Weight Loss Diet: బరువు తగ్గే పనిలో ఉన్నారా.? ఇంట్లో రడీ చేసుకునే ఈ ప్రోటీన్‌ షేక్‌ ట్రై చేయండి సూపర్ బెనిఫిట్స్‌..

కేవలం ఇంట్లోనే ఉండి ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకుని ఈజీగా బరువు తగ్గవచ్చు. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఇది నిజం. బరువు తగ్గించుకునే వారు ఈ సూపర్ ప్రోటీన్ పౌడర్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు

Weight Loss Diet: బరువు తగ్గే పనిలో ఉన్నారా.? ఇంట్లో రడీ చేసుకునే ఈ ప్రోటీన్‌ షేక్‌ ట్రై చేయండి సూపర్ బెనిఫిట్స్‌..
Dry Fruits (File Photo)
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jan 03, 2023 | 4:15 PM

ఊబకాయం ప్రస్తుత కాలంలో అందరినీ వేధించే సమస్య. బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోతుంటాం. బరువు తగ్గ క్రమంలో ఎన్నో డైటింగ్ ప్లాన్స్ ను ఫాలో అయ్యి డబ్బు కూడా పోగుట్టుకుంటాం. అయినా ఫలితం రాలేదని డబ్బు వృథా అయ్యిందని బాధపడుతుంటాం. అయితే ఇలాంటి సమస్యలు లేకుండా కేవలం ఇంట్లోనే ఉండి ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకుని ఈజీగా బరువు తగ్గవచ్చు. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా ఇది నిజం. బరువు తగ్గించుకునే వారు ఈ సూపర్ ప్రోటీన్ పౌడర్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు

సూపర్ ప్రోటీన్ పౌడర్ తయారీకి కావాల్సిన పదార్థాలు

ఒక కప్పు బాదం, అరకప్పు వాల్ నట్ లు, అరకప్పు పచ్చి వేరుశెనగలు, అర కప్పు పిస్తా, అరకప్పు జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి పుచ్చకాయ గింజలు, రెండు టేబుల్ స్పూన్ల పచ్చి గుమ్మడికాయ గింజలు, రెండు టేబుల్ పొద్దుతిరుగుడు పువ్వు పచ్చి విత్తనాలు, ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజలు, రెండు టేబుల్ స్పూన్ల చియా గింజలు, పావు కప్పు చిన్నగా తరిగిన ఎండు ఖర్జూరం.

ఇవి కూడా చదవండి

సూపర్ ప్రోటీన్ పౌడర్ తయారు చేసుకునే విధానం

  • ఓ పాన్ బాదం పప్పులను వేసి మీడియం మంటపై ఓ నాలుగు నిమిషాలు వేయించి పక్న పెట్టుకోవాలి.
  • అదే పాన్ లో వాల్ నట్ లు, వేరుశెనగ, పిస్తా, జీడిపప్పులను విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి
  • అనంతరం అదే పాన్ లో పుచ్చకాయ, గుమ్మడి, అవిసే, పొద్దుతిరుగుపువ్వు గింజలు వేసి రెండు నుంచి మూడు నిమిషాలు దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్ని చల్లారాక చియా గింజలు, ఎండు ఖర్జూరం ముక్కలు యాడ్ చేసి మిక్సీలో గానీ, బ్లెండర్ లో కానీ వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. 
  • అంతే ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ తయారు. ఇప్పుడు ఆ పౌడర్ ను ఎయిర్ టైట్ జార్ లో పెట్టి స్టోర్ చేసుకోవాలి.

ప్రోటీన్ షేక్ చేసుకునే విధానం

  • ఓ గ్లాసులో కప్పు గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకోవాలి. 
  • ఇంట్లో తయారు చేసుకున్న ప్రోటీన్ పౌడర్ ను మూడు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. 
  • తీపి కోసం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల తేనెను కూడా కలుపుకోవచ్చు. 
  • ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ప్రతి రోజూ తాగితే మంచి ఫలితాలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?