో అనుభవం లేకుండానే ఆయనకు ఈ ఫార్మాట్‌లో అవకాశం కల్పించడం చర్చకు దారితీసింది.

యశ్ ఠాకూర్ కంటే మెరుగైన ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లకు మరో అవకాశం ఇచ్చేందుకు ఇది సరైన సమయమని భావిస్తున్నారు. అయితే, వారిని పక్కన పెట్టి యశ్ ఠాకూర్‌పై సెలక్టర్లు నమ్మకం ఉంచడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Follow Us