AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chicken: ప్రపంచంలో చికెన్ ఎక్కువగా తినే దేశం ఏది..? ఆ పేరు తెలిస్తే మీరు షాక్ అవ్వడం పక్కా..

చికెన్ బిర్యానీ, ఫ్రైడ్ చికెన్, చికెన్ టిక్కా.. పేరు వింటేనే నోరూరని వారుండరు. ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడయ్యే మాంసం ఇదే. అయితే ప్రపంచంలోనే ఎక్కువ చికెన్ తినే దేశం ఏది? అని ఎవరైనా అడిగితే.. మనం వెంటనే పాకిస్తాన్ లేదా అరబ్ దేశాల పేర్లు చెబుతాం. కానీ అసలు నిజం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. చికెన్ ప్రియులు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నారో తెలుసా?

Chicken: ప్రపంచంలో చికెన్ ఎక్కువగా తినే దేశం ఏది..? ఆ పేరు తెలిస్తే మీరు షాక్ అవ్వడం పక్కా..
Which Country Eats The Most Chicken
Krishna S
|

Updated on: Jan 08, 2026 | 6:55 PM

Share

ప్రపంచంలో అత్యధికంగా ఇష్టపడే నాన్‌వెజ్ ఏదంటే అది నిస్సందేహంగా చికెన్. సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరి డైనింగ్ టేబుల్‌పై చికెన్ వంటకాలు కనిపిస్తాయి. అయితే అత్యధికంగా చికెన్ తినే దేశం అనగానే చాలామంది ముస్లిం జనాభా అధికంగా ఉండే పాకిస్తాన్ లేదా సౌదీ అరేబియా అని అంచనా వేస్తారు. కానీ తాజా అంతర్జాతీయ గణాంకాలు ఈ అంచనాలను తలకిందులు చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం చికెన్ వినియోగంలో చైనా అగ్రస్థానంలో నిలిచింది. చైనాలో పెరిగిన జనాభా, మారుతున్న ఆహారపు అలవాట్ల కారణంగా అక్కడ చికెన్‌కు విపరీతమైన డిమాండ్ ఉంది. సగటున చైనాలో ఒక వ్యక్తి ఏడాదికి 17 నుండి 18 కిలోల చికెన్ తింటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం దేశం వారీగా చూస్తే చైనా నంబర్ వన్ స్థానంలో ఉంది.

తలసరి వినియోగంలో అమెరికా టాప్

మొత్తం వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉన్నప్పటికీ.. ఒక వ్యక్తి సగటున తినే పరిమాణం విషయానికి వస్తే అమెరికా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. ఒక సగటు అమెరికన్ ఏడాదికి 50 కిలోల కంటే ఎక్కువ చికెన్ తింటున్నాడు. చైనా వ్యక్తి వినియోగంతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు ఎక్కువ. అమెరికన్ల ప్రధాన మాంసం ఆహారంగా చికెన్ మారిపోవడమే దీనికి కారణం.

మనం అనుకునే దేశాలు ఎక్కడ ఉన్నాయి?

చికెన్ వినియోగంలో పాకిస్తాన్, సౌదీ అరేబియా ముందంజలో ఉంటాయని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవాలు భిన్నంగా ఉన్నాయి. పాకిస్తాన్ సగటు తలసరి వినియోగం ఏడాదికి కేవలం 9 కిలోలు మాత్రమే. ఇది చైనా, అమెరికా కంటే చాలా తక్కువ. సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానాల్లో లేవు.

ఇవి కూడా చదవండి

పెరిగిన ధరలు.. పౌల్ట్రీ రంగంపై ఒత్తిడి

డిమాండ్ పెరగడంతో పౌల్ట్రీ పరిశ్రమపై భారం పడుతోంది. గత కొన్ని ఏళ్లుగా చికెన్ ధరలు ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్నంటుతున్నాయి. ధరలు పెరగడానికి పలు కారణాలు ఉన్నాయి. కోళ్ల మేత ఖర్చులు పెరగడం, రవాణా అంతరాయాలు, పెరిగిన ఉత్పత్తి వ్యయాలతో ధరలు పెరుగుతున్నాయి. చికెన్‌తో పాటు గుడ్ల ధరలు కూడా పెరగడం సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతోంది. సరసమైన ధర, త్వరగా వండుకునే సౌలభ్యం వల్ల చికెన్ ప్రపంచవ్యాప్త ప్రోటీన్ వనరుగా మారింది. బిర్యానీ నుండి గ్రిల్డ్ చికెన్ వరకు ఎన్నో రకాలుగా దీనిని ఆరగిస్తున్నారు. అయితే ఆహారపు అలవాట్లు మతం లేదా ప్రాంతంపై మాత్రమే కాకుండా ఆర్థిక స్థితిగతులు, జనాభాపై కూడా ఆధారపడి ఉంటాయని ఈ డేటా నిరూపిస్తోంది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టాక్సిక్ సినిమాకు ఆ హీరోయి‏న్‏కే ఎక్కువ రెమ్యునరేషన్.. ?
టాక్సిక్ సినిమాకు ఆ హీరోయి‏న్‏కే ఎక్కువ రెమ్యునరేషన్.. ?
ఇది బంగారు భూమి..! కడుపు నిండా పసిడి నిక్షేపాలే.. గుట్టలుగా
ఇది బంగారు భూమి..! కడుపు నిండా పసిడి నిక్షేపాలే.. గుట్టలుగా
సరిహద్దు ప్రతీకారం.. మైదానంలో తీర్చుకుంటాం..: పాక్ బౌలర్
సరిహద్దు ప్రతీకారం.. మైదానంలో తీర్చుకుంటాం..: పాక్ బౌలర్
జేఎఫ్‌-17 యుద్ధ విమానాలపై.. దోస్త్‌ మేరా దోస్త్‌
జేఎఫ్‌-17 యుద్ధ విమానాలపై.. దోస్త్‌ మేరా దోస్త్‌
పొరపాటున కూడా ఈ 3 విషయాల కోసం వ్యక్తిగత రుణం తీసుకోకండి..
పొరపాటున కూడా ఈ 3 విషయాల కోసం వ్యక్తిగత రుణం తీసుకోకండి..
ఇంట్లో నుంచే డబ్బులు సంపాదించడం ఎలా.? ఇలా చేస్తే లచ్చిందేవి..
ఇంట్లో నుంచే డబ్బులు సంపాదించడం ఎలా.? ఇలా చేస్తే లచ్చిందేవి..
ఈ చిత్రంలో దాగిఉన్న నాలుగో వ్యక్తిని కనిపెట్టండి చూద్దాం
ఈ చిత్రంలో దాగిఉన్న నాలుగో వ్యక్తిని కనిపెట్టండి చూద్దాం
ఓ మిడిల్‌ క్లాస్ వ్యక్తి రూ. 10 కోట్లు సంపాదించడం సాధ్యమే.!
ఓ మిడిల్‌ క్లాస్ వ్యక్తి రూ. 10 కోట్లు సంపాదించడం సాధ్యమే.!
పెద్ద మొత్తంలో బంగారం.. స్విట్జర్లాండ్‌కు తరలించిన మదురో
పెద్ద మొత్తంలో బంగారం.. స్విట్జర్లాండ్‌కు తరలించిన మదురో
కాయ ధాన్యాలు తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్‌ ఎందుకు వస్తుందో తెలుసా?
కాయ ధాన్యాలు తింటే కడుపు ఉబ్బరం, గ్యాస్‌ ఎందుకు వస్తుందో తెలుసా?