Cleaning Tips: బట్టలపై పడే మొండి మరకలను ఈజీగా వదిలించండి ఇలా..

సాధారణంగా అప్పుడప్పుడు బట్టలపై మరకలు పడటం సహజం. అనుకోకుండా అలా కొన్ని సార్లు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆవకాయ మరకలు, నూనె, కూరలు, సింధూరం మరకలు అంత త్వరగా పోవు. ఈ మరకలు చాలా మొండిగా ఉంటాయి. సాధారణ బట్టలతో ఉతికినట్టు ఉతికినా.. బ్రష్ కొట్టినా ఇవి ఒక పట్టాన వదలవు. ఎక్కువ ఉతికినా.. రుద్దినా బట్టలు పాడైపోతాయి. ఇలాంటి సమస్యలకు ఎన్నో చిట్కాలు..

Cleaning Tips: బట్టలపై పడే మొండి మరకలను ఈజీగా వదిలించండి ఇలా..
Cleaning Tips
Follow us

|

Updated on: Jul 09, 2024 | 4:58 PM

సాధారణంగా అప్పుడప్పుడు బట్టలపై మరకలు పడటం సహజం. అనుకోకుండా అలా కొన్ని సార్లు అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఆవకాయ మరకలు, నూనె, కూరలు, సింధూరం మరకలు అంత త్వరగా పోవు. ఈ మరకలు చాలా మొండిగా ఉంటాయి. సాధారణ బట్టలతో ఉతికినట్టు ఉతికినా.. బ్రష్ కొట్టినా ఇవి ఒక పట్టాన వదలవు. ఎక్కువ ఉతికినా.. రుద్దినా బట్టలు పాడైపోతాయి. ఇలాంటి సమస్యలకు ఎన్నో చిట్కాలు ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మీ ముందుకు తీసుకొచ్చాం. ఎవరైతే ఎక్కువగా బట్టలపై పడే మొండి మరకలతో ఇబ్బంది పడుతూ ఉంటారో.. వారు ఈజీగా ఈ టిప్స్ పాటించవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

వెనిగర్:

బట్టలపై పడే మొండి మరలకను తొలగించడంలో వైట్ వెనిగర్ ఎంతో చక్కగా సహాయ పడుతుంది. ఎలాంటి మరకలను అయినా వెనిగర్ ఈజీగా తొలగిస్తుంది. ముందుగా వెనిగర్‌ను గోరు వెచ్చటి నీటిలో కలపండి. అందులో మొండి మరకలు ఉండే దుస్తులను నానబెట్టండి. ఓ అరగంట తర్వాత ఆ దుస్తులను సబ్బు పెట్టి కాస్త బ్రెష్ కొట్టి చేతితో రుద్దితే మరకలు ఈజీగా పోతాయి. జిడ్డు, మొండి మరకలను తొలగించడంలో వెనిగర్ ఎంతో చక్కగా సహాయ పడుతుంది.

బేకింగ్ సోడా:

కిచెన్, ఇంటి అవసరాలకు బేకింగ్ సోడా ఎంతో చక్కగా సహాయ పడుతుంది. ఇంట్లోని, కిచెన్‌లో మురికిని, మచ్చలను పోగొడుతుంది. అంతే కాకుండా అందాన్ని పెంచుకోవడంలో కూడా బేకింగ్ సోడా హెల్ప్ చేస్తుంది. అలాగే బట్టలపై పడ్డ మొండి మరకలను వదిలించుకోవడంలో కూడా బేకింగ్ సోడా చక్కగా పని చేస్తుంది. ముందుగా బట్టలను తడిపి మొండి మరకలను ఉన్న చోట బేకింగ్ సోడా వేసి రుద్దాలి. ఆ తర్వాత డిటర్జెంట్ వేసి వాటర్‌లో నానబెట్టాలి. ఆ తర్వాత ఉతికితే ఈజీగా మరక పోతుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మకాయ:

నిమ్మకాయ అందానికి, ఆరోగ్యానికి, కిచెన్ హ్యాక్స్‌కి ఎంతో చక్కగా పని చేస్తుంది. అంతే కాకుండా బట్టలపై పడ్డ మొండి మరకలను తొలగించడంలో కూడా నిమ్మకాయ చక్కగా ఉపయోగ పడుతుంది. మొండి మరకలు పడినచోట కొద్దిగా డిటర్జెంట్ వేసి దానిపై నిమ్మ చెక్కతో బాగా రుద్దాలి. కాసేపు పక్కన పెట్టి.. ఉతికితే మొండి మరక పోతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..