పొట్ట సమస్యలకు పరమ ఔషధం.. గ్యాస్, అసిడిటీని తరిమేసే పవర్ఫుల్ ఫుడ్
నేటి తరం అనారోగ్యకరమైన జీవనశైలి, సరైన ఆహారం లేకపోవడం వల్ల పెద్ద ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటోంది. వీటిలో యువత కూడా ఉంటున్నారు. వీరు ఎదుర్కొనే అత్యంత సాధారణ వ్యాధులు కడుపుకు సంబంధించినవే ఉంటున్నాయి. కడుపు నొప్పి, మలబద్ధకం, అసిడిటీ, పేగు ఇన్ఫెక్షన్లు, గ్యాస్, అజీర్తి వంటివి ముఖ్యంగా వేదిస్తున్నాయి. అయితే, ఈ సమస్యలతో రోజూ ఇబ్బందిపడే బదులు ఇప్పుడే మీ పొట్ట సమస్యలకు చెక్ పెట్టేయండి. టేస్టీ ఫుడ్ తింటూనే మీరు దీని నుంచి బయటపడొచ్చు. అదెలాగో చూడండి.

మీరు చాలా కాలంగా గ్యాస్ లేదా అసిడిటీ సమస్యలతో బాధపడుతున్నారా? కానీ దీని వెనుక ఉన్న కారణం ఏమిటో మీకు తెలుసా? ఈ పేగు సమస్యలకు కారణం శరీరంలో ప్రీబయోటిక్స్ మరియు ప్రోబయోటిక్స్ లేకపోవడమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, కడుపులో ఎక్కువ గ్యాస్ ఏర్పడుతుంది, దీనివల్ల అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనే వారికి ఇక్కడ ఒక సులభమైన మార్గం ఉంది. ఇది చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి డైటీషియన్ మరియు పోషకాహార నిపుణులు ప్రొబయోటిక్ సలాడ్ ను సూచిస్తున్నారు.
ప్రీబయోటిక్ సలాడ్ ఎలా తయారు చేయాలి..
కావలసిన పదార్థాలు..
ప్రీబయోటిక్స్‌తో నిండిన ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన సలాడ్‌ను తయారు చేయడానికి మీరు మార్కెట్లో లభించే ఏవైనా సీజనల్ కూరగాయలను ఉపయోగించవచ్చు. దీనికి క్యారెట్లు, దుంపలు, దోసకాయలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఆలివ్స్, వేయించిన నువ్వులు, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, కొన్ని పచ్చి మిరపకాయలు, పెరుగు జోడించవచ్చు.
తయారీ విధానం..
ప్రొబయోటిక్ సలాడ్ సిద్ధం చేయడానికి, మీ వంటగదిలో అందుబాటులో ఉన్న కావలసిన కూరగాయలను పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోండి. మీ దగ్గర క్యారెట్లు, బీట్‌రూట్లు, దోసకాయలు, పచ్చి మిరపకాయలు ఉంటే, వాటిని ఒక గిన్నెలోకి మార్చండి. ఈ కూరగాయల పైన కొద్దిగా వెనిగర్, తగినంత పింక్ సాల్ట్ వేయండి. వెనిగర్ మోతాదు మించకుండా ఒక స్పూన్ వరకే తీసుకోవాలి. అందులో పెరుగును కూడా కలుపుకోవచ్చు. వీటన్నింటిని మిక్స్ చేసి అందులో కాస్త మిరియాల పొడి చల్లుకుని కనీసం ఒక గంట పాటు దీనిని అలానే ఉంచాలి. కడుపు సమస్యల నుండి మిమ్మల్ని రక్షించే విటమిన్లు మరియు ఖనిజాలతో నిండిన ఈ సలాడ్, ఒక గంట తర్వాత తినవచ్చు. మీరు దీన్ని ఆహారంతో పాటు లేదా నేరుగా తినవచ్చు. ఇది కడుపు సమస్యల నుండి మీకు ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు, ఇది శరీరానికి అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
కడుపు సమస్యలను ఎలా నివారించాలి?
కడుపు సమస్యలను నివారించడానికి, ముందుగా ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోండి. ఈ సమస్యలను అనేక విధాలుగా పరిష్కరించవచ్చు, కారం ఎక్కువగా ఉండే ఆహారాలు తినకపోవడం, ఆహారంలో ఫైబర్ మొత్తాన్ని పెంచడం, భోజనం మానేయకపోవడం, తగినంత నీరు త్రాగడం మరియు ఒత్తిడిని తగ్గించడం వంటివి. పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, మీ జీవనశైలిపై శ్రద్ధ వహించండి. మంచి ఆరోగ్యం బాగుండాలంటే ముందు మీ పొట్ట బాగుండాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు రోజువారీ వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల ఈ సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు.
