Food Eating Tips: కింద కూర్చొని తినడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం… అజీర్ణం సమస్య ఫసక్…
ప్రార్థనా స్థలంలో లేదా భోజనం కోసం ఇతర సమయాల్లో కింద కూర్చునే వారు. ఇలా కింద కూర్చొవడం వెనుక సైన్స్ ఉంది. ముఖ్యంగా ఇలా కూర్చొవడం అనేది జీర్ణక్రియతో ముడిపడి ఉంది. భోజనం చేయడానికి సుఖాసనంలో కూర్చోవడం యోగా చేయడానికి ఒక మార్గం అని ఆయుర్వేదం చెబుతోంది.

భారతీయ సంస్కృతిలో నేలపై కూర్చుని తినడం అనేది ముఖ్యమైన భాగం. దీని వల్ల కలిగే లాభాలను చాలా మంది మరచిపోయారు. భోజనం ఒక్క విషయంలోనే కాదు గతంలో ఏ సమయంలోనైనా కింద కూర్చునే వారు. అలాగే ప్రార్థనా స్థలంలో లేదా భోజనం కోసం ఇతర సమయాల్లో కింద కూర్చునే వారు. ఇలా కింద కూర్చొవడం వెనుక సైన్స్ ఉంది. ముఖ్యంగా ఇలా కూర్చొవడం అనేది జీర్ణక్రియతో ముడిపడి ఉంది. భోజనం చేయడానికి సుఖాసనంలో కూర్చోవడం యోగా చేయడానికి ఒక మార్గం అని ఆయుర్వేదం చెబుతోంది. ఇది మాత్రమే కాదు. ఇలా చేయడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి మీరు తినడానికి సోఫాలో వంగి డైనింగ్ టేబుల్‌పై కూర్చుంటే ఓ సారి ఆలోచించుకోవడం ఉత్తమం. నేలపై కాలు వేసుకుని కూర్చోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా శరీర భంగిమను సరిచేసి రక్తాన్ని పంప్ చేసి శరీరమంతా ప్రసరింపజేస్తుందని వైద్యులు చెబుతున్నారు. సుఖాసనంలో కూర్చోవడం వల్ల కలిగే లాభాలతో పాటు జీర్ణక్రియకు ఎలా సహాయపడుతుందో? ఓ సారి తెలుసుకుందాం.
మెరుగైన రక్త ప్రసరణ
సుఖాసనంలో కూర్చోవడం పాదాలకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. మెరుగైన జీర్ణక్రియ కోసం వారి కార్యకలాపాలను పెంచడానికి గుండె, కాలేయం వంటి ఇతర శరీర భాగాలకు మళ్లుతుంది. భోజనం కోసం డైనింగ్ టేబుల్‌పై కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ అనేది కేవలం పాదాలకు మాత్రమే కేంద్రీకరిస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ
సుఖాసనంలో కూర్చోవడం వల్ల జీర్ణక్రియకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది జీర్ణ రసాలను స్రవించడానికి శరీరాన్ని సరైన భంగిమలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి శరీరం సిద్ధంగా ఉందని మెదడుకు సంకేతాలను పంపడంలో సహాయపడుతుంది.
బరువు తగ్గడం
అతిగా తినడం లేదా అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం లేదా మలబద్ధకం వల్ల బరువు పెరగడం జరుగుతుంది. మంచి జీర్ణక్రియ బరువు తగ్గడానికి మరియు వేగవంతం చేయడానికి కూడా అద్భుతాలు చేస్తుంది.
ఫ్లెక్సిబిలిటీ
కాళ్లకు అడ్డంగా కూర్చోవడం వల్ల వెన్నెముక, ఛాతీ, చీలమండలు, తుంటి, మోకాళ్లకు బలం వస్తుంది. మరింత సరళంగా మారడంలో సహాయపడతాయి. మోకాళ్ల నొప్పులు, ఇతర ఆర్థరైటిస్ సంబంధిత సమస్యలు పూర్వీకులలో ఎక్కువగా ఉండకపోవడానికి ఇది ఒక కారణం.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి






