Hair Care Tips: జుట్టు రాలడానికి కొన్ని కారణాలున్నాయి.. కానీ అందులో అపోహలు, వాస్తవాలు తెలుసుకోండి..
Hair Care Tips: పొడవాటి, మెరిసే సిల్కీ జుట్టును పొందడం ప్రతి ఒక్కరి కల. దీన్ని సాధించడానికి మార్కెట్లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటివల్ల సైడ్
Hair Care Tips: పొడవాటి, మెరిసే సిల్కీ జుట్టును పొందడం ప్రతి ఒక్కరి కల. దీన్ని సాధించడానికి మార్కెట్లో చాలా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అందుకే సహజ సిద్దమైన ప్రాచీన పద్దతులను వాడితే జుట్టును సంరక్షించుకోవడంతో పాటు ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు. అయితే ఇందులో కొన్ని అపోహలు, వాస్తవాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
అపోహలు.. 1. హెయిర్ ఆయిల్ జుట్టు పొడవును పెంచుతుంది : హెయిర్ ఆయిల్ మీ జుట్టుని మెత్తగా, మృదువుగా చేస్తుంది. ఇది జుట్టు సాంద్రత లేదా పొడవుపై ఎటువంటి ప్రభావం చూపదు. 2. కఠినమైన నీరు జుట్టు రాలడానికి కారణమవుతుంది: కఠిన మైన నీరు జుట్టును చిట్లేలా చేస్తుంది. కానీ జుట్టు రాలడానికి కారణం కాదు. 3. జుట్టు పెరుగుదలకు బయోటిన్ సప్లిమెంట్స్ అవసరం: బయోటిన్ లోపం చాలా అరుదు. ఆరోగ్యకరమైన జుట్టు కోసం మీరు బయోటిన్ సప్లిమెంట్లను తీసుకోవలసిన అవసరం లేదు. తాజా పండ్లు, కూరగాయలు అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే సరిపోతుంది. 4. రెగ్యులర్ షాంపూ జుట్టు రాలడానికి కారణమవుతుంది: చాలా మంది జుట్టు రాలడాన్ని నియంత్రించడానికి వారానికి ఒకసారి మాత్రమే షాంపూ చేయాలని భావిస్తారు. ఇది నిజం కాదు. మీరు మీ తలని శుభ్రంగా ఉంచుకోవాలి షాంపూతో క్రమం తప్పకుండా తలస్నానం చేయాలి. 5. జుట్టును చిన్నగా కత్తిరించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది: ఇది జుట్టు రాలడాన్ని తగ్గించదు కానీ వాటిని చిన్నగా కత్తిరించినందున జుట్టు రాలడం స్పష్టంగా కనిపించదు.
వాస్తవాలు.. 1. మీకు జుట్టు రాలుతున్నట్లయితే ముందుగా విశ్రాంతి తీసుకోండి. అప్పుడు బట్టతల రాదు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టండి. వ్యాయామంతో ఆరోగ్యాన్ని సరిదిద్దడంపై దృష్టి పెట్టండి. 2. ఇది సమస్యాత్మకంగా ఉంటే ఏదైనా పోషకాహార లోపం లేదా హార్మోన్ల అసమతుల్యత కావొచ్చు. 3. ఐరన్, ఫోలిక్ యాసిడ్, సెలీనియం, మెగ్నీషియం, జింక్‌తో పాటు బయోటిన్‌తో కూడిన సప్లిమెంట్ కూడా తీవ్రమైన జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.