Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nani: నయా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేచురల్ స్టార్.. తెలంగాణ కుర్రాడిగా కనిపించనున్న నాని..

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి బిజీగా ఉన్నాడు. ఇటీవలే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమా చేశాడు నాని.

Nani: నయా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేచురల్ స్టార్.. తెలంగాణ కుర్రాడిగా కనిపించనున్న నాని..
Nani
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 22, 2021 | 9:56 AM

Nani: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలను లైనప్ చేసి బిజీగా ఉన్నాడు. ఇటీవలే శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీశ్ అనే సినిమా చేశాడు నాని. ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో తెలుగమ్మాయి రీతువర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా తర్వాత నాని శ్యామ్ సింగరాయ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టాక్సీ వాలా దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోనా సెబాస్టియన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు. అలాగే అంటే సుందరానికి అనే సినిమా కూడా చేస్తున్నాడు నాని.. వీటితోపాటు సుకుమార్ శిష్యుడైన శ్రీకాంత్  దర్శకత్వంలో నాని ఓ సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమాలో నాని తెలంగాణ యాసలో మాట్లాడనున్నాడని తెలుస్తుంది. నాని తెలంగాణ ప్రాంతానికి చెందిన యువకుడిగా .. తెలంగాణ యాస మాట్లాడుతూ కనిపిస్తాడట. ఇంతకుముందు నాని తెలంగాణ నేపథ్యంలో సాగే కథల్లో కనిపించాడు. కానీ తెలంగాణ యాసలో మాట్లాడటం మాత్రం ఇదే మొదటిసారి అవుతుంది. గతంలో నాని ఇతరప్రాంత భాషల్లో నటించి ఆకట్టుకున్నాడు. మరి తెలంగాణ యాసలో నాని ఎలా నటిస్తాడో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Tollywood Drugs Case : చివరికి చేరుకున్న ఈడీ విచారణ.. నేడు అధికారుల ముందుకు హీరో తరుణ్

PV Sindhu-Deepika Padukone: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో మ్యాచ్ ఆడిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా..! వైరలవుతోన్న వీడియో‎

Mahesh Babu MAharshi: ‘మహర్షి’ ఖాతాలో మరో అవార్డు.. మహేష్ బాబు మాటల్లో ఆనందం అసలు మేటరేంటంటే..(వీడియో)

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!