AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షుగర్ నుంచి బరువు తగ్గడం వరకు.. చేదుగా ఉండే ఈ ఫైబర్ కూర తింటే ఆ సమస్యలన్నీ దూరమవుతాయ్..

చేదు రుచి కలిగిన మెంతికూరలో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు బరువు నియంత్రణకు సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా దోహదపడుతుంది. ఎముకలు, జుట్టు ఆరోగ్యానికి మేలు చేసే మెంతికూరను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

షుగర్ నుంచి బరువు తగ్గడం వరకు.. చేదుగా ఉండే ఈ ఫైబర్ కూర తింటే ఆ సమస్యలన్నీ దూరమవుతాయ్..
Fenugreek Leaves Benefits
Shaik Madar Saheb
|

Updated on: Nov 10, 2026 | 8:53 AM

Share

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. అందులోనూ రుచికి కాస్త చేదుగా ఉన్నప్పటికీ, పోషకాల నిధి అయిన మెంతికూర వల్ల శరీరానికి అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయి. నిత్య జీవితంలో మెంతికూరను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఏయే ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.. వాస్తవానికి మెంతి కూరలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి..

మెంతి కూర పోషకాలు, ప్రయోజనాలు..

డయాబెటిస్ నియంత్రణ: మధుమేహంతో బాధపడేవారికి మెంతికూర ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. దీనిలో ఉండే ప్రత్యేక పోషకాలు, అమైనో ఆసిడ్లు రక్తంలో చక్కెర (గ్లూకోజ్) స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి టైప్-2 డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది.

బరువు నియంత్రణ: అధిక బరువుతో బాధపడేవారు మెంతికూరను క్రమం తప్పకుండా తీసుకోవడం మంచిది. ఇందులో పీచు (ఫైబర్) పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది త్వరగా ఆకలి కాకుండా నిరోధించి, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల అనవసరమైన కేలరీలను తగ్గించుకుని ఈజీగా బరువు నియంత్రణలో ఉండవచ్చు.

గుండె ఆరోగ్యం – బీపీ నియంత్రణ: మెంతికూరలో ఉండే ‘గెలాక్టోమన్నన్’ అనే సమ్మేళనం, పొటాషియం గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును (High BP) అదుపులో ఉంచడంలో దోహదపడతాయి.

జీర్ణక్రియ మెరుగుదల: మెంతి ఆకుల్లో లభించే డైటరీ ఫైబర్ పేగులను మృదువుగా ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్ వంటి కడుపు సంబంధిత సమస్యలను ఇది సమర్థవంతంగా దూరం చేస్తుంది.

ఎముకలు – జుట్టు సంరక్షణ: మెంతికూరలో విటమిన్-కె, కాల్షియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి. అంతేకాకుండా, దీనిలోని పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

మెంతి కూరను ఎలాగైనా తినొచ్చు.. కూరగా లేదా పప్పులో వేసుకుని మంచిగా తినవచ్చు.. దీని ద్వారా పోషక విలువలు మరింత పెరుగుతాయి.

ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం పచ్చని మెంతికూరను మీ ఆహారంలో భాగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే.. ఏమైనా సమస్యలుంటే మాత్రం నేరుగా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Follow Us