అరటి పండ్లు కొంటున్నారా జాగ్రత్త..! అవి కార్బైడ్‌ వేసి పండించారా.. లేదా సహజంగా పండించారా..?

Banana: సాధారణ మానవుడికి తక్కువ ధరలో లభించే ఏకైక పండు అరటి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. అంతేకాదు పండ్లలో ఏ పండు

అరటి పండ్లు కొంటున్నారా జాగ్రత్త..! అవి కార్బైడ్‌ వేసి పండించారా.. లేదా సహజంగా పండించారా..?
Banana
Follow us
uppula Raju

|

Updated on: Sep 22, 2021 | 9:57 AM

Banana: సాధారణ మానవుడికి తక్కువ ధరలో లభించే ఏకైక పండు అరటి. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. అంతేకాదు పండ్లలో ఏ పండు ఇవ్వని శక్తిని ఇది శరీరానికి అందిస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఏ సమయంలోనైనా తినే ఏకైక పండు అరటి. మరి అలాంటి అరటిపండును కూడా కొంతమంది స్వార్థపరులు విషంగా మారుస్తున్నారు. అందుకే అరటిపండు కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అరటిపండు తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలుసు కానీ మీరు జాగ్రత్తగా లేకపోతే ఇవే పండ్లు మిమ్మల్ని ఆస్పత్రికి కూడా పంపిస్తాయి. వాస్తవానికి ఈ రోజుల్లో వ్యాపారులు అరటిపండ్లను త్వరగా పండించడానికి అనేక షార్ట్‌కట్‌లను వాడుతున్నారు. ముఖ్యంగా కార్బైడ్‌ అనే కెమికల్‌ని వాడి కృత్రిమంగా పండిస్తున్నారు. ఈ విషయం తెలియని వినియోగదారులు వీటిని విక్రయించి అనారోగ్యానికి గురవుతున్నారు. అయితే అరటిపండ్లు కార్బైడ్ ద్వారా పండించారా లేదా సహజసిద్దంగా పండించారా అని తెలుసుకోవడానికి కొన్ని పద్దతులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

కార్బైడ్ పండిన అరటిపండ్లను ఎలా గుర్తించాలి వాస్తవానికి సహజంగా పండిన అరటిపండ్లు లేత గోధుమరంగు, నల్ల మచ్చలను కలిగి ఉంటాయి అవి తినడానికి తియ్యగా ఉంటాయి. అదే సమయంలో కార్బైడ్ లేదా రసాయనాలు వేసి మాగబెట్టిన పండ్లు చాలా సాదాగా, లేత పసుపు రంగులో ఉంటాయి. అరటి చివర నల్లగా కాకుండా ఆకుపచ్చగా ఉంటుంది. సహజ సిద్దంగా పండిన అరటిపండ్లు తియ్యగా ఉంటాయి. వాటిని కొన్న తర్వాత చాలా రోజులు తాజాగా ఉంటాయి. కానీ కార్బైడ్ పండ్లు ఎక్కువ రోజులు ఉండవు. అంతేకాదు కొన్ని చోట్ల పండిన విధంగా మరికొన్ని చోట్ల గట్టిగా, పచ్చిగా ఉంటాయి.

అంతేకాదు వీటిని తింటున్నప్పుడు లోపల గుజ్జు గట్టిగా ఉంటుంది. కానీ పైకి చూస్తే మాత్రం బాగా పండినట్లు పసుపు పచ్చగా కనిపిస్తాయి. అంతేకాదు సహజ సిద్దమైన అరటి తిన్న ఫీలింగ్‌ ఉండదు. వెరైటీ టేస్ట్ ఉంటుంది. అయితే కొంతమంది నీటిద్వారా కూడా ప్రయోగం చేస్తారు. అరటిని నీటిలో వేస్తే మునిగితే సాధారణ అరటిపండు. ఒకవేళ తేలియాడితే కార్బైడ్ పండని చెబుతున్నారు. అయితే దీనికి శాస్త్రీయమైన ఆధారాలు లేవు.

కార్బైడ్ అరటిపండ్లు తినడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి కార్బైడ్‌తో పండిన అరటి పండ్లను తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఇది కాలేయం నుంచి శరీరంలోని అనేక భాగాలపై చెడు ప్రభావాన్న చూపుతుంది. ఇది మీ జీర్ణవ్యవస్థని నాశనం చేస్తుంది. ప్రజలు వాంతులు, విరేచనాలు చేసుకునే అవకాశం ఉంది.

Nani: నయా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేచురల్ స్టార్.. తెలంగాణ కుర్రాడిగా కనిపించనున్న నాని..

Tomato Plant: బాప్‌ రే.. ఇలాంటి చెట్టును మీ జీవితంలో చూసుండరు.. ఒక్క కొమ్మకు 839 టమాటాలు..

గాఢ నిద్రలోంచి సడెన్‌గా లేచిన చిన్నోడు.. ఆ తరువాత వాడు చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!