AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Idli: తెల్లటి మల్లెపువ్వులాంటి ఇడ్లీపై ప్రయోగం.. బ్లాక్ ఇడ్లి తయారీ.. అది ఇడ్లి కాదు డెడ్లి అంటున్న నెటిజన్లు..

Black Idli: భారతీయులు మెచ్చిన అల్పాహారంలో ఇడ్లిది ప్రత్యేక స్థానం. అయితే మనం ఇంతవరకూ తెల్లని మల్లెపూవులాంటి ఇడ్లీలను తిన్నాం కదా.. ఇప్పుడు మీకు నల్లని..

Black Idli: తెల్లటి మల్లెపువ్వులాంటి ఇడ్లీపై ప్రయోగం.. బ్లాక్ ఇడ్లి తయారీ.. అది ఇడ్లి కాదు డెడ్లి అంటున్న నెటిజన్లు..
Black Idli
Surya Kala
|

Updated on: Dec 15, 2021 | 8:59 AM

Share

Black Idli: భారతీయులు మెచ్చిన అల్పాహారంలో ఇడ్లిది ప్రత్యేక స్థానం. అయితే మనం ఇంతవరకూ తెల్లని మల్లెపూవులాంటి ఇడ్లీలను తిన్నాం కదా.. ఇప్పుడు మీకు నల్లని ఇడ్లీలను పరిచయం చేయబోతున్నాం. మహారాష్ట్రలోని ఓ రెస్టారెంట్‌లో వివేక్, ఆయేషా… అనే వ్యక్తి ఈ నల్ల ఇడ్లీలు తయారు చేస్తున్నారు. అయితే ఈ నల్లటి ఇడ్లిలను చూసి ఇప్పటి వరకూ మనం ఇడ్లీలు తెల్లగా… మల్లెపువ్వులా ఉండటం చూశాం. వాటినే ఇష్టంగా తిన్నాం. ఇవేమో నల్లగా ఉన్నాయి. పోనీ అవైనా పద్ధతిగా ఉన్నాయా అంటే… వాటిపై మరిన్ని ప్రయోగాలు చేశారు. దీంతో మాకు ఈ బ్లాక్‌ ఇడ్లీలు వద్దు బాబోయ్‌ అంటున్నారు నెటిజన్లు.

నల్ల ఇడ్లీల పిండితో ఇడ్లీలు చేసి… వాటిపై నెయ్యిని ధారలా పోశారు. తర్వాత కారం చల్లారు. తర్వాత నీళ్ల లాంటి కొబ్బరి చెట్నీ పోశారు. ఒక ప్లేటుకి 2 ఇడ్లీలు ఇస్తున్నారు. ప్లేటు ధర ఎంతో కాదు.. 90 రూపాయలు మాత్రమే. అసలే నల్ల ఇడ్లీలు. మళ్లీ వాటికి అదిరిపోయే ధర. ఎవరు తింటారు అనిపిస్తోంది కదా.. వీటిని డిటాక్స్ ఇడ్లీ అంటారట. అంటే… ఇవి తింటే… పొట్టలో ఉన్న చెడు వ్యర్థాలన్నీ బయటకు పోతాయని అర్థం. ఈ మధ్య డిటాక్సిఫికేషన్ ఫుడ్ పేరుతో రకరకాల ఆహారాలు తెరపైకి వస్తున్నాయి. వాటిలో ఈ ఇడ్లీలను చేర్చారు. అయితే వీటిని గర్భిణీలు తినకూడదట. ఇన్‌స్టాగ్రామ్‌లోని eatographers అకౌంట్‌లో ఈ వీడియోని పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ ఇడ్లీలను లక్షలమంది వీక్షించారు. తెల్లటి మల్లెపువ్వులాంటి ఇడ్లీలను తిన్న తాము వీటిని తినలేమని అంటున్నారు. అంత ఎందుకు కనీసం ఈ ఇడ్లీని చూడలేమంటూ మండిపడుతున్నారు. ఇప్పటికే ప్రయోగాల పేరుతో సంప్రదాయ ఆహారాల రెసిపీలను కూనీ చేస్తున్నారంటూ మండి పడుతున్నారు. ఇప్పుడు ఇడ్లీలను కూడా టార్గెట్ చేశారా అంటూ సెటైర్లు వేస్తున్నారు. “కొన్నాళ్లకి రెయిన్‌బో ఇడ్లీలు చేస్తారా” వద్దు బాబు వద్దు ” ఆ ఇడ్లీలేం చేశాయ్ బ్రో.. వాటిని అలా వేధిస్తున్నావ్ ’’అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read:  ఈ రాశుల వారికి 2022 సంవత్సరంలో వివాహం జరిగే అవకాశం.. అందులో మీ రాశి కూడా ఉందా..

మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?
టీనేజ్ ఫొటోస్ షేర్ చేసిన బిగ్‌బాస్ తెలుగు బ్యూటీ..గుర్తు పట్టారా?