Chicken Dosa Recipe: మీరు నాన్-వెజ్ ప్రియులా.. చికెన్ దోసని ట్రై చేయండి.. రెసిపీ మీ కోసం..
రోజూ ఉదయం అల్పాహారంగా మాత్రమే కాదు.. ఎప్పుడైనా భోజనానికి బదులుగా టిఫిన్ తినలనిపిస్తే దోసను తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ఈ దోసలలో ప్లెయిన్ దోస మాత్రమే కాదు.. ఉల్లి దోస, మసాలా దోస, బటర్ దోస వంటి అనేక రకరకాలున్నాయి. అయితే నాన్ వెజ్ ప్రియులు దోసెకు బదులుగా చికెన్ దోసెను ప్రయత్నించండి. అవును ఈ రోజు చికెన్ దోస తయారీ విధానం గురించి తెలుసుకుందాం.. రెసిపీ మీ కోసం..

రోజూ ఉదయం అల్పాహారంగా మాత్రమే కాదు.. ఎప్పుడైనా భోజనానికి బదులుగా టిఫిన్ తినలనిపిస్తే దోసను తినడానికి ఎక్కువ మంది ఇష్టపడతారు. ఈ దోసలలో ప్లెయిన్ దోస మాత్రమే కాదు.. ఉల్లి దోస, మసాలా దోస, బటర్ దోస వంటి అనేక రకరకాలున్నాయి. అయితే నాన్ వెజ్ ప్రియులు దోసెకు బదులుగా చికెన్ దోసెను ప్రయత్నించండి. అవును ఈ రోజు చికెన్ దోస తయారీ విధానం గురించి తెలుసుకుందాం.. రెసిపీ మీ కోసం..
ఎవరైనా దోసె తినడం ఇష్టపడితే.. అది కూడా స్టఫ్డ్ దోసెలంటే ఇష్టమైన వారు మసాలా దోసెకు బదులుగా చికెన్ దోసెను ప్రయత్నించండి. అవును చికెన్ కర్రీ, చికెన్ టిక్కా లేదా చికెన్ బిర్యానీని చాలాసార్లు తిని ఉంటారు. అయితే ఈ రుచికరమైన ప్రోటీన్ అధికంగా ఉండే దోసెను ప్రయత్నించండి. ఉల్లిపాయలు, టమోటాలు. మసాలాతో తయారు చేసిన చికెన్ కూర స్టఫ్డ్ దోసని తయారు చేస్తారు. ఈ చికెన్ దోసె రెసిపీ అల్పాహారం, భోజనం, రాత్రి సమయంలో కూడా భోజనానికి కూడా సరైన ఎంపిక. చికెన్ దోస మంచి అల్పాహారం. దీనిని దోస పిండి, చికెన్ కూరను కలిపి తయారు చేస్తారు. చికెన్ దోసను చాలా సులభంగా ఇంటిలో తయారు చేసుకోవచ్చు. ఈ చికెన్ దోసెను కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ లేదా సాంబార్‌తో దీన్ని సర్వ్ చేయండి. దీనిని ఒక్కసారి తిన్నవారు పదే పదే కావాలని కోరుకుంటారు. ఈ రోజు చికెన్ దోసె రెసిపీ గురించి తెలుసుకుందాం..
తయారీకి కావాల్సిన పదార్ధాలు:
- చికెన్ ముక్కలు – 400 గ్రాములు
- ఉల్లిపాయలు – 2 మీడియం సైజు
- టమాటా ప్యూరీ – 1/2 కప్పు
- కారం – 1 స్పూన్
- మిరియాలు – 1/2 టీస్పూన్
- జీలకర్ర – 1 స్పూన్
- అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు
- గరం మసాలా పొడి – 1/2 టీస్పూన్
- నూనె – 2 టేబుల్ స్పూన్లు
- దోసె పిండి – అవసరమైనంత
- కరివేపాకు – 2 రెమ్మలు
- పసుపు – 1/2 స్పూన్
- ఉప్పు – రుచి ప్రకారం
- నెయ్యి- కావలసినంత
- కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్లు
- నీరు – 3/4 కప్పు
తయారీ విధానం:
- చికెన్ దోస తయారు చేయడానికి ముందుగా స్టవ్ మీద ప్రెజర్ కుక్కర్ పెట్టి అందులో తగినంత నూనె వేసి వేడి చేయండి.
- తరువాత జీలకర్ర, కరివేపాకు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు వేయించండి.
- ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసి సుమారు రెండు నిమిషాలు వేయించండి.
- ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత.. టమోటా ప్యూరీ, కారం, పసుపు, నల్ల మిరియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేయాలి.
- ఈ ఉల్లిపాయ మసాలా మిశ్రమం మసాలాను కనీసం 3-4 నిమిషాలు ఉడికించండి.
- తర్వాత ఉల్లిపాయ మసాలా మిశ్రమంలో శుభ్రం చేసుకున్న చికెన్ వేసి బాగా కలపండి.
- దీని తరువాత సుమారు 3/4 కప్పు నీరు వేసి చికెన్ ను బాగా కలపండి.
- తరువాత కుక్కర్ మీద మూత పెట్టి. చికెన్ లోని నీరు తగ్గి.. చికెన్ ను దాదాపు 8-10 నిమిషాలు ఉడికించండి.
- చికెన్ ఉడికిన తర్వాత చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి బాగా కలపండి. దోస కు స్టఫ్డ్ చికెన్ మసాలా రెడీ.
- ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ మీద దోస పిండిని వేసి రెండు వైపులా బాగా వేయించండి.
- దీని తరువాత దోసపై చికెన్ మసాలాను 2-3 టేబుల్ స్పూన్లు వేసి దోసను స్టఫింగ్ తో నింపండి.
- దోస మీద నెయ్యి వేసి పై మూతపెట్టి 4-5 నిమిషాలు ఉడికించాలి. క్రిస్పీగా కాల్చుకోవాలి.
అంతే రుచికరమైన చికెన్ దోస సిద్ధం అయినట్లే. దీనిని కొబ్బరి చట్నీ, టమోటా చట్నీ లేదా ఇష్టమైన చట్నీ, సాంబార్ తో వేడి వేడిగా వడ్డించండి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా నాన్ వెజ్ ప్రియులు ఇష్టంగా తింటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..