Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చలికాలంలో మీకు దాహం వేయకపోవచ్చు.. కానీ కచ్చితంగా నీరు తాగాలి.. లేదంటే మీ పని అంతే..

Drinking Water: శీతాకాలం ప్రారంభమైంది. ఇప్పటికే చాలా నగరాలలో చలి విజృంభిస్తుంది. అయితే చలికాలం కావడంతో చెమట ఎక్కువగా పట్టదు. దీంతో మనం ఎక్కువగా

చలికాలంలో మీకు దాహం వేయకపోవచ్చు.. కానీ కచ్చితంగా నీరు తాగాలి.. లేదంటే మీ పని అంతే..
Water
Follow us
uppula Raju

|

Updated on: Nov 09, 2021 | 9:36 PM

Drinking Water: శీతాకాలం ప్రారంభమైంది. ఇప్పటికే చాలా నగరాలలో చలి విజృంభిస్తుంది. అయితే చలికాలం కావడంతో చెమట ఎక్కువగా పట్టదు. దీంతో మనం ఎక్కువగా నీరు తాగడానికి ఇష్టపడం. కానీ ఇది చాలా చెడ్డ అలవాటు. చలికాలంలో నీరు తాగడం చాలా ముఖ్యం. అంతేకాదు శీతాకాలంలో నిరంతరం నీరు తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

1. శీతాకాలపు హైడ్రేషన్ నిజానికి చలికాలంలో చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెచ్చని దుస్తులు వేసుకుని, హీటర్ దగ్గర కూర్చుంటారు. అటువంటి పరిస్థితిలో మీకు దాహం అనిపించకపోవచ్చు. కానీ మీ శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అటువంటి పరిస్థితిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడం చాలా ముఖ్యం. ఈ సమయంలో శరీరానికి స్పందన ఉండదు. అంటే దాహం గుర్తించరాదు. చలికాలంలో నిరంతరం నీటిని తాగుతూ శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే ఇది మీ శరీరంలో ఆక్సిజన్ మొత్తాన్ని నిర్వహిస్తుంది.

2. చర్మానికి ప్రయోజనకరమైనది మీ చర్మానికి నీటి వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. చలికాలంలో చర్మం పొడిబారడం తదితర సమస్యలు ఉంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. దీనితో పాటు నీరు పొడి గాలిలో చర్మ కణాలను తేమగా ఉంచుతుంది. చర్మ సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అందువల్ల దాహం వేయకపోయినా ఎప్పటికప్పుడు నీరు తాగుతూ ఉండాలి.

3. నీరు ఆరోగ్యాన్ని శక్తివంతంగా ఉంచుతుంది మీరు ఎంత ఎక్కువ నీరు తాగితే మీ శరీరం అంత శక్తిని అనుభవిస్తుంది. తాగే నీరు శక్తిని నిలుపుకుంటుంది శరీరానికి అవసరమైనప్పుడు వినియోగిస్తుంది.

4. బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఈ ప్రయోజనాలన్నీ కాకుండా బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా ఎఫెక్టివ్ రెమెడీ. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. కాబట్టి చలికాలంలో నీరు తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

5. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ

చలికాలంలో రోగనిరోధక శక్తిని చెక్ చేసుకోవచ్చు. వాస్తవానికి మీ శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు మీ రోగనిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.

SSC GD Constable Exam 2021: నవంబర్‌ 16 నుంచి SSC GD కానిస్టేబుల్ పరీక్షలు.. హాల్‌టికెట్‌ ఇలా..

PF Clients: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. కనీస పెన్షన్ పెంచే అవకాశాలు..! ఎంతంటే..?

గర్భిణులకు హెచ్చరిక.. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే బిడ్డకి చాలా ప్రమాదం..

Viral Video: రన్నింగ్‌ కారు డిక్కీలో వేలాడుతూ కినిపించిన చేయి...
Viral Video: రన్నింగ్‌ కారు డిక్కీలో వేలాడుతూ కినిపించిన చేయి...
స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. నయా ఫీచర్ రిలీజ్ చేసిన గూగుల్.!
స్మార్ట్ ఫోన్ యూజర్లకు శుభవార్త.. నయా ఫీచర్ రిలీజ్ చేసిన గూగుల్.!
మహిళ ముందు ప్యాంటు జిప్‌ తీసి.. ప్రైవేట్‌ పార్ట్‌ను చూపిస్తూ.. !
మహిళ ముందు ప్యాంటు జిప్‌ తీసి.. ప్రైవేట్‌ పార్ట్‌ను చూపిస్తూ.. !
రిస్క్ చేసేందుకు నేను రెడీ.. పూరీని సపోర్ట్ చేసిన విజయ్ సేతుపతి
రిస్క్ చేసేందుకు నేను రెడీ.. పూరీని సపోర్ట్ చేసిన విజయ్ సేతుపతి
హిందూ ట్రస్ట్‌లో ముస్లింలను అనుమతిస్తారా.. : సుప్రీం కోర్ట్
హిందూ ట్రస్ట్‌లో ముస్లింలను అనుమతిస్తారా.. : సుప్రీం కోర్ట్
అమెరికాపై సరికొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తున్న చైనా..!
అమెరికాపై సరికొత్త ఆయుధాన్ని ప్రయోగిస్తున్న చైనా..!
కిచెన్ పనులు చకచకా కావాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!
కిచెన్ పనులు చకచకా కావాలంటే.. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి..!
మెంతులు తమలపాకులతో కలిపి తినడం వల్ల ఈ సమస్యలు పరార్‌..!
మెంతులు తమలపాకులతో కలిపి తినడం వల్ల ఈ సమస్యలు పరార్‌..!
ఈ పాన్ ఇండియా స్టార్‌ను గుర్తుపట్టారా.?
ఈ పాన్ ఇండియా స్టార్‌ను గుర్తుపట్టారా.?
ప్రిన్సిపాల్‌ రూమ్‌ నిండా పేడపూసిన విద్యార్థులు..ఏసీ అవసరం లేదంటూ
ప్రిన్సిపాల్‌ రూమ్‌ నిండా పేడపూసిన విద్యార్థులు..ఏసీ అవసరం లేదంటూ