Chikungunya: చికున్‌గున్యా తర్వాత కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. ఉపశమనం కోసం వంటింటి టిప్స్ ట్రై చేయండి..
చికున్‌గున్యా జ్వరం నుంచి కోలుకున్న తర్వాత కూడా కీళ్ల నొప్పులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఎంత తీవ్రంగా ఉంటాయంటే.. లేచి నడవడం కూడా కష్టం అవుతుంది. చికున్‌గున్యా తగ్గిన తర్వాత కూడా కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే.. ఈ ఇంటి చిట్కాలను పాటించి చూడండి. తద్వారా కీళ్ళ నొప్పి నుంచి మంచి ఉపశమనం పొందవచ్చు, అవి ఏమిటంటే..

వర్షాకాలంలో చికన్‌గన్యా కేసులు తరచుగా పెరుగుతాయి. ఈ వ్యాధి దోమ కాటు వల్ల వస్తుంది. జ్వరం, వాంతులు, తలనొప్పి, శరీర నొప్పి వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడతారు. చికన్‌గున్యా వ్యాధి సోకిన వ్యక్తి శారీరకంగా బలహీనంగా ఉంటాడు. అదే సమయంలో ఈ జ్వరం కీళ్లను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ఈ నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి కీళ్ళ నొప్పులను భరించడం కష్టం అవుతుంది. లేచి నడవడం కూడా సమస్యగా మారుతుంది.
చికన్‌గున్యా వల్ల కలిగే కీళ్ల నొప్పులు దీర్ఘ కాలం ఉంటాయి. అటువంటి పరిస్థితిలో బాధితులు కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి వివిధ రకాల మందులు తీసుకుంటారు. అయితే చికన్‌గున్యా తర్వాత వచ్చే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని దేశీయ, వంటింటి సింపుల్ చిట్కాలున్నాయి. ఇవి కీళ్ల నొప్పుల నుంచి కొంతమేర ఉపశమనం కలిగిస్తాయి. ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం.
నిపుణులు ఏమంటున్నారు? ఎయిమ్స్‌లోని ఎముకలు, కీళ్ల నిపుణుడు డాక్టర్ అరుణ్ పాండే మాట్లాడుతూ.. చికన్‌గున్యా తర్వాత కీళ్ల నొప్పులు వాపు వల్ల వస్తాయని చెప్పారు. కనుక కీళ్లలో నొప్పి వచ్చినప్పుడల్లా నొప్పి ఉన్న ప్రాంతంలో ఐస్ ని అప్లై చేయండి. అంతేకాదు కీళ్లకు సంబంధించిన వ్యాయామం చేయండి. స్ట్రెచింగ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది కీళ్ల వాపును తగ్గిస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఏ వస్తువులు తినాలి? చికన్‌గున్యా తగ్గిన తర్వాత కీళ్ల నొప్పులు ఉంటే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డాక్టర్ అరుణ్ పాండే అంటున్నారు. దీని కోసం వీలైనంత ఎక్కువ ద్రవ పదార్ధాలను తీసుకోండి. దీని కోసం, వీలైనంత ఎక్కువ నీరు త్రాగండి. ఎందుకంటే శరీరంలో నీటి కొరత ఉన్నప్పటికీ కీళ్ల నొప్పులు వస్తాయి. దీనితో పాటు కొబ్బరి నీళ్ళు కూడా తీసుకోవచ్చు.
మసాజ్ కూడా ముఖ్యం నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం , వ్యాయామంతో పాటు కీళ్ల మసాజ్ కూడా ముఖ్యం. దీని కోసం కొబ్బరి నూనెను ఉపయోగించవచ్చు. అయితే కొబ్బరి నూనెతో తేలికగా చేతులతో మసాజ్ చేయాలనేది గుర్తుంచుకోవాలి. ఎక్కువ ఒత్తిడితో మసాజ్ చేస్తే.. కీళ్ల చర్మం దెబ్బతింటుంది. ఈ ఇంటి నివారణలన్నింటినీ చేయడం ద్వారా చికన్‌గున్యా తగ్గిన తర్వాత వచ్చే కీళ్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








