AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వార్నీ.. లగ్జరీ కారుకు కష్టం వస్తే..ఎడ్లబండే దిక్కైంది..! ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే..

ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. లగ్జరీ కారును ఎద్దుల బండితో బయటకు తీస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది. ఇందులో ఎద్దులు హాయిగా కారును లాగుతుండగా, ఈ మొత్తం ఘటనను చూసి పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు.

Watch: వార్నీ.. లగ్జరీ కారుకు కష్టం వస్తే..ఎడ్లబండే దిక్కైంది..! ఏం జరిగిందో వీడియోలో చూడాల్సిందే..
Ferrari Car Stuck
Jyothi Gadda
|

Updated on: Dec 31, 2024 | 6:35 PM

Share

ఫెరారీ కాలిఫోర్నియా రోడ్‌స్టర్..ఈ ఖరీదైన కారు.. లగ్జరీ లైఫ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నిలుస్తుంది. దాని వేగం, స్టైలిష్‌ లుక్‌, విలాసానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ కారు రోడ్డుపై పరుగులు తీస్తుంటే..ఆ రాజసం చూడాల్సిందే..! కానీ, పాపం ఫెరారీ కారుకు కష్టం వస్తే.. ఎద్దుల బండి సాయం చేయాల్సి వచ్చింది. అవును మీరు విన్నది నిజమే..ఫెరారీ కార్‌ డ్రైవర్‌ అత్యుత్సాహం కారణంగా ఈ కారు ఇసుకలో చిక్కుకుంది. దాంతో కారును బయటకు లాగేందుకు ఒక ఎద్దుల బండి రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఇసుకలో నుండి లగ్జరీ కారును ఎద్దుల బండితో బయటకు తీస్తున్న వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారింది.

వైరల్‌ వీడియో ఆధారంగా.. ముంబైకి చెందిన ఇద్దరు పర్యాటకులు తమ లగ్జరీ కారు ఫెరారీతో అలీబాగ్‌లో విహారయాత్రకు వెళ్లారు. కానీ వారి కారు రెవ్‌దండా బీచ్‌లో ఇసుకలో చిక్కుకుంది. ఆ తర్వాత ఇసుక నుంచి తమ కారును బయటకు తీయలేక వారికి చెమటలు పట్టాయి. తమ కారును ఇసుకలోంచి బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. కారు ఇంచు కూడా కదలటం లేదు. అంతలోనే అటుగా వెళ్తున్న ఒక ఎద్దుల బండి వారికి బాగా కలిసొచ్చింది. సహాయం కోసం ఎద్దుల బండి ఓనర్‌ని వేడుకున్నారు. ఫెరారీ కారు ముందుభాగాన్ని తాడుతో కట్టి ఎడ్లబండిని ముందుకు పోనిచ్చారు. ఇలా లగ్జరీ కారు ఎట్టకేలకు బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్‌గా మారింది.

క్లిష్ట పరిస్థితుల్లో కొన్నిసార్లు సరళమైన పరిష్కారాలు కూడా ప్రభావవంతంగా ఉంటాయని ఈ సంఘటన మరోసారి రుజువు చేస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తోంది. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇందులో ఎద్దులు హాయిగా కారును లాగుతుండగా, ఈ మొత్తం ఘటనను చూసి పర్యాటకులు ఆశ్చర్యపోతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్