Hair Care Tips: జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? మెంతులతో ఇలా చేస్తే మిరాకిల్ చూడొచ్చు..

చలికాలంలో చర్మం, మరియు జుట్టుకు సంబంధించిన వివిధ సమస్యలు వస్తాయి. చలికాలంలో వచ్చే సాధారణ సమస్యలలో జుట్టు పొడిబారడం, గడ్డలు కట్టడం

Hair Care Tips: జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? మెంతులతో ఇలా చేస్తే మిరాకిల్ చూడొచ్చు..
Fenugreek Leaves
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 12, 2022 | 7:23 PM

చలికాలంలో చర్మం, మరియు జుట్టుకు సంబంధించిన వివిధ సమస్యలు వస్తాయి. చలికాలంలో వచ్చే సాధారణ సమస్యలలో జుట్టు పొడిబారడం, గడ్డలు కట్టడం వంటివి జరుగుతుంది. సమస్య ఎక్కువై జుట్టు రాలిపోతుంది కూడా. అందుకే.. చాలా మంది తమ జుట్టును రక్షించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఇందులో భాగంగా మార్కెట్‌లో లభించే వివిధ రకాల షాంపూలు, ఆయిల్స్ వినియోగిస్తుంటారు. అయితే, ఇది అందరి జుట్టుకు వర్కౌట్ అవ్వదు. జుట్టు పరిరక్షణ పక్కన బెడితే.. ఉన్న జుట్టు కూడా ఊడిపోయే ప్రమాదం ఉంది. అందుకే సహజంగా జుట్టును పరిరక్షించుకునే చిట్కాలు మన పెద్దలు అనేకం చెప్పారు. వాటిలో ముఖ్యంగా మెంతులు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. శీతాకాలంలో ఎదురయ్యే జుట్టు సంబంధిత సమస్యల పరిష్కారానికి మెంతులు అద్భుతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడం, చిట్లిపోవడం, పొడిబారడం, చుండ్రు వంటి అనేక సమస్యలకు మెంతులు అద్భుతంగా పని చేస్తాయంటున్నారు. మెంతుల్లో విటమిన్ ఏ, సి, కె పుష్కలంగా ఉంటాయి. జుట్టుకు అవసరమైన ప్రోటీన్స్, ఫోలిక్ యాసిడ్స్ ఉంటాయి. మెంతులు జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను పెంచుతాయి. అయితే, మెంతులను 3 రకాలుగా వినియోగిస్తే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. మరి ఆ 3 రకాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మెంతులు-అరటి పేస్ట్..

కొద్దిగా మెంతుల పొడిని తీసుకుని, అందులో ఒక అరటిపండు గుజ్జును వేయాలి. ఇందులో అర టీ స్పూన్ తేనె వేసి పేస్ట్‌ లాగా తయారు చేయాలి. ఆ పేస్ట్‌ని హెయిర్‌ మాస్క్‌గా అప్లై చేసుకోవాలి. అరగంట పాటు దానిని అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో కడిగేయాలి. తేనె, అరటిపండు, మెంతులతో చేసిన పేస్ట్.. తలలో తేమను లాక్ చేసింది. జుట్టును మెరిసేలా చేస్తుంది.

2. మెంతులు – కొబ్బరినూనె..

మెంతి గింజలను రాత్రంతా నానబెట్టాలి. మరుసటిరోజు ఉదయం వాటిని బ్లెండ్ చేసి పేస్ట్ చేయాలి. అందులో ఒక టీస్పూన్ కొబ్బరి నూనె కలపాలి. అలాగే, 2 టీస్పూన్ల మందార పొడిని కలపాలి. ఈ పేస్ట్‌ని జుట్టుకు మసాజ్ చేయాలి. దీనిని 20-30 నిమిషాలు ఉండనివ్వాలి. అనంతరం మంచి నీటితో గానీ, తేలికపాటి షాంపూతో గానీ కడగాలి. ఇది జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి

3. మెంతులు, పెరుగు..

మెంతి గింజల పొడిని తీసుకోవాలి. అందులో ఒక టీస్పూన్ పెరుగు, ఆముదం, కలబంద జెల్ కలపాలి. బాగా పేస్ట్‌గా తయారు చేయాలి. ఆ పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసి, 20 నుంచి 30 నిమిషాల వరకు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఈ పదార్థాలు జుట్టు రాలిపోవడాన్ని నిలిపివేసి, జుట్టు పెరుగుదలకు దోహదపడుతుంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..