World Kidney Day: ఈ 7 పండ్లను తీసుకుంటే.. కిడ్నీ సమస్యలు మీ దరికి రావాలన్నా రాలేవు..

మూత్రపిండాల ప్రాధాన్యతను, సంరక్షణను తెలియజేసే ఉద్దేశ్యంతోనే యావత్ ప్రపంచం ప్రతి ఏటా వరల్డ్ కిడ్నీ డేను మార్చి 9న జరుపుకుటుంది. అయితే మన మూత్రపిండాల

World Kidney Day: ఈ 7 పండ్లను తీసుకుంటే.. కిడ్నీ సమస్యలు మీ దరికి రావాలన్నా రాలేవు..
World Kidney Day
Follow us

|

Updated on: Mar 09, 2023 | 2:47 PM

మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో కూడా పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండకపోతే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడవలసి ఉంటుంది. అలా వచ్చే సమస్యలలో ముందుగా ప్రభావితమయ్యేవి మన మూత్రపిండాలే. మానవ శరీరంలో అతి ముఖ్యమైనవి మూత్రపిండాలు. శరీరంలోని వ్యర్థాలను, విష పదార్థాలను తొలగించేందుకు పనిచేసే మూత్రపిండాల పనితీరు మీదనే మన శరీర ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఈ అవయవాల ప్రాధాన్యతను, వీటి సంరక్షణను తెలియజేసే ఉద్దేశ్యంతోనే యావత్ ప్రపంచం ప్రతి ఏటా వరల్డ్ కిడ్నీ డేను మార్చి 9న జరుపుకుటుంది. అయితే మన మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతినడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి అనేక జీవనశైలి మార్పు వలన కలిగే వ్యాధులే మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తాయి.

ఈ క్రమంలో మూత్రపిండాల వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించడానికి ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యం బాగుండాలంటే మీ ఆహారంలో ఉప్పును చాలా వరకు తగ్గిస్తూనే నీటిని పుష్కలంగా తాగాలి. ఇవన్నీ చేస్తేనే మీ మూత్రపిండాల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మూత్రపిండాల ఆరోగ్యం కోసం కూల్ డ్రింక్స్ వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే తీపి పదార్థాలను ఎక్కువగా తినకుండా.. శాఖాహారాలనే ఎక్కువగా తినాలి. అలాగే కొన్ని రకాల పండ్లను తినడం వల్ల అవి మన కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని రోజూ తినాలని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ పండ్లు ఏమిటనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

దానిమ్మ: దానమ్మ పండ్లలో చక్కెర స్థాయి స్వల్పంగా ఉంటుంది. ఆ కారణంగా ఇవి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. కాబట్టి మూత్రపిండాల సంరక్షణ కోసం అలాగే.. షుగర్ పేషెంట్లు ఏమాత్రం భయపడకుండా ఈ పండ్లను తినొచ్చు.

ఇవి కూడా చదవండి

అంజీర్: ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న అంజీరా పండ్లు ఇన్సులిన్ ఫంక్షన్‌ని కంట్రోల్ చేస్తాయి. కొంచెం వగరు, కొంచెం తీపి, కాస్త వులువు ఉండే అంజీర్‌ పండు మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. అంజీర్‌లో విటమిన్-ఎ, బి1, బి2, కాల్షియం, ఐరన్, పాస్పరస్, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, క్లోరిన్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి మూత్రపిండాల సంరక్షణ కోసం అలాగే.. షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ పండ్లని తీసుకోవచ్చు.

స్ట్రాబెర్రీలు: స్ట్రాబెర్రీలు , బ్లూబెర్రీస్ వంటి బెర్రీలలు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెర్రీల్లో మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచే విటమిన్ సి, ఫైబర్  కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ బెర్రీలు కిడ్నీ స్టోన్స్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

ఆపిల్: ఆపిల్ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండును రోజూ ఒకటి తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ముఖ్యంగా మూత్రపిండాల ఆరోగ్యం బాగుంటుంది కూడా. విటమిన్ బి, కాల్షియం పుష్కలంగా ఉండే యాపిల్స్ గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

అనాస పండు: మీ రోజువారీ ఆహారంలో పైనాపిల్ ను చేర్చుకోవడం వల్ల మీ మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే పైనాపిల్ మూత్రపిండాల అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

ద్రాక్ష: యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ద్రాక్ష మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. అంతేకాదు గుండె జబ్బులను నివారించడానికి కూడా ఈ పండు సహాయపడుతుంది.

నారింజ: నారింజతో సహా సిట్రిస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ సి మన రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు.. మన మూత్రపిండాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
ఓట్ల పండుగ ఎలా జరుగుతుంది..? భారత్ చేరుకున్న విదేశీ నేతలు..
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
చంద్రబాబు వ్యాఖ్యలపై బీజేపీ ఎందుకు స్పందించదు? - పోసాని
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ఓపెనర్లుగా అరవీర భయంకరులు.. మిడిలార్డర్‌లో పించ్ హిట్టర్లు.!
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
ప్రపంచంలో లక్కి పర్సన్.. 30 ఏళ్ళ పాటు నెలా కోటి రూపాయల బహుమతి
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
వామ్మో..పెళ్లి పందిట్లోనే ప్రతాపం చూపించిన వరుడు..! షాక్ లో వధువు
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
మూడు జిల్లాల్లో సీఎం జగన్‌ ఎన్నికల ప్రచారం
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
నాకు ఇష్టమైన నటుడు.. ఎన్టీఆర్ ఫోటోస్ వైరల్..
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్
రెండేళ్లలో నల్లపు నుంచి తెల్లగా మారిన శునకం.. కారణం తెలిస్తే షాక్
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. వచ్చే 4 రోజులు మాడు పగిలే ఎండలు
తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్.. వచ్చే 4 రోజులు మాడు పగిలే ఎండలు
కేసీఆర్‌ చెప్తున్న థర్డ్‌ఫ్రంట్‌ లాజిక్‌ ఏంటి..?
కేసీఆర్‌ చెప్తున్న థర్డ్‌ఫ్రంట్‌ లాజిక్‌ ఏంటి..?