Non-Veg Side Effects: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా..! అయితే, జాగ్రత్త.. నేరుగా షెడ్డుకే వెళ్తారంట..

వాస్తవానికి కొంతమందికి మాంసాహారం అంటే చాలా ఇష్టపడుతుంటారు.. వీలైతే రోజూ లేదా రోజు విడిచి రోజు మాంసాహారం తింటారు. మాంసం శరీరానికి బలం చేకూర్చడమే కాకుండా ఐరన్, జింక్, విటమిన్లు.. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందనడంలో సందేహం లేదు.

Non-Veg Side Effects: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా..! అయితే, జాగ్రత్త.. నేరుగా షెడ్డుకే వెళ్తారంట..
Chicken Curry
Follow us

|

Updated on: Sep 03, 2024 | 4:46 PM

చాలామందికి ముక్క లేనిదే ముద్ద దిగదు.. చికెన్, మటన్, రెడ్ మీట్ వంటి నాన్ వెజ్ ఫుడ్స్ తినేందుకు తెగా ఇష్టపడుతుంటారు.. అవసరమైతే.. రోజూ తినేందుకు కూడా వెనకాడరు.. అలాంటి వారికి ముప్పు తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు.. వాస్తవానికి కొంతమందికి మాంసాహారం అంటే చాలా ఇష్టపడుతుంటారు.. వీలైతే రోజూ లేదా రోజు విడిచి రోజు మాంసాహారం తింటారు. మాంసం శరీరానికి బలం చేకూర్చడమే కాకుండా ఐరన్, జింక్, విటమిన్లు.. ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు చేస్తుందనడంలో సందేహం లేదు. అయితే రోజూ మాంసాహారం తినేవారిలో మీరు కూడా ఒకరైతే, ఈరోజే మీ అలవాటు మార్చుకోండి. లేకుంటే మీరు గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం, న్యుమోనియా, బ్లడ్ ప్రెజర్, స్థూలకాయం, కొలెస్ట్రాల్ పెరగడం, జీర్ణసమస్యలు, యూరిక్‌యాసిడ్‌ వంటి సమస్యలు, వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికి 3 సార్లు కంటే ఎక్కువసార్లు మాంసం తింటే, అది ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుందని పేర్కొంటున్నారు.

9 రకాల వ్యాధుల ప్రమాదం..

ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన BMC మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒక వ్యక్తి వారానికి 3 రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం, పౌల్ట్రీ మాంసం, చికెన్, టర్కీ వంటి పౌల్ట్రీ మాంసాన్ని తీసుకుంటే.. వారికి 9 రకాల వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతోంది. రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గతంలో జరిగిన అనేక అధ్యయనాలు, పరిశోధనల్లో రుజువైంది. కానీ, ఈ అధ్యయనంలో పలు వ్యాధులతో ఎక్కువ మంది ఆసుపత్రిని సందర్శించే వారిలో.. మాంసాన్ని అధికంగా తీసుకోవడం నేరుగా సంబంధం కలిగి ఉందని వెల్లడించింది.

మీ ఆరోగ్యం క్షీణించవచ్చు..

ఈ పరిశోధనతో పాటు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చాలా సార్లు మాంసం, ముఖ్యంగా రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలుగుతుందని చాలా సార్లు చెప్పింది. బ్రిటన్‌కు చెందిన 4 లక్షల 75 వేల మంది మధ్య వయస్కులను ఈ అధ్యయనంలో చేర్చారు. ఈ సమయంలో, పరిశోధకులు ఈ వ్యక్తుల ఆహారంతో పాటు వైద్య రికార్డులు, ఆసుపత్రిలో చేరిన, మరణించిన వారి డేటాను పరిశీలించారు. ఈ అధ్యయనం 8 సంవత్సరాలు కొనసాగింది. తక్కువ మాంసం తినే వారితో పోలిస్తే, సగటున, వారానికి 3 రోజులు లేదా అంతకంటే ఎక్కువ మాంసాన్ని తినే పాల్గొనేవారి ఆరోగ్యం అధ్వాన్నంగా ఉందని అధ్యయన ఫలితాలు వెల్లడించాయి.

గుండె జబ్బుల ప్రమాదం

ఎక్కువ ప్రాసెస్ చేయని రెడ్ మీట్, ఎక్కువ ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినే వ్యక్తులు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్, న్యుమోనియా, డైవర్టిక్యులర్ డిసీజ్, కోలన్ పాలిప్స్, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే పౌల్ట్రీ మాంసం ఎక్కువగా తినే వ్యక్తులు గ్యాస్ట్రో-ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి, పొట్టలో పుండ్లు, డ్యూడెనిటిస్, డైవర్టిక్యులర్ వ్యాధి, పిత్తాశయ వ్యాధి, మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రోజూ 70 గ్రాముల ప్రాసెస్ చేయని రెడ్ మీట్, ప్రాసెస్ చేసిన మాంసాన్ని తీసుకునే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం 15 శాతం పెరుగుతుంది.. ఇంకా మధుమేహం వచ్చే ప్రమాదం 30 శాతం ఎక్కువ. శరీరానికి ఎంత అవసరమో అంత మాత్రమే మాంసాహారం తీసుకోవాలని ఈ పరిశోధన రుజువు చేస్తోంది. మీరు విచక్షణారహితంగా ఎక్కువగా మాంసాన్ని తింటే, మీకే హాని కలుగుతుందని పరిశోధకులు తెలిపారు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..