Bengali Brinjal Posto Recipe: వంకాయలతో ఇలా వండారంటే లొట్టలేసుకు తినేస్తారు.. ఎలా తయారు చేయాలంటే
వంకాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే వంకాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. వంకాయ తిన్న తర్వాత చాలా మందికి అలర్జీ సమస్యలు వస్తుంటాయి. కానీ శీతాకాలంలో వంకాయ తినడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ కాలంలో వంకాయల పంట కూడా బాగానే వస్తుంది. తాజా వంకాయలతో రకరకాల ఆహారాలు తయారు చేసుకుని భోజన ప్రియులు తింటుంటారు. వంకాయ పోష్ వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా..
Updated on: Nov 17, 2023 | 7:54 PM

వంకాయ తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. అయితే వంకాయను తినడానికి చాలా మంది ఇష్టపడరు. వంకాయ తిన్న తర్వాత చాలా మందికి అలర్జీ సమస్యలు వస్తుంటాయి. కానీ శీతాకాలంలో వంకాయ తినడం చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఈ కాలంలో వంకాయల పంట కూడా బాగానే వస్తుంది. తాజా వంకాయలతో రకరకాల ఆహారాలు తయారు చేసుకుని భోజన ప్రియులు తింటుంటారు.

వంకాయ పోష్ వేడి వేడి అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుగుకుందాం.. నల్ల వంకాయలను పెద్ద ముక్కలుగా కోసి దానిపై ఉప్పు, పసుపు వేసుకోవాలి. కొంచెం చక్కెర కూడా జోడించవచ్చు.

ఆ తర్వాత ఒక పెద్ద సైజు టొమాటో తరిగి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో ఆవాల నూనెతో వంకాయలను ఎర్రగా వేయించాలి. వంకాయలను వేయించిన తర్వాత ఒక బిన్నెలో వాటిని తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాణలిలోని నూనెలో నల్ల జీలకర్ర, తరిగిన టమోటాలు వేయాలి

ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేసి మీడియం మంట మీద ఉడికించాలి. అందులో మూడు స్పూన్ల గసగసాల పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసుకుని, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత వేయించిన వంకాయలను అందులో వేసుకోవాలి. పైన ఒక స్పూన్ పచ్చి ఆవాల నూనె వేసుకోవాలి.

ఇప్పుడు పైన తరిగిన పచ్చిమిర్చి వేసి రెండు నిమిషాలు ఉడికిస్తే.. వంకాయ పోష్ రేడి అయినట్లే. దీనిని వేడి వేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది. షుగర్ ఉన్నవారు కూడా ఈ వంకాయ కూరను తినవచ్చు.





























