AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banana: అతిగా అరటిపండ్లు తింటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు

అరటిపండ్లు ఆరోగ్యకరమే అయినప్పటికీ అతిగా తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు, మలబద్ధకంతో బాధపడేవారు అరటిపండును మితంగా తీసుకోవడం చాలా ముఖ్యం.

Banana: అతిగా అరటిపండ్లు తింటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవు
Banana
Ram Naramaneni
|

Updated on: Dec 05, 2024 | 11:56 AM

Share

మీరు ఏ ఆహారం తీసుకున్నా మితంగా తినడం మంచిది. అదే విధంగా శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అరటిపండును కొంత మొత్తంలో తీసుకోవడం బెటర్. అలా కాకుండా కొందరు అరటిపండ్లను అదే పనిగా తింటూ ఉంటారు. అలా తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసుకుందాం పదండి..

అరటిపండు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన పండు అయినప్పటికీ, రోజుకు 2 నుండి 3 అరటిపండ్లకు మించి తినడం మంచిది కాదు. అరటిపండ్లలో విటమిన్ బి6, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరానికి కావలసిన శక్తిని త్వరగా అందిస్తుంది. అరటిపండులోని పీచు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. దీన్ని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఫైబర్ కంటెంట్ పెరుగుతుంది. దాంతో బరువు తగ్గడానికి బదులుగా పెరుగుతారు. అరటిపండులోని చక్కెర పొట్ట కొవ్వును కూడా పెంచుతుంది.

అరటిపండ్లలో అవసరమైన మొత్తంలో స్టార్చ్ ఉంటుంది. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది. అలాగే, అరటిపండ్లలో అధికంగా ఉండే టానిక్ యాసిడ్ జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, మలబద్ధకం సమస్య ఉన్నవారు రోజుకు 2 అరటిపండ్లకు మించి తినకూడదు.

అరటిపండులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ ఎక్కువ అరటిపండ్లు తిన్నప్పటికీ ఈ చక్కెర కంటెంట్ రక్తంలో చక్కెరను పెంచుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతిరోజూ అరటిపండు తినడం మంచిది కాదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
ఇండియాలోనే మోస్ట్ సెర్చ్డ్ యాక్టర్స్.. టాప్ 10లో మన హీరోల హవా!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Tollywood: నెపోటిజంపై టాలీవుడ్ యంగ్ హీరో సంచలన కామెంట్స్..!
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
Horoscope Today: వారి ఆదాయ వృద్ధి ప్రయత్నాలు సఫలం..
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
రైల్వే టికెట్ అప్‌గ్రేడ్ గురించి మీకు తెలుసా? స్లీపర్ నుండి AC
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
మందులతో పనే ఉండదు.. మీ వంటింట్లో ఉండే ఈ పదార్థాలతో షుగర్‌కు చెక్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
క్రేజీ ఫొటోస్‌తో కవ్విస్తున్న పాయల్ రాజ్ పుత్
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?
మగవాళ్లు చలికాలంలో కాల్చిన ఖర్జూరాలు తింటే ఏమవుతుందో తెలుసా..?