Summer Skin care : ఎండాకాలంలో చర్మం మెరిసేందుకు ఇలా చేయండి.. రోజ్‌వాటర్‌తో ఈ పదార్థాన్ని కలిపి వాడితే..

ఇది చర్మం, అకాల వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఫేస్ వాష్ ఉపయోగించినప్పుడు మీరు రోజ్ వాటర్‌లో ఈ పదార్థాన్ని మిక్స్ చేసి మీ ముఖానికి రాసుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు ముల్తానీ మిట్టిని చర్మానికి అప్లై చేసుకోవచ్చు.. కావాలంటే తలకు కూడా వాడండి. ముల్తానీ మిట్టిని తలకు పట్టిస్తే నూనె, మురికి, చుండ్రు అన్నీ తొలగిపోతాయి. జుట్టు వాసనను కూడా వదిలించుకోవచ్చు.

Summer Skin care : ఎండాకాలంలో చర్మం మెరిసేందుకు ఇలా చేయండి.. రోజ్‌వాటర్‌తో ఈ పదార్థాన్ని కలిపి వాడితే..
Multani Mitti
Follow us

|

Updated on: Mar 13, 2024 | 10:35 AM

వేసవి అంటే చెమట, జిడ్డు ముఖంతో ఇబ్బంది పెడుతుంది. చెమట, కాలుష్యం వల్ల ముఖం మరింత జిడ్డుగా మారుతుంది. దాంతో చర్మం డల్‌గా కనిపిస్తుంది. ఈ కారణాల వల్ల చాలా సార్లు మొటిమల సమస్య కూడా పెరుగుతుంది. దీంతో తరచూ ముఖం కుడుతుంటాం.. అయితే, ఫేస్ వాష్ అనేది ముఖం నుండి అదనపు నూనెను పోగొడుతుంది..జిడ్డు ఫీలింగ్ నుండి తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుంది. జిడ్డు చర్మాన్ని వదిలించుకోవడానికి శాశ్వత ఉపశమనం కోసం మీరు ఇంటి నివారణలను పాటిస్తే ఫలితం ఉంటుంది.

మార్కెట్‌లో ఫేస్ వాష్, ఫేస్ ప్యాక్ బదులు ముల్తానీ మిట్టిని ఉపయోగించండి. ముల్తానీ మిట్టి అనేది సహజమైన పదార్ధం. ఇది చర్మంపై అదనపు నూనెను శుభ్రపరుస్తుంది. సెబమ్ స్రావాన్ని కూడా నియంత్రిస్తుంది. మొటిమల సమస్యలను కూడా తగ్గిస్తుంది. ముల్తానీ మిట్టి చర్మంపై గొప్ప ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేస్తుందనడంలో సందేహం లేదు. ఇది ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా మృతకణాలను తొలగిస్తుంది. ముల్తానీ మిట్టిని స్క్రబ్‌గా ఉపయోగించడం వల్ల చర్మంపై ఒత్తిడి ఉండదు.

తీవ్రమైన ఎండ, చెమట, కాలుష్యం చర్మంపై తీవ్ర ఒత్తిడిని కలిగిస్తాయి. ఎండలోకి వెళ్లాక చాలా సార్లు చర్మం కాలిపోయినట్టుగా అవుతుంది. ఈ సమస్యల నుంచి విముక్తి పొందాలంటే ముల్తానీ మిట్టిని రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి రాసుకోవాలి. 10-15 నిముషాల పాటు అలాగే ఉంచి కడిగేస్తే చర్మం తాజాదనాన్ని పొందుతుంది. ముల్తానీ మిట్టి అదనపు నూనెను, చర్మంలోని మురికిని శుభ్రపరచడమే కాకుండా బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్యను కూడా తొలగిస్తుంది. ముల్తానీ మిట్టి మొటిమల సమస్యలను కూడా తొలగిస్తుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మం మంటను తగ్గిస్తాయి.

ఇవి కూడా చదవండి

ముల్తానీ మిటీని రోజూ ఉపయోగించడం వల్ల చర్మం ఛాయ మెరుగుపడుతుంది. ఇది అదనపు నూనెను పీల్చుకోవడం ద్వారా ఓపెన్ రంధ్రాల సమస్యను తొలగిస్తుంది. ఇది చర్మం, అకాల వృద్ధాప్యాన్ని దూరం చేస్తుంది. ఫేస్ వాష్ ఉపయోగించినప్పుడు మీరు రోజ్ వాటర్‌లో ముల్తానీ మట్టిని మిక్స్ చేసి మీ ముఖానికి రాసుకోవచ్చు. స్నానం చేసేటప్పుడు ముల్తానీ మిట్టిని చర్మానికి అప్లై చేసుకోవచ్చు.. కావాలంటే తలకు కూడా వాడండి. ముల్తానీ మిట్టిని తలకు పట్టిస్తే నూనె, మురికి, చుండ్రు అన్నీ తొలగిపోతాయి. జుట్టు వాసనను కూడా వదిలించుకోవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి