AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Holi 2022: హోలీ రంగుల వల్ల ముఖం పాడవకూడదనుకుంటున్నారా?.. అయితే నేచురల్‌ ఫేస్‌ ఫ్యాక్‌లు మీకోసమే..

Holi 2022 Celebrations: మనదేశంలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండగల్లో హోలీ (Holi ) కూడా ఒకటి. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు వచ్చే ఈ రంగుల పండగను చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు.

Holi 2022: హోలీ రంగుల వల్ల ముఖం పాడవకూడదనుకుంటున్నారా?.. అయితే నేచురల్‌ ఫేస్‌ ఫ్యాక్‌లు మీకోసమే..
Holi 2022
Basha Shek
|

Updated on: Mar 16, 2022 | 12:35 PM

Share

Holi 2022 Celebrations: మనదేశంలో అత్యంత వైభవంగా జరుపుకొనే పండగల్లో హోలీ (Holi ) కూడా ఒకటి. ఫాల్గుణ మాసంలో పౌర్ణమి నాడు వచ్చే ఈ రంగుల పండగను చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు. అయితే హోలీ వేడుకల్లో ఉపయోగించే రసాయనిక రంగుల వల్ల చర్మం, జుట్టు, గోళ్ల, జుట్టుకు హాని కలిగిస్తాయి. ముఖ్యంగా రసాయన రంగుల వల్ల చర్మం పొడిబారే ప్రమాదం ఉంది. అదే సమయంలో దురద, దద్దుర్లు తదితర సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. వీటి నుంచి ఉపశనం పొందడానికి కొన్ని సహజమైన ఫేస్‌ ప్యాక్‌లు ఉన్నాయి. ఇవి పొడి చర్మం సమస్యలను దూరం చేయడంతో పాటు ముఖానికి మెరుపును తీసుకొస్తాయి. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

బనానా ప్యాక్

రసాయనిక రంగుల వల్ల ముఖం పొడిబారిన సందర్భాల్లో అరటి ఫ్యాక్‌ బాగా ఉపయోగపడుతుంది. ఇది చర్మానికి తేమను అందించడంతో పాటు ముఖానికి మెరుపును తీసుకొస్తుంది. ఇందుకోసం ఒక అరటిపండును మెత్తగా గుజ్జుగా చేసి, దానికి ఒక చెంచా కొబ్బరి నూనె కలపాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి అప్లై చేసి కాసేపు అలాగే ఉంచాలి. అలాగే మెడ నుంచి ముఖానికి మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే సరి.

శెనగ పిండి

మలాయి, శెనగ పిండితో చేసిన ఫేస్‌ ప్యాక్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది చర్మం పొడిబారకుండా చేస్తుంది. అదేవిధంగా ముఖానికి మృదుత్వాన్ని తీసుకొస్తుంది. ఛాయను కాంతివంతంగా మారుస్తుంది. ఇందుకోసం రెండు చెంచాల శెనగపిండిని తీసుకుని, అందులో ఒక చెంచా క్రీమ్ మిక్స్ చేసి పేస్ట్ లా చేసి, సగం నిమ్మకాయను పిండాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించాలి. కొద్దిగా ఆరిన తర్వాత కొద్దిగా పాలతో ముఖాన్ని మసాజ్ చేయండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కోవాలి.

నారింజ తొక్క

ఆరెంజ్ తొక్క చర్మానికి చాలా మంచిదని సౌందర్య నిపుణులు సూచిస్తుంటారు. ఇందుకోసం నారింజ తొక్కలను ఎండబెట్టి బాగా పౌడర్‌లాగా మార్చుకోవాలి. ఈ పొడిలో తేనె కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి పట్టించాలి. కొంత సమయం తర్వాత నీళ్లతో కడుక్కోవాలి. దీంతో ముఖం పొడిబారడంతోపాటు చర్మం మిలమిల మెరుస్తుంది.

మసూర్‌ పప్పు ప్యాక్

ఇది ముఖానికి మంచి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుంది. ఈ ఫేస్‌ ప్యాక్‌ను తయారుచేసేందుకు గాను ఇందుకోసం దేశీ నెయ్యిలో మసూర్‌ పప్పు వేయించి కొద్ది సేపు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో కొంచెం పాలు పోసి వేయించిన పప్పును కాసేపు నానబెట్టండి. ఆతర్వాత గ్రైండ్ చేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. మెడ నుంచి ముఖానికి అప్లై చేయాలి. సుమారు అరగంట తర్వాత ముఖాన్ని కడగాలి. దీనివల్ల చర్మం పొడిబారడం తగ్గుతుంది. కావాలంటే ఈ ప్యాక్ ను ముందుగానే తయారుచేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకోవచ్చు. Also read:  Stealth Omicron Variant: చైనాను వణికిస్తున్న మరో కొత్త వేరియంట్‌.. 13 నగరాల్లో లాక్‌డౌన్‌

INDW vs ENGW: నిరాశపర్చిన టీమిండియా.. ఇంగ్లండ్‌ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం.. పాయింట్ల పట్టికలో మనం ఎక్కడున్నామంటే..

TS AIDS Control Society Jobs 2022: డిగ్రీ/డిప్లొమా అర్హతతో.. తెలంగాణ ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీలో ఉద్యోగాలు..పూర్తివివరాలివే!

కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
2026లో మరో 30 శాతం పెరగనున్న బంగారం! నివేదికలో ఆశ్చర్యకరమైన విషయం
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
20 సార్లు ఓడిన తర్వాత రాహుల్ చిట్కా పనిచేసిందంటున్న ఫ్యాన్స్
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
టెస్టులకు కూడా దొరకని వ్యాధి.. వదిలేస్తే యమ డేంజర్!
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
రూ.100 కంటే తక్కువ ప్లాన్స్‌ గురించి తెలుసా? 30 రోజుల వ్యాలిడిటీ
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
చూడటానికి ఇంత ఉంది.. సింహానికి కూడా సుస్సు పోయిస్తుంది..
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
వెంకటగిరి రాజా ఫ్యామిలీ కోసం తయారైన స్పెషల్ రెసిపి..టేస్ట్ చేశారా
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
పర్సనల్ లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
ఇంట్లో గులాబీలు గుత్తులుగా పూస్తున్నాయా?.. వాస్తు చెప్పే రహస్యం..
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌
పాస్‌వర్డ్ లేకుండా వైఫైని ఎలా కనెక్ట్ చేయాలి? సులభమైన ట్రిక్‌