AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Japanese Water Therapy: వాటర్ థెరపీ వల్ల నిజంగానే బరువు తగ్గుతారా ? సైన్స్ ఏం చెబుతుందంటే..

సాధారణంగా చాలా మంది బరువు తగ్గడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇటీవల కాలంలో మార్కెట్లోకి ఆన్ లైన్ ద్వారా బరువు తగ్గించడం.. ఎలాంటి

Japanese Water Therapy: వాటర్ థెరపీ వల్ల నిజంగానే బరువు తగ్గుతారా ? సైన్స్ ఏం చెబుతుందంటే..
Japanese Water Therapy
Rajitha Chanti
|

Updated on: Apr 10, 2021 | 8:45 PM

Share

సాదారణంగా చాలా మంది బరువు తగ్గడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఇటీవల కాలంలో మార్కెట్లోకి ఆన్ లైన్ ద్వారా బరువు తగ్గించడం.. ఎలాంటి కెమికల్ ఫుడ్ లేకుండా బరువు తగ్గించడం వంటి మార్గాలు వస్తున్నాయి. ఇక ఇందులో వాటర్ డైట్ కూడా ఒకటి. ఈ వాటర్ డైట్‏లో చెప్పుకోవాల్సింది జపనీస్ వాటర్ థెరపీ. మరీ ఈ జపనీస్ వాటర్ థెరపీ అంటే ఎంటో తెలుసుకుందామా.

పిండి పదార్థాలు, ప్రోటీన్లు మన జీవితంలో ఒక ముఖ్యమైన పదార్థాలు అలాగే నీరు కూడా మనకు అంతే ముఖ్యం. మన శరీరంలో 60% వరకు నీటి శాతం ఉంటుంది. అందుకే ప్రతి రోజూ కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన రోజంతా ఉత్సహంగా ఆరోగ్యంగా ఉంటారట. ఇక రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని నీటితో తేనేను కలిపి తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వలన ఉత్సాహంగా ఉంటారు.

జపనీస్ వాటర్ థెరపీ అంటే ఏమిటి ?

ఆరోగ్యంగా ఉండటానికి రోజూ ఉదయాన్నే నీటిని తీసుకోవాలి. జపనీస్ వాటర్ థెరపీతో కడపు శుభ్రంగా మారడమే కాకుండా… జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఉదయం లేవగానే నీటిని తాగడే వలన బరువు తగ్గడమే కాకుండా.. ఇతర అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. జపనీస్ ఎక్కువగా చల్లని నీరు తాగితే అనారోగ్య సమస్యలు వస్తుంటాయని నమ్ముతుంటారు. దీంతో ఆహారంలోని కొవ్వులు, నూనెలు, మీ జీర్ణ వ్యవస్థలో మార్పులు జరుగుతాయి. దీనివలన జీర్ణక్రియలో మార్పులు రావడంతోపాటు మరిన్న సమస్యలు కలుగుతాయి.

దీనిని ఎలా అనుసరించాలి….

* ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో నాలుగైదు గ్లాసుల గోరువెచ్చటి నీరు తాగాలి. అలాగే బ్రేక్ ఫాస్ట్ చేయడానికి 45 నిమిషాల ముందు నీరు తాగాలి.

* భోజనానికి 15 నిమిషాల ముందు నీరు తాగాలి. అలాగే ఏదైనా తినడానికి తాగడాని కంటే రెండు గంటల సమయం ఉండాలి. * వయసు పైబడిన వారు ఈ డైట్ ఫాలో అవ్వాలి అనుకుంటే ముందుగా ఒక గ్లాసు నీటితో ప్రారంభించాలి. * ఒకవేళ నాలుగు, ఐదు గ్లాసుల నీరు తాగకపోతే.. ప్రతి గ్లాసుకు మధ్య కొంత సమయం తీసుకోవాలి. * ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయాలి. అలాగే రాత్రి పడుకోబోయే ముందు గోరు వెచ్చని నీటిలో ఉప్పు కలిపి పుకిలించాలి. అలాగే నిలబడి తినడం, తాగడం చేయకూడదు.

బరువు తగ్గుతారా ?..

పగలు ఎక్కువగా నీరు తాగడం వలన సంతృప్తి ఉంటుంది. అలాగే ఆకలిని నియంత్రించడంలోనూ సహయపడుతుంది. వయసు పైబడిన వారిపై జరిపిన అధ్యాయనంలో భోజనానికి ప్రతి 30 నిమిషాలకు 500 మిల్లి లీటర్ల నీరు అధిక బరువు ఉన్నవారు వారికంటే 13 % తక్కువ ఆహారాన్ని తింటారని తేలీంది. దీనివలన మీరు స్వీట్ డ్రింక్స్ తాగడం తగ్గించడంలో సహయపడుతుంది. అలాగే బరువు తగ్గడానికి క్యాలరీలను తగ్గిస్తుంది. మొత్తం జీర్ణవ్యవస్థను క్లియర్ చేయడానికి, గట్ ఆరోగ్యాన్ని మెరుగపరుస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది. అలాగే టైప్ 2 డయాబెటిస్, క్యాన్సర్, హేవీ బీపీ సమస్యను నియంత్రిస్తుంది.

జాగ్రత్తలు..

జపనీస్ వాటర్ థెరపీ చేస్తే.. అధిక హైడ్రేషన్ సమస్య భారీన పడతారు. తక్కువగా నీరు తాగినప్పుడు మీ రక్తంలో హైపోనాట్రేమియా లేదా లోబీపీ వస్తుంది. ప్రతి గంటకు నాలుగు కప్పుల కంటే ఎక్కువ నీరు తీసుకోకుడదు.

Also Read: Health Tips: మరింత ఉత్సాహంగా.. ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని సులభమైన టిప్స్ పాటించండి..

Summer Tips: వేసవిలో ఈ హెల్త్ సమస్యలతో బాధపడుతున్నారా ? ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే మీరు ఆరోగ్యంగా ఉన్నట్లే..