Republic Day: పనీర్ టిక్కా నుండి ముఫ్ఫిన్స్ వరకు.. రిపబ్లిక్ డే రోజున పిల్లలు మెచ్చే వెరైటీలు ఇవే!
భారత గణతంత్ర దినోత్సవం అంటే కేవలం పరేడ్లు, జెండా వందనాలే కాదు, మన దేశం పట్ల మనకున్న ప్రేమను చాటుకునే ఒక గొప్ప సందర్భం. ఈ వేడుకను మరింత ఉత్సాహంగా జరుపుకోవడానికి మీ డైనింగ్ టేబుల్‌పై త్రివర్ణ శోభను తీసుకురావాలని అనుకుంటున్నారా? జెండాలోని మూడు రంగుల స్ఫూర్తితో తయారయ్యే ఈ వంటకాలు కేవలం చూడటానికే కాదు, తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటాయి. ఎటువంటి కృత్రిమ రంగులు వాడకుండా, ప్రకృతి సిద్ధమైన పదార్థాలతో చేసే ఈ 7 రెసిపీలు పండుగ వాతావరణాన్ని మీ ఇంట్లోకి తెస్తాయి.

కుటుంబ సభ్యులతో కలిసి సెలవు రోజున గడిపేటప్పుడు స్పెషల్ వంటకాలు ఉండాల్సిందే. ముఖ్యంగా పిల్లలు రంగు రంగుల వంటకాలను చూసి ఎంతో ఆనందిస్తారు. రిపబ్లిక్ డే 2026 సందర్భంగా ఆరోగ్యకరమైన కూరగాయలతో చేసే ఈ త్రివర్ణ వంటకాలు రోజంతా మీకు కావాల్సిన శక్తిని ఇస్తాయి. ఉదయం అల్పాహారం నుండి రాత్రి డిన్నర్ వరకు ప్రతి పూటకూ సరిపోయే వెరైటీలు ఈ జాబితాలో ఉన్నాయి. మరి ఆ ఆసక్తికరమైన సులభమైన రెసిపీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. తిరంగా పనీర్ టిక్కా
మెత్తని పనీర్ ముక్కలను మూడు రకాల మసాలాలతో మ్యారినేట్ చేసి తయారు చేసే ఈ స్టార్టర్ ప్రతి పార్టీలోనూ హైలైట్‌గా నిలుస్తుంది. ఆరెంజ్ రంగు కోసం కాశ్మీరీ మిర్చి, తెలుపు రంగు కోసం పెరుగు/క్రీమ్ మరియు ఆకుపచ్చ రంగు కోసం పుదీనా-కొత్తిమీర పేస్ట్‌ను ఉపయోగించవచ్చు. గ్రిల్ చేసిన తర్వాత దీని స్మోకీ ఫ్లేవర్ అద్భుతంగా ఉంటుంది.
2. త్రివర్ణ ఇడ్లీ
పిల్లలకు ఎంతో ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ఇది. ఇడ్లీ పిండికి క్యారెట్ ప్యూరీ కలిపితే కేసరి రంగు, పాలకూర పేస్ట్ కలిపితే ఆకుపచ్చ రంగు వస్తాయి. సాధారణ తెల్లని ఇడ్లీ పిండితో కలిపి వీటిని స్టీమ్ చేస్తే ఎంతో ఆకర్షణీయమైన త్రివర్ణ ఇడ్లీలు సిద్ధమవుతాయి. వీటిని సాంబార్ లేదా కొబ్బరి చట్నీతో వడ్డించవచ్చు.
3. తిరంగా హల్వా
పండుగ అంటే స్వీట్ ఉండాల్సిందే! క్యారెట్ హల్వా (ఆరెంజ్), సూజీ హల్వా (వైట్), మూంగ్ దాల్ లేదా పాలకూరతో చేసిన హల్వా (గ్రీన్) – ఈ మూడింటిని లేయర్లుగా అమర్చి తిరంగా హల్వాను తయారు చేయవచ్చు. ఇది చూడటానికి చాలా గ్రాండ్‌గా ఉంటుంది.
4. త్రివర్ణ పాస్తా
పాస్తాను ఇష్టపడే పిల్లల కోసం మూడు రకాల సాస్‌లతో దీనిని సిద్ధం చేయవచ్చు. టమోటా సాస్ (రెడ్/ఆరెంజ్), వైట్ సాస్ (చీజ్/క్రీమ్) మరియు పెస్టో సాస్ (గ్రీన్) తో కలిపి సర్వ్ చేస్తే రుచికి రుచి, రంగుకు రంగు లభిస్తాయి.
5. త్రివర్ణ పిజ్జా
పిజ్జా పైన టాపింగ్స్‌ను త్రివర్ణ శైలిలో అమర్చవచ్చు. పైన క్యారెట్ లేదా ఎర్రటి క్యాప్సికమ్, మధ్యలో చీజ్, కింద ఆకుపచ్చ క్యాప్సికమ్ లేదా బ్రోకలీతో జెండా రంగులను తీసుకురావచ్చు. అలాగే కలర్‌ఫుల్ సలాడ్‌లు, ముఫ్ఫిన్స్‌ను కూడా నేచురల్ పదార్థాలతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు.
