Paralysis Care: బీ అలర్ట్.. ఈ లక్షణాలు ఉంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది!

| Edited By: Ram Naramaneni

Nov 17, 2023 | 9:57 PM

మనిషిని అంత్యంత కుంగుబాటుకు గురి చేసే అనారోగ్య సమస్యల్లో పక్ష వాతం కూడా ఒకటి. దీన్ని స్ట్రోక్ అని కూడా పిలుస్తారు. పక్ష వాతం బారిన పడితే ఇక జీవితమే మారి పోతుంది. ఎందుకంటే ఒకరిపై ఆధార పడాల్సి ఉంటుంది. పక్ష వాతం బారిన వ్యక్తి ఎక్కడికి వెళ్లినా.. మరో వ్యక్తి సహాయం ఖచ్చితంగా ఉండాలి. మెదడులో రక్త సరఫరాకి అంతరాయం కలిగినప్పుడే.. ఈ పక్ష వాతం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు మెదడులో రక్త స్రావం ఆగినా కూడా ఈ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ పక్ష వాతానికి చికిత్స కూడా ఉంది. పక్ష వాతం వచ్చినప్పుడు సరైన చికిత్స తీసుకుంటే..

Paralysis Care: బీ అలర్ట్.. ఈ లక్షణాలు ఉంటే పక్షవాతం వచ్చే అవకాశం ఉంది!
Paralysis
Follow us on

మనిషిని అంత్యంత కుంగుబాటుకు గురి చేసే అనారోగ్య సమస్యల్లో పక్ష వాతం కూడా ఒకటి. దీన్ని స్ట్రోక్ అని కూడా పిలుస్తారు. పక్ష వాతం బారిన పడితే ఇక జీవితమే మారి పోతుంది. ఎందుకంటే ఒకరిపై ఆధార పడాల్సి ఉంటుంది. పక్ష వాతం బారిన వ్యక్తి ఎక్కడికి వెళ్లినా.. మరో వ్యక్తి సహాయం ఖచ్చితంగా ఉండాలి. మెదడులో రక్త సరఫరాకి అంతరాయం కలిగినప్పుడే.. ఈ పక్ష వాతం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు మెదడులో రక్త స్రావం ఆగినా కూడా ఈ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ పక్ష వాతానికి చికిత్స కూడా ఉంది. పక్ష వాతం వచ్చినప్పుడు సరైన చికిత్స తీసుకుంటే.. త్వరగా కోలుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ పక్ష వాతం రావడానికి ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ముందే కనిపెడితే.. ఈ ప్రమాదం బారి నుంచి బయట పడొచ్చు. మరి ఆ లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

తిమ్మిరి పడుతుంది:

పక్ష వాతం రాబోతుంది అనడానికి ముఖ్యమైన లక్షణాల్లో.. తిమ్మిర్లు కూడా
ఒకటి. కాలు, చేతులకు ఎక్కువగా తిమ్మిర్లు పడుతూంటాయి. అంతే కాకుండా ఒక వైపుకు కాలు, చేయి లాగుతూ ఉంటాయి. అదే విధంగా నవ్వుతున్నప్పుడు ముఖం కూడా ఒక వైపుకు లాగుతూ ఉంటే మాత్రం స్ట్రోక్ వస్తున్నట్లు గుర్తించాలి.

ఇవి కూడా చదవండి

మాటలు అస్పష్టంగా వస్తాయి:

సాధారణంగా నోరు తిరగక పోవడం ఒకటైతే.. పక్ష వాతం వచ్చే ముందు మాటలు అస్పష్టంగా వస్తూ ఉంటాయి. మాట్లాడటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది.

గందరగోళంగా ఉంటుంది:

ఏ విషయం గురించి మాట్లాడినా.. సరిగ్గా అర్థం చేసుకోలేక పోవడం. అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. అంతే కాకుండా గందర గోలంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ లక్షణాలు కూడా స్ట్రోక్ కి కారణం అనుకోవచ్చు.

అకస్మాత్తుగా తల నొప్పి:

అకస్మాత్తుగా తల నొప్పి వస్తుంది. భరించ లేనంతగా ఒక్కసారిగా తల నొప్పి వచ్చి వెళ్తూ ఉంటే మాత్రం మెదడులో రక్త స్రావం జరుగుతుందని అర్థం చేసు కోవచ్చు. తల తిరగడం.. మైకం కమ్మినట్టు కూడా ఉంటుంది. అంతే కాకుండా చూపు కూడా అస్పష్టంగా ఉంటుంది. ఎదురుగా ఉన్న వస్తువులు సరిగ్గా కనిపించక పోవడం, గుర్తు పట్టక పోవడం జరుగుతూ ఉంటాయి.

ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. వెంటనే వైద్యుల సహాయం తీసుకోవడం ఉత్తమం. లేదంటే అప్పటికప్పుడే పరిస్థితి చేయి దాటి పోతుంది.

గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.