Mango Leaves Benefits : మామిడి ఆకుల్లో దాగివున్న ఆరోగ్య రహస్యం తెలిస్తే.. అసలు వదిలిపెట్టరు..
వీటిని వివిధ రూపాల్లో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలంటే మామిడి ఆకుల్ని తీసుకోవడం మంచిది. మామిడి ఆకులు రక్తనాళాలని బలోపేతం చేస్తాయి. మామిడి ఆకులు క్యాన్సర్ నిరోధక లక్షణాలని కలిగి ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి.
పండ్లలో రారాజు మామిడి.. దీని రుచిలో ఏ పండు సరితూలదనే చెప్పాలి. అంతేకాదు.. మామిడిలోని పోషకాలు కూడా అంతే ఎక్కువగా ఉన్నాయి. మామిడి కాయ, పండ్లు రెండిటీని ప్రజలు ఇష్టంగా తింటారు. అయితే, మామిడి కాయ, పండు మాత్రమే కాదు.. ఆకులతో కూడా అంతే ప్రయోజనం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.. మామిడి ఆకుల్లో పుష్కలమైన ఔషధ గుణాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఆయా లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
మామిడి ఆకులలో విటమిన్ సి, బి, ఎ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకుల్లో అనేక ఇతర పోషకాలు కూడా సమృద్ధిగా ఉన్నాయి. మామిడి ఆకులలో ఫ్లేవనాయిడ్లు, ఫినాల్స్ అధిక మొత్తంలో ఉన్నందున శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఈ ఆకులలో ఔషధ గుణాలు అనేకం ఉన్నాయి. అనేక ఆరోగ్య సమస్యలను నయం చేస్తాయి. రోజూ మామిడి ఆకుల టీ చేసుకుని తీసుకొని తాగడం వల్ల వేగంగా బరువు తగ్గడానికి అవుతుంది. మామిడి ఆకుల టీ జీవక్రియ రేటును వేగంగా పెంచుతుంది.
మామిడి ఆకులు జీర్ణశక్తిని కూడా పెంచుతాయి. మామిడి ఆకుల్లోని ఫైబర్ అజీర్తి వంటి సమస్యల్ని కూడా దూరం చేయగలవు. శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోకుండా మామిడి ఆకులు చూసుకుంటాయి. మామిడి ఆకులను తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరిగి కొవ్వు నిల్వలు కరుగుతాయి. షుగర్ కంట్రోల్‌లో ఉండాలనుకునే వాళ్లకి మామిడి ఆకులు మంచి ఎంపిక. వీటిని వివిధ రూపాల్లో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. రక్తపోటుని అదుపులో ఉంచుకోవాలంటే మామిడి ఆకుల్ని తీసుకోవడం మంచిది. మామిడి ఆకులు రక్తనాళాలని బలోపేతం చేస్తాయి. మామిడి ఆకులు క్యాన్సర్ నిరోధక లక్షణాలని కలిగి ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి.
మామిడి ఆకులను తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా మారుతుంది. చికాకు, దద్దుర్లు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ ఆకుల సారం వృద్ధాప్య సంకేతాలని తగ్గిస్తుంది. యవ్వనంగా కనపడేందుకు అవుతుంది. వివిధ రూపాల్లో వీటిని తీసుకుంటే ముడతలు రావు. జుట్టు సమస్యల్ని కూడా మామిడి ఆకులు తొలగిస్తాయి. జుట్టు నెరిసిపోవడాన్ని నివారిస్తుంది. మామిడి ఆకులు తీసుకుంటే జుట్టు మూలాల నుంచి బలంగా మారుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..