AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు తింటున్నది చక్కరేనా లేక సోడానా..! కల్తీ చక్కెరను సింపుల్‌గా ఇలా గుర్తించండి..

తీపి విషంగా మారుతున్న ఈ కాలంలో మీరు వాడుతున్న పంచదార ఎంతవరకు స్వచ్ఛమైనదో మీకు తెలుసా? ఆ తెల్లటి మెరుపు వెనుక వాషింగ్ సోడా, సుద్దపొడి లాంటి ప్రమాదకరమైన రసాయనాలు దాగి ఉండవచ్చు. మీ కుటుంబ ఆరోగ్యానికి ముప్పుగా మారుతున్న ఈ కల్తీ చక్కెరను గుర్తించడం ఎలా? అనేది తెలుసుకుందాం..

మీరు తింటున్నది చక్కరేనా లేక సోడానా..! కల్తీ చక్కెరను సింపుల్‌గా ఇలా గుర్తించండి..
How To Check Sugar Adultery
Krishna S
|

Updated on: May 15, 2026 | 1:34 PM

Share

ఉదయం తాగే టీ నుండి నోరూరించే స్వీట్ల వరకు.. చక్కెర లేనిదే మన రోజు గడవదు. కానీ మీరు వాడుతున్న ఆ తెల్లటి మెరిసే పంచదార మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని మీకు తెలుసా? అవును ఇప్పుడు మార్కెట్లో లభించే చక్కెరలో సుద్దపొడి, వాషింగ్ సోడా, ఇసుక, ప్లాస్టిక్ ముక్కలు కూడా కలుపుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ కల్తీ చక్కెర వల్ల కడుపు నొప్పి నుండి కిడ్నీలు దెబ్బతినడం వరకు అనేక ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మరి మీ ఇంట్లో ఉన్న పంచదార స్వచ్ఛమైనదేనా కాదా అనేది ఎలా గుర్తుపట్టాలో తెలుసుకుందాం..

చక్కెరలో ఏమేం కలుపుతున్నారు?

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకారం.. చక్కెర బరువు పెంచడానికి, చూడటానికి తెల్లగా మెరిసేలా చేయడానికి కొన్ని సంస్థలు దారుణమైన కల్తీకి పాల్పడుతున్నాయి. ముఖ్యంగా సుద్ద పొడి, వాషింగ్ సోడా, తెల్ల ఇసుక, స్టార్చ్, బ్లీచింగ్ రసాయనాలు

కల్తీని గుర్తించే సులభమైన పద్ధతులు

వాటర్ టెస్ట్

ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ చక్కెర వేసి బాగా కలపండి. స్వచ్చమైన చక్కెర అయితే పూర్తిగా కరిగిపోయి నీరు స్వచ్ఛంగా ఉంటుంది. గ్లాసు అడుగున తెల్లటి పొడి లేదా బంకమట్టి లాంటి పదార్థం మిగిలితే అది కచ్చితంగా కల్తీ చక్కెర అని అర్థం.

అరచేతి పరీక్ష

కొద్దిగా చక్కెరను మీ అరచేతిలో వేసుకుని గట్టిగా రుద్దండి. రుద్దిన తర్వాత మీ చేతికి తెల్లటి పొడి అంటుకున్నా లేదా జిడ్డుగా అనిపించినా అందులో సుద్ద పొడి లేదా వాషింగ్ సోడా ఉన్నట్లు అర్థం.

నిప్పు పరీక్ష

ఒక స్పూన్‌లో కొద్దిగా చక్కెర తీసుకుని స్టవ్ మీద వేడి చేయండి.ః

స్వచ్ఛమైనది: చక్కెర కరిగి గోధుమ రంగులోకి మారుతుంది.

కల్తీ: మండినప్పుడు వింత వాసన రావడం, నల్లటి పొగ రావడం లేదా బూడిద పేరుకుపోవడం వంటివి జరిగితే అది కల్తీదే.

రంగును గమనించండి

పంచదార మరీ విపరీతమైన మెరుపుతో, ప్లాస్టిక్ లాగా తెల్లగా ఉంటే అందులో ప్రమాదకరమైన బ్లీచింగ్ ఏజెంట్లు కలిపారని అనుమానించాలి.

ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

కల్తీ చక్కెరను వాడటం వల్ల కేవలం అజీర్ణం మాత్రమే కాదు, అది దీర్ఘకాలంలో ప్రాణాంతక సమస్యలకు దారితీస్తుంది.

జీర్ణక్రియ: కడుపులో గ్యాస్, తీవ్రమైన నొప్పి, అజీర్ణం.

అవయవాలు: రసాయనాల ప్రభావంతో కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది.

ప్రమాదం: ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు షుగర్ వ్యాధిగ్రస్తులపై ఈ రసాయనాలు తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

తక్కువ ధరకు వస్తోంది కదా అని నాణ్యత లేని చక్కెరను కొనుగోలు చేయకండి. పంచదార కొనేటప్పుడు ఈ చిన్న పరీక్షలు చేసి మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వద్దు.

Follow Us