AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Benefits Of Roses: అందమైన గులాబీలతో అద్భుతమైన ఆరోగ్యం..లాభాలు తెలిస్తే అవాక్కే..

అందమైన మెరిసే చర్మం కోసం చాలా మంది గులాబీ రేకులను ఉపయోగిస్తారు. కొందరు గులాబీ రేకులను తింటారు. మరికొందరు ఫేస్‌ ప్యాక్‌, హెయిర్‌ మాస్క్‌గా కూడా ఉపయోగిస్తారు. కానీ, అందమైన గులాబీ రేకులు చర్మ, కేశ సౌందర్యానికి మాత్రమే కాదు..ఆరోగ్యానికి ఎలాంటి లాభాలు అందిస్తుందో తెలిస్తే అస్సలు నమ్మలేరు. గులాబీ రేకులు తినటం వల్ల శరీరం నుండి మలినాలను క్లియర్ చేస్తుంది. అంతేకాదు..జీవక్రియను మెరుగుపరుస్తుంది. మరిన్ని లాభాలేంటో ఇక్కడ చూద్దాం..

Health Benefits Of Roses: అందమైన గులాబీలతో అద్భుతమైన ఆరోగ్యం..లాభాలు తెలిస్తే అవాక్కే..
Rose Petals
Jyothi Gadda
|

Updated on: Nov 01, 2025 | 1:32 PM

Share

ఈ గులాబీలు బరువు తగ్గడంలో సహాయపడతాయి. రోజు కొన్ని తాజా గులాబీ రేకులను తినడం వల్ల ఇంద్రియాలను సంతృప్తిపరుస్తాయి. ఫలితంగా సహజమైన మార్గంలో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. గులాబీ పూలు కేవలం అందానికి, అలంక‌ర‌ణకు మాత్రమే కాదు.. పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాల నిధి. గులాబీ పూ రేకులలో ఎన్నో అద్భుత‌మైన ఔష‌ధ గుణాలు ఉంటాయి. గులాబీ రేకుల సువాసన ఒత్తిడిని తగ్గిస్తుంది. గులాబీ రేకుల‌తో త‌యారు చేసిన డ్రింక్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి, ఒత్తిడి, డిప్రెష‌న్ వంటి స‌మ‌స్యలు దూరం అవుతాయి. గులాబీ రేకుల్లో విటమిన్ ఎ, సి, ఇ, ఐరన్, కాల్షియం విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. గులాబీ రేకులలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

గులాబీ రేకులను రోజు వారిగా నిర్ణీత మోతాదులో తీసుకుంటే ఆకలి తగ్గుతుంది. దీంతో అతిగా తినకుండా ఉంటారు. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. గులాబీ రేకుల్లోని గుణాలు శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పైల్స్ సమస్యతో బాధపడుతున్న వారు గులాబీ రేకులను తీసుకోవటం వల్ల సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే పీచు పదార్ధం జీర్ణశక్తిని పెంచేందుకు తోడ్పడుతుంది.

గులాబీ రేకులు, బాదంపప్పు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది. గులాబీ రేకులతో తయారు చేసిన కషాయం తీసుకోవటం వల్ల శరీరంలో చెడు కొలస్ట్రాల్‌ పోతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గులాబీ పువ్వులలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్ ఎలిమెంట్ చర్మంలోని దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయడంతో పాటు స్కిన్ ఇన్ఫెక్షన్లు దరిచేరకుండా కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

కొబ్బరి నూనెలో గులాబీ రేకులను కలిపి వేడి చేసి, చల్లరిన తరువాత తలకు రాసుకోవటం వల్ల మెదడు చల్లబడి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. చీముపట్టి బాధపెట్టే పుళ్ళ మీద గులాబీ పొడి చల్లితే యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది. శరీరంలోని సెల్యులార్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..