Health Tips: ముఖంపై అప్పుడప్పుడు వాపు వస్తోందా? ఇదే కారణమై ఉండొచ్చు.. ఇలా చేయండి..
ముఖం అప్పుడప్పుడు వాచినట్లుగా అనిపిస్తోందా? ఆ వాపు ఎక్కువ సమయం ఉంటుందా? అయితే, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. ఇది అనారోగ్యానికి అలారం బెల్ లాంటిందని చెబుతున్నారు. చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ముఖం వాయడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు నిద్ర నుండి మేల్కొన్న తర్వాత వాపు కొంత సమయం వరకు ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు ముఖంపై ద్రవం పేరుకుపోవడం వలన ఇది జరుగుతుంది.

Health Tips: ముఖం అప్పుడప్పుడు వాచినట్లుగా అనిపిస్తోందా? ఆ వాపు ఎక్కువ సమయం ఉంటుందా? అయితే, జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే.. ఇది అనారోగ్యానికి అలారం బెల్ లాంటిందని చెబుతున్నారు. చర్మవ్యాధి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ముఖం వాయడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు నిద్ర నుండి మేల్కొన్న తర్వాత వాపు కొంత సమయం వరకు ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు ముఖంపై ద్రవం పేరుకుపోవడం వలన ఇది జరుగుతుంది. బోర్లా పడుకునే వారి ముఖంలో ఈ వాపు సర్వసాధారణం. కానీ, వాపు ఎక్కువ సమయం ఇలాగే ఉంటే మాత్రం దానికి కొన్ని ఇతర కారణాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి ముఖం వాపునకు కారణాలేంటి? దాని నివారణకు మార్గాలేంటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ముఖం మీద వాపు రావడానికి 3 ప్రధాన కారణాలు..
1. చర్మ అలెర్జీ
చెడు ఆహారం వల్ల అలర్జీ రావచ్చు. దీని కారణంగా ముఖం మీద వాపు ఏర్పడుతుంది. దుమ్ము, దూళి పడటం, పెంపుడు జంతువుల చర్మం లేదా కొన్ని ఆహారాలు, కీటకాల కాటు వల్ల అలర్జీలు రావచ్చు. అలర్జీల వల్ల సైనస్‌లు కుచించుకుపోయి ముఖం ఉబ్బిపోవచ్చు.
2. చర్మం స్థితిస్థాపకత కోల్పోవడం
చర్మం స్థితిస్థాపకత కోల్పోవడం వల్ల కూడా ముఖం మీద వాపు వస్తుంది. పెరుగుతున్న వయస్సుతో, చర్మం స్థితిస్థాపకత తగ్గుతుంది, దీని కారణంగా రాత్రి సమయంలో ద్రవం పేరుకుపోతుంది. ముఖం మీద వాపు పెరుగుతుంది. దాన్ని ఆపడం కష్టం. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ చర్మం వదులుగా మారుతుంది. అయితే, చర్మం సహజ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా కొంతవరకు చర్మాన్ని మృదువుగా చేయవచ్చు.
3. అధిక ఉప్పు, మద్యం వినియోగం
ఆల్కహాల్, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ముఖం మీద వాపు వస్తుంది. చాలా సార్లు ఈ సమస్య సోడియం ఉన్న ఆహారాల వల్ల వస్తుంది. ముఖం మీద వాపు కూడా డీహైడ్రేషన్‌కు సంకేతం. ముఖ్యంగా మీరు ఉప్పు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నప్పుడు. డీహైడ్రేషన్ కారణంగా శరీరంలో వ్యర్థాలు పేరుకుపోతాయి. ఈ కారణంగా, ముఖం మీద వాపు పెరుగుతుంది.
ముఖం వాపు నుండి బయటపడే చిట్కాలు..
1. హైడ్రేటెడ్ గా ఉండటానికి రోజంతా వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. హైడ్రేషన్ శరీరం నుండి అదనపు ద్రవాన్ని బయటకు పంపడం ద్వారా వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
2. ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం మానుకోండి. ఎందుకంటే అధిక సోడియం స్థాయిలు శరీరంలో ద్రవాలు నిలిచిపోవడానికి సహాయపడుతాయి.
3. పడుకునేటప్పుడు మీ తల పైకి ఉండేలా ఒకటి కంటే ఎక్కువ దిండులను వాడొచ్చు. ఇలా చేయడం వలన కణజాలంలో ద్రవం పేరుకుపోదు. వాపు ఏర్పడదు.
4. ఉదయాన్నే కొంత సమయం పాటు ముఖం చల్లబరచడం వల్ల వాపు నుండి ఉపశమనం పొందవచ్చు.
గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న వివరాలు ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..