Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Brake failure: మీ కారు బ్రేకులు ఫెయిల్ అయితే వెంటనే ఇలా చేయండి.. సురక్షితంగా బయటపడొచ్చు..

మీ కారు బ్రేక్‌లు ఫెయిల్ అయితే మీరు ఏమి చేస్తారు.. ఈ ప్రశ్న చాలా మంది మదిలో రావచ్చు. కానీ అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో చాలా మందికి తెలియదు. అంతా కంగారుపడిపోతారు. ఆందోళన చెందుతారు. తమ పక్కన ప్రయాణిస్తున్నవారిని కూడా కంగురుపడేలా చేస్తారు. అలా కాకుండా ఇలా చేస్తే సురక్షితంగా మీరు బయటపడొచ్చు.

Car Brake failure: మీ కారు బ్రేకులు ఫెయిల్ అయితే వెంటనే ఇలా చేయండి.. సురక్షితంగా బయటపడొచ్చు..
Car Brakes Fail
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 26, 2023 | 7:29 PM

కారు డ్రైవింగ్ ఇప్పుడు చాలా ఈజీగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో బైక్ నడిపేవారిలో చాలా మంది కారు కూడా డ్రైవ్ చేస్తున్నారు. కారు డ్రైవింగ్ రావడం తప్పనిసరిగా మారిపోయింది. ఒక్కప్పుడు కారు విలాసవంతమైనదిగా ఉండేది. పెద్ద పెద్ద నగరాల్లోని వంద కుటుంబాలకు ఒకరికి మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ లెక్క మారింది. వందలో 90 శాతం కుటుంబాలకు కారును కలిగి ఉంటున్నారు. దీంతో ఇంట్లో ఉండే మహిళలు కూడా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. అయితే కారు డ్రైవింగ్ ఈజీగా చేస్తున్నవారు కూడా ఏదైన సమస్య వస్తే మాత్రం చేతులు ఎత్తేస్తున్నారు. కారులోవచ్చే చిన్న చిన్న సమస్యలపై అవగాహన ఉండటం లేదు.

ఇందులో కారు బ్రేకుల విషయంలో ఏదైనా సమస్య ఉంటే వెంటనే మెకానిక్‌కు చూపించాలి. ఎప్పుడైనా అనుకోని సందర్భంలో కారుకు బ్రేకులు ఫెయిల్ అయితే మీరు ఏం చేయాలనేది.. మనలో చాలా మందికి తెలియదు. ఈ ప్రశ్న చాలా మంది మదిలో రావచ్చు. కానీ అలాంటి పరిస్థితిలో ఏం చేయాలో చాలా మందికి తోచదు. అందువల్ల, బ్రేక్ వైఫల్యం చెందితే ఎదుర్కోవటానికి రెడీగా ఉండాలి. కంగారు పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. కారు బ్రేకులు ఫెయిల్ అయితే ఏం చేయాలో ఇక్కడ మనం తెలుసుకుందాం.

1. వార్నింగల్ లైట్లు..

మీ చుట్టూ ఉన్న వాహనాలను అప్రమత్తం చేయడానికి.. వార్నింగ్ లైట్లను ఆన్ చేసి.. హారన్ కొడుతూ ఉండండి. మీరు కారులో సమస్యను ఎదుర్కొంటున్నారని రోడ్డుపై ఉన్న ఇతర వ్యక్తులు అప్రమత్తం చేస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల ట్రాఫిక్‌ను క్లియర్ చేయడంలో ఇది సహాయపడుతుంది.

2. బ్రేక్ పెడల్‌ను నొక్కుతూ ఉండండి:

ఇప్పుడు కొత్తగా మార్కెట్లోకి వస్తున్న కార్లలో డ్యూయల్ బ్రేకింగ్ సిస్టమ్‌ ప్రవేశపెట్టబడ్డాయి. తద్వారా ముందు, వెనుక బ్రేక్‌లను స్వతంత్రంగా నియంత్రించవచ్చు. బ్రేక్ పెడల్‌ను నిరంతరం తొక్కుతుండటం వల్ల బ్రేక్ ప్రెజర్ పెరిగి సగం బ్రేక్‌లు వచ్చే అవకాశం ఉంది. అయితే, రెండు బ్రేకింగ్ సిస్టమ్‌లు ఫెయిల్ ఈ పద్ధతి పనిచేయదు.

3. నెమ్మదిగా డౌన్‌షిఫ్ట్ చేయండి..

బ్రేకులు పూర్తిగా ఫెయిల్ అయితే కారు వేగాన్ని తగ్గించడానికి ఇంజిన్ బ్రేకింగ్‌ని ఉపయోగించండి. ఇది అత్యంత ఉత్తమమైన.. అంటే సమర్థవంతమైన పద్ధతి అని చెప్పవచ్చు. యాక్సిలరేటర్‌ని విడుదల చేసి, ఒక్కొక్కటిగా తక్కువ గేర్‌లకు మారుతూ ఉండండి. ఆటోమేటిక్ కార్లలో.. ప్యాడిల్ షిఫ్టర్ ద్వారా ఈ పనిని చేయండి.

4. హ్యాండ్‌బ్రేక్‌ని ఉపయోగించి

నెమ్మదిగా కారును మొదటి లేదా రెండవ గేర్‌లోకి తీసుకురండి. ఇప్పుడు మీ వేగం 40 kmph కంటే తక్కువగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు హ్యాండ్‌బ్రేక్‌ని ఉపయోగించవచ్చు. ఈ సమయంలో వెనుక నుంచి వాహనం రావడం లేదని గుర్తుంచుకోండి.

5. ఇలా కూడా చేయవచ్చు..

చుట్టూ ఇసుక లేదా బురద ఉంటే.. వెంటనే కారును అదుపులోకి తీసుకెళ్లండి. ఇసుక లేదా మట్టిపైకి డ్రైవ్ చేయండి. దీంతో కారు వేగం తగ్గిపోయి ఆగిపోతుంది. అయితే, అలా చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Note: ( ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఉంది. టీవీ9 NEWS దానిని ధృవీకరించలేదు.)

మరిన్ని హ్యూమన్ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం