AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boda kakarakaya: చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్న కూరగాయ ఇదే..

ప్రస్తుతం రెయినీ సీజన్‌లో కొన్నిరకాలు పండ్లు, కూరగాయలు మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. వాటిల్లో ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనం చేకూర్చేది బోడకాకరకాయ. దీన్ని కొన్ని ప్రాంతాల్లో 'ఆకాకరకాయ, బొంత కాకరకాయ అని కూడా పిలుస్తారు. బోడకాకరతో.. పులుసు, వేపుడు కూర, పొడి చేసుకుని.. ఇష్టంగా తింటుంటారు.

Boda kakarakaya: చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్న కూరగాయ ఇదే..
Boda Kakarakaya
P Shivteja
| Edited By: |

Updated on: Aug 03, 2024 | 1:05 PM

Share

చికెన్, మటన్ కంటే ఎక్కువ పోషకాలు ఉన్న ఒక కూరగాయ గురించి మీకు తెలుసా..? ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.  ఫుల్ పోషకాలు ఉన్న ఒక కూరగాయ ఉంది.. శాఖాహారులకు ఇదో అద్భుతమైన కూరగాయగా చెప్పవచ్చు. దాని పేరు బోడ కాకరకాయ.. కొన్ని ప్రాంతాల్లో బొంత కాకర అని కూడా అంటుంటారు. ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ కూరగాయతో వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను సులువుగా చెక్ పెట్టవచ్చు. వర్షాకాలంలో ఆషాడ, శ్రావణ మాసాల్లో మాత్రమే దొరికే ఈ బోడ కాకరకాయల కోసం జనాలు ఇప్పుడు ఎగబడుతున్నారు.

బోడ కాకరకాయ శరీరానికి ఎంత మంచిది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ B1, B2, B3, B5, B6, B9, B12, విటమిన్ A, విటమిన్ C, విటమిన్ D2, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ H, విటమిన్ K, కాపర్, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. బోడకాకరలో ఉండే ఫ్లవనాయిడ్లు వయస్సు మీరి వచ్చే ముడతలను నియంత్రిస్తాయి. వీటి కూర తింటే.. కండరాలు బలోపేతం అవుతాయి. బోడ కాకరలో ఉండే ఫైబర్.. మలబద్ధకాన్ని, అల్సర్, గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గిస్తుంది. అందుకే బోడకాకరను పోషకాల గని అంటారు.. ఇవి తినడం వల్ల పలు ఇన్ఫెక్షన్లు దరిచేరవని ఫైల్స్, కామెర్ల వ్యాధికి బాగా పనిచేస్తాయని.. నిపుణులు చెబుతున్నారు…అటవీ ప్రాంతంలో మాత్రమే దొరికే ఈ బోడకాకరకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. కేజీ బోడ కాకరకాయ ఇప్పుడు నాలుగు వందల వరకు పలుకుతున్నా.. జనాలు వీటిని కొని తీసుకెళ్లేందుకు వెనకాడడం లేదు..

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..