Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood Drugs Case : చివరికి చేరుకున్న ఈడీ విచారణ.. నేడు అధికారుల ముందుకు హీరో తరుణ్

డ్రగ్స్.. ఇప్పుడు ఈ పదం టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. ఇప్పటికే పలువురు సినిమా తారలను ఈడీ అధికారులు విచారిస్తున్నారు.

Tollywood Drugs Case : చివరికి చేరుకున్న ఈడీ విచారణ.. నేడు అధికారుల ముందుకు హీరో తరుణ్
Tharun
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 22, 2021 | 7:59 AM

Tollywood Drugs Case : డ్రగ్స్.. ఇప్పుడు ఈ పదం టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. ఇప్పటికే పలువురు సినిమా తారలను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ వ్యవహారంలో జ‌రిగిన లావాదేవీల‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు చేపట్టిన విచారణ చివరిదశకు వచ్చేసింది. డ్రగ్స్‌ కేసులో నిందితుడు కెల్విన్ ఇచ్చిన స‌మాచారం ఆధారంగా ఇప్ప‌టికే అధికారులు టాలీవుడ్ ప్ర‌ముఖులు పూరి జగన్నాథ్, చార్మి, ర‌కుల్ ప్రీత్ సింగ్, నందు, రానా, ర‌వితేజ, న‌వ‌దీప్‌ను విచారించిన విష‌యం తెలిసిందే. రోజుకి ఒక‌రిని కార్యాల‌యానికి పిలిచి అధికారులు ప్ర‌శ్నిస్తున్నారు. డ్ర‌గ్స్‌కు సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జ‌రిగాయ‌న్న విష‌యంపై అధికారులు విచారిస్తున్నారు.

ఇదే కేసులో నోటీసులు అందుకున్న నేప‌థ్యంలో హీరో తరుణ్ హైద‌రాబాద్‌లోని ఈడీ కార్యాల‌యంలో అధికారుల ముందు విచార‌ణ‌కు హాజరుకానున్నారు. మనీ ల్యాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘన పై తరుణ్ ను  ఈడీ ప్రశ్నించనున్నారు. 2017 లో ఎక్సైజ్ శాఖ విచారణ ఎదుర్కొన్నాడు తరుణ్. 2017 జూలై 19 స్వచ్ఛంద ఎక్సైజ్ శాఖ కు బయో షాంపుల్స్ ఇచ్చాడు తరుణ్. తరుణ్ ఇచ్చిన బయో షాంపుల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు లేనట్లు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ రీపోర్ట్ ఇచ్చింది. ఎక్సైజ్ శాఖ చార్జ్ షీట్ లో సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ ఇచ్చింది. తాజాగా మరోసారి కెల్విన్ ఇచ్చిన వివరాలపై  తరుణ్ ను విచారించనున్నారు ఎక్సైజ్ శాఖ. ఎఫ్ లాంజ్ క్లబ్ , కెల్విన్ తో ఉన్న సంబంధాల పై ఆరా తీయనున్న ఈడీ.

మరిన్ని ఇక్కడ చదవండి : 

PV Sindhu-Deepika Padukone: బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుతో మ్యాచ్ ఆడిన బాలీవుడ్ హీరోయిన్ దీపికా..! వైరలవుతోన్న వీడియో‎

Mahesh Babu MAharshi: ‘మహర్షి’ ఖాతాలో మరో అవార్డు.. మహేష్ బాబు మాటల్లో ఆనందం అసలు మేటరేంటంటే..(వీడియో)

Rakul Preet Singh: నేను రకుల్‏ను కాదు…! షాకింగ్ కామెంట్స్ చేసిన పంజాబీ పాప(వీడియో)..

.