Car Driving Tips: కార్ డ్రైవ్ చేసే ముందు ఆ పని చేయడం తప్పనిసరి.. నిపుణులు చెప్పేది వింటే షాకవుతారు..
అయితే కార్ డ్రైవ్ చేసే సమయంలో కచ్చితంగా మూత్ర విసర్జన చేయాలని నిపుణులు చెబుతున్నారు. అది లాంగ్ డ్రైవ్ అయినా లేదా ట్రాఫిక్ పీక్ అవర్‌లో పనికి వెళ్తున్నప్పుడు, చక్రం వెనుక వెళ్లే ముందు ఒక్కసారి మూత్ర విసర్జన చేయడం తప్పనిసరి. ఒక్కవేళ మూత్ర విసర్జన చేయపోతే ప్రాణాపాయం తప్పదని వైద్యులు చెబుతున్నారు.

మారుతున్న రోజులను బట్టి ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క కుటుంబానికి కార్ ఉండడం అనేది కామన్‌గా మారింది. గతంలో ఉన్నతవర్గాలకే పరిమితమైన కార్లు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా కార్లను సెల్ఫ్ డ్రైవ్ చేసే వారి సంఖ్య ఇటీవల కాలంలో పెరిగింది. అత్యవసర సమయాల్లో డ్రైవర్‌పై ఆధారపడకుండా ఉండడంతో పాటు కారు నిర్వహణ ఖర్చును తగ్గించేందుకు సెల్ఫ్ డ్రైవింగ్ చేస్తున్నారు. అయితే కార్ డ్రైవ్ చేసే సమయంలో కచ్చితంగా మూత్ర విసర్జన చేయాలని నిపుణులు చెబుతున్నారు. అది లాంగ్ డ్రైవ్ అయినా లేదా ట్రాఫిక్ పీక్ అవర్‌లో పనికి వెళ్తున్నప్పుడు, చక్రం వెనుక వెళ్లే ముందు ఒక్కసారి మూత్ర విసర్జన చేయడం తప్పనిసరి. ఒక్కవేళ మూత్ర విసర్జన చేయపోతే ప్రాణాపాయం తప్పదని వైద్యులు చెబుతున్నారు. మూత్రాశయంతో డ్రైవ్‌కు వెళ్లి, ఆ తర్వాత సీటులో మెలికలు తిరుగుతూ చాలాసేపు నిరీక్షిస్తూ ఉంటారు. ఇలా చేయడం కంటే మూత్ర విసర్జన చేయడం మంచిదని నిపుణుల సూచన. మూత్ర విసర్జన ఆపుకుంటే వచ్చే ప్రమాదాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
మానవ శరీర నిర్మాణంలో మూత్రాశయం బుడగలా ఉంటుంది. మూత్రాశయం నిండినప్పుడు, మూత్రవిసర్జన చేయనప్పుడు అది ఉబ్బిపోతుంది. ఇలాంటి సమయంలో ఇంట్రాపెరిటోనియల్ పొత్తికడుపు గోడ చీలికకు దారితీస్తుంది. ఇది మరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అయితే అనుకోని పరిస్థితుల్లో కారు ప్రమాదం జరిగితే ఆ సమయంలో మూత్రాశయం ఖాళీగా ఉంటే అది పాప్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో అంత తీవ్రంగా లేని ఎక్స్‌ట్రాపెరిటోనియల్ చీలిక కారణం అవుతుంది.
ఎక్కువ సేపు మూత్ర విసర్జన చేయకపోతే జరిగేదిదే..
వైద్యుల తెలిపిన వివరాల ప్రకారం సుదీర్ఘంగా కారు ప్రయాణిస్తే మూత్ర విసర్జన చేయకపోతే బ్యాక్టీరియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యూటీఐ) ఏర్పడుతుంది. దాని వల్ల మూత్రంలో రక్తం రావడం, వాసనతో కూడిన మూత్రం రావడం, రాత్రి సమయాల్లో తరచూ మూత్ర విజర్జన చేయాల్సి రావడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి, దిగువ పక్కటెముకల్లో నొప్పి, అధిక శరీరీ ఉష్ణోగ్రత, వెనుక వైపు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స చేయకుండా వదిలేస్తే యూటీఐ సెప్సిస్‌కు కారణమవుతుంది. అలాగే పెల్విక్ ఫ్లోర్‌ను కూడా దెబ్బతీస్తుంది. మూత్రాశయంలోని కండరాలు అవసరమైనప్పుడు సంకోచించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఇది మూత్ర నిలుపుదలకి కారణమవుతుంది. కాబట్టి కార్ డ్రైవ్ చేసే ముందు కచ్చితంగా మూత్ర విసర్జన చేయడం ఉత్తమం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..







