Air Conditioner Maintenance: వర్షాకాలంలో ఏసీలు జాగ్రత్త.. అశ్రద్ధగా ఉన్నారో ఇబ్బందులే.. ఈ టిప్స్ తప్పక ఫాలో అవ్వండి..
వర్షాకాలంలోనే ఏసీల మెయింటెనెన్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏసీలు పనితీరు తగ్గకుండా ఉండాలంటే మరింత కేర్ తీసుకోవాల్సి ఉంటుంది.

తీవ్రమైన ఎండల నుంచి కొంత ఉపశమనం లభించింది. రుతుపవనాల రాకతో తొలకరి వర్షాలు ప్రారంభమయ్యాయి. నిన్నమొన్నటి వరకూ నాన్ స్టాప్ గా పనిచేసిన ఎయిర్ కండీషనర్లకు కాస్త బ్రేక్ దొరకుతోంది. అయితే ఈ వర్షాకాలంలోనే ఏసీల మెయింటెనెన్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏసీలు పనితీరు తగ్గకుండా ఉండాలంటే మరింత కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వర్షాకాంలో ఏసీలు మరింత బాగా పనిచేసేలా చూసేందుకు అవసరమైన కొన్ని చిట్కాలను మీకు అందిస్తున్నాం. అవేంటో చూద్దాం రండి..
వర్షాకాలంలో ఏసీల టెంపరేచర్..
ఈ సీజన్ లో వర్షాలు ఎక్కవగా పడుతుంటాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత కూడా తగ్గుతుంది. ఎండాకాలంలో ఉన్నంతగా ఇప్పుడు ఉండదు. దీంతో మీ గదిలో ఉక్కపోత, తేమ లేకుండా రూమ్ టెంపరేచర్ ఉంటేట్లు చూసుకుంటే సరిపోతుంది. మీ ఏసీలను కనీసం 24 నుంచి 26 డిగ్రీల మధ్య ఉంచుకుంటే సరిపోతుంది. ఇది మీ కరెంటు బిల్లును కూడా తగ్గిస్తుంది.
ఏసీలను ఇలా చూసుకోవాలి..
మోడ్.. వర్షాకాలంలో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుంది. మీ ఏసీలో ఆప్షన్ ఉంటే డ్రై మోడ్లో ఉంచుకోవాలి. అది తేమను అదుపు చేస్తుంది. ఇది కాక ఏసీల్లో మరికొన్ని మోడ్లు కూడా ఉంటాయి. అవి కూల్, హీట్, ఫ్యాన్ వంటి వాటిని మీ రూం వాతావరణానికి అనుగుణంగా మార్చుకోవాలి.
ఫిల్టర్లను శుభ్రపరచాలి.. మీరు ఏ సీజన్లో అయినా ఏసీల పనితీరు మెరుగవ్వాలి అంటే మొదటిగా మీరు చేయాల్సింది ఫిల్టర్లను శుభ్రపరచడమే. మీరు వాటిని కనీసం రెండు నెలలకు ఒకసారి అయినా చెక్ చేసుకోవాలి. దీని వల్ల మీ ఏసీ పనితీరు మెరుగు అవుతుంది. అలాగే పవర్ వినియోగం కూడా తగ్గుతుంది.
ఫ్యాన్ వాడండి.. మీ గదిలో ఏసీ ఆన్లో ఉన్నప్పటికీ సీలింగ్ ఫ్యాన్ ని వాడాలి. దీని వల్ల గాలి గది అంతా త్వరగా విస్తరించడానికి అవకాశం కలుగుతుంది. అలాగే ఏసీ అవుట్ డోర్ యూనిట్ పై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.
గదిలో ఇవి ఉంచొద్దు.. ఏసీ పనితీరు మెరుగ్గా ఉండాలంటే మీ గదిలో వేడిని ఉత్పత్తి చేసే వస్తువులను ఉంచొద్దు. ముఖ్యంగా ఎల్ఈడీ టీవీ, కంప్యూటర్ వంటివి బెడ్ రూంలో ఉంచకండి. ముఖ్యంగా ఏసీ వెంట్ కి ఎదురుగా ఇలాంటివి ఉండకుండా చూసుకోండి.
పర్యవేక్షణ.. నిరంతరం ఏసీ వాడుతున్నప్పుడు దానిలోపలికి దుమ్మూ, ధూళి, డెబ్రిస్ వంటివి చేరతాయి. మీ ఏసీ పనితీరు మెరుగ్గా ఉండటానికి కచ్చితంగా మెయింటెన్స్ నిర్వహించాలి. రెగ్యూలర్ గా సర్వీసింగ్ చేయించాలి. అలాగే గ్యాస్ లీకేజీలు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







